AP :మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుంది. నేడో, రేపు కొడాలి నాని అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసుకు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణంతో ఇప్పటికే కొడాలి నానిపై లుక్ అవుట్ వారెంట్ జారీ చేశారు. అయితే కొడాలి నాని గత కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స తీసుకుంటున్నాడు.
కొడాలికి బిగ్ షాక్
విజయవాడ, మే 28
మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుంది. నేడో, రేపు కొడాలి నాని అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసుకు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణంతో ఇప్పటికే కొడాలి నానిపై లుక్ అవుట్ వారెంట్ జారీ చేశారు. అయితే కొడాలి నాని గత కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స తీసుకుంటున్నాడు.కొడాలి నానిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడారని కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూకబ్జాలకు సంబంధించి ఆరోపణలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, జగనన్న కాలనీలో మెరక పేరుతో రూ.45 కోట్ల అవినీతి, విద్యుత్ అక్రమాలపై విజిలెన్స్ ఆరోపణలు ఉన్నాయి. వీటిన్నింటిపై విచారణ జరుగుతోంది.ఇదిలా ఉండగా కొడాలి నాని ఇటీవల హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ లో ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నానికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగింది.
దీంతో ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.నాని ఆరోగ్యం ఇంకా సెట్ కాలేదని మెరుగౌన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కృష్ణ జిల్లా ఎస్పీ నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నాని అమెరికా వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ నోటీసులు జారీ అయినట్లు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసు జారీ అయ్యింది. ఏపీలో కొడాలి నానిపై ఇప్పటికే అనేక కేసులు నమోదు కావడంతో.. దేశం విడిచి పారిపోతారనే ఊహాగానాలతో ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన రోజే మాజీ మంత్రి కొడాలి నాని ట్విస్ట్ ఇచ్చారు.. ఆయన హైదరాబాద్‌లో ఓ శుభాకార్యానికి హాజరై అందరికి షాకిచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక వేడుకలో కనిపించారు. ఒక వైపు ఏపీ పోలీసులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామని హడావిడి చేస్తుంటే.. కొడాలి నాని మాత్రం హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ముంబైలో సర్జరీ తర్వాత కొడాలి నాని బయటకు వచ్చారు. ఈ సర్జరీ తర్వాత ఆయన చాలా సన్నగా అయ్యారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర హోంశాఖలోని ఇమిగ్రేషన్ విభాగం ఆయనపై LOC (లుకౌట్ సర్క్యులర్) జారీ చేసింది. ఆయన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉండటంతో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కొడాలి నాని అక్రమాలపై విచారణ జరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. గుండె సమస్యతో బాధపడుతూ ముంబైలో సర్జరీ చేయించుకోగా.. ఆయన మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా LOC జారీ చేశారు.. అలాగే ఆయన పాస్‌పోర్ట్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.నానిపై ఇప్పటికే కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడారని కేసులు నమోదయ్యాయి. ఇసుక, మట్టి, భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. టిడ్కో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని.. జగనన్న కాలనీలో మెరక పేరుతో రూ.45 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
విద్యుత్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది.అలాగే 2022లో నిబంధనలకు విరుద్ధంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. గుడివాడ ఆటోనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం గోదాము ఖాళీ చేయించారని ఆయనతో పాటు అప్పటి జేసీ మాధవీలత, ఇతరులపై బాధితుడు ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై గుడివాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భీమేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన సుమారు 9 ఎకరాల భూమిని కాజేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫైలు కనిపించకుండా పోయిందనే ఆరోపణలు వచ్చాయి.. అప్పట్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదట. ఈ క్రమంలో కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.కొడాలి నాని ఇటీవల అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే గుండెం సంబంధిత సమస్యలు ఉన్నాయని.. మెరుగైన వైద్యం కోసం ముంబైకు ప్రత్యేక విమానంలో తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా కీలకమైన కార్డియాక్ సర్జరీలను చేశారు. కొడాలి నాని ముంబైలోనే కొద్దిరోజులు ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.. ఆయన కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.
