Hyderabad:కేబినెట్ రేసులో విజయశాంతి

Vijayashanti in the cabinet race

Hyderabad:తెలంగాణ క్యాబినేట్ విస్తరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోల్డ్ స్టోరేజీలో పెట్టినా..నేతల ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. ఎవరికి వారు ఆ అమాథ్య పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చట్టసభల్లో అడుగు పెట్టిన నేతలు సైతం మంత్రి పదవి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెంగాణ కాంగ్రెస్ లో చర్చంతా తాజా ఎమ్మెల్సీ విజయశాంతి గురించే జరుగుతోంది.

కేబినెట్ రేసులో విజయశాంతి

హైదరాబాద్,మే 3
తెలంగాణ క్యాబినేట్ విస్తరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోల్డ్ స్టోరేజీలో పెట్టినా..నేతల ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. ఎవరికి వారు ఆ అమాథ్య పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చట్టసభల్లో అడుగు పెట్టిన నేతలు సైతం మంత్రి పదవి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెంగాణ కాంగ్రెస్ లో చర్చంతా తాజా ఎమ్మెల్సీ విజయశాంతి గురించే జరుగుతోంది. నెల రోజుల క్రితం పెద్దల సభ శాసనమండలిలో అడుగు పెట్టిన ఆమె..మంత్రి పదవిపై కన్నేశారన్న టాక్ విన్పిస్తోంది. ఎలాగైనా క్యాబినేట్లో స్థానం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట.తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం సామాజిక సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతో విస్తరణ అంశం వాయిదా పడింది. క్యాబినేట్ కూర్పులో ఖచ్చితంగా సామాజిక సమతుల్యం పాటించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇదే అవకాశాన్ని అదునుగా భావిస్తున్న విజయశాంతి..అదే అస్త్రాన్ని సందిస్తున్నారు. తెలంగాణలో బీసీలలో బలమైన సామాజికవర్గమైన ముదిరాజ్ వర్గానికి క్యాబినేట్ ఛాన్స్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఒక్కరు మాత్రమే ఆ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు.

క్యాబినేట్ విస్తరణ జరిగితే ఆయనకే పక్కా ఛాన్స్ అని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్గా రేసులోకి విజయశాంతి వచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఈక్వేషన్స్ తో పెద్దల సభలోకి విజయశాంతి అడుగు పెట్టారు. ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఆమె క్యాబినేట్ లో చోటు కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే అందుకోసం సామాజిక సమీకరణాల్లో భాగంగా విజయశాంతి కూడా ఇప్పుడు ముదిరాజ్ కోటాను ప్రస్తావిస్తోంది.చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్నా.. ఇప్పటి వరకు ఏనాడు కూడా కులం అంశాన్ని ప్రస్తావించ లేదు. గతంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు కులం కాలమ్ లో ఏ కులం పేరును ప్రస్తావించలేదు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆమె ఏ సామాజికవర్గం అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్గా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయశాంతి బీసీ వర్గంగా చెప్పుకున్నారు. ఇందులో ముదిరాజ్ సామాజికవర్గంలో అంతర్భాగంగా ఉన్న ఓ వర్గం తనదంటూ..ఆ కోటాలో తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారట.మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్న విజయశాంతి ఒక్కసారిగా ఎమ్మెల్సీ పదవితో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇప్పుడు ఏకంగా ముదిరాజ్ కోటాలో మంత్రిపదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయశాంతి చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి. ఆమె కోరుతున్నట్లు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

Read more:Andhra Pradesh:మళ్లీ టీడీపీ వైపు

Related posts

Leave a Comment