Andhra Pradesh:ఏపీ నుంచి అబుదాబికి

From AP to Abu Dhabi

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర, విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వీటిలో ఓ అంతర్జాతీయ సర్వీస్ కూడా ఉంది.  విశాఖపట్నం – అబుదాబి  మధ్య ఈ సర్వీస్ ప్రారంభమవుతుంది.  జూన్ 13 నుంచి ఈ సర్వీస్ ప్రారంభం అవుతుంది.

ఏపీ నుంచి అబుదాబికి..

విజయవాడ, మే 12
ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర, విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వీటిలో ఓ అంతర్జాతీయ సర్వీస్ కూడా ఉంది.  విశాఖపట్నం – అబుదాబి  మధ్య ఈ సర్వీస్ ప్రారంభమవుతుంది.  జూన్ 13 నుంచి ఈ సర్వీస్ ప్రారంభం అవుతుంది.  విశాఖపట్నం నుండి   యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి ఎయిర్ పోర్టుకు ఈ సర్వీస్ ఉంటుంది.  ఇండిగో ఎయిర్‌లైన్స్ నడిపే అంతర్జాతీయ సర్వీసు ఇది.  ఈ విమానం వారంలో నాలుగు రోజులు నడుస్తుంది. ఈ సర్వీసు విశాఖపట్నాన్ని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంతో అనుసంధానిస్తుంది, వ్యాపారం  పర్యాటకాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. విశాఖపట్నం – భువనేశ్వర్ మధ్య మరో ఇండిగో సర్వీస్ ప్రారంభం కానుంది. జూన్  పన్నెండు నుంచి ఈ సర్వీస్ ప్రారంభిస్తారు.  విశాఖపట్నం నుండి ఒడిశాలోని భువనేశ్వర్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ కొత్త సర్వీసు  రెండు తూర్పు భారత నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, విద్య, వ్యాపారం,పర్యాటకానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

విజయవాడ ఎయిర్ పోర్టు నుండి ఓ కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది.    జూన్ 2 విజయవాడ నుండి బెంగళూరుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడిపే కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది.  ఈ సర్వీసు ఏపీ రాజధాని ప్రాంతాన్ని భారతదేశ ఐటీ హబ్‌తో అనుసంధానిస్తుంది, వ్యాపార ప్రయాణికులకు , విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విశాఖ- విజయవాడ మధ్య సర్వీసులు పెద్దగా లేవని మాజీ  మంత్రి గంటా శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణమంగా  విజయవాడ – విశాఖపట్నం  మధ్య జూన్ 1 నుంచి ఓ సర్వీస్ ను ప్రారంభిస్తున్నారు.  ఇండిగో ఎయిర్‌లైన్స్ నడిపే ఉదయం విమాన సర్వీసు, విజయవాడ నుండి 7:15 AMకి బయలుదేరి 8:25 AMకి విశాఖపట్నంలో ల్యాండ్ అవుతుంది. తిరిగి విశాఖపట్నం నుండి 8:45 AMకి బయలుదేరి 9:50 AMకి విజయవాడ చేరుకుంటుంది. ఈ సర్వీసు రాష్ట్రంలోని రెండు కీలక నగరాల మధ్య వేగవంతమైన రవాణాను సులభతరం చేస్తుంది

Read more:Andhra Pradesh:రాజకీయాలకు గల్లా ఫ్యామిలీ దూరమేనా

Related posts

Leave a Comment