Tirumala : తిరుమలలో ఆఫ్‌లైన్ లో ఇస్తున్న శ్రీవారి దర్శన టికెట్ల మిగిలిపోయాయంటూ సోషియల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. వాస్తవానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు.
శ్రీవారి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు
టీటీడీ
తిరుమలలో ఆఫ్‌లైన్ లో ఇస్తున్న శ్రీవారి దర్శన టికెట్ల మిగిలిపోయాయంటూ సోషియల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. వాస్తవానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు. ఏరోజు కూడా ఆన్ లైన్ లో శ్రీవారి దర్శన టికెట్లు మిగిలిన సందర్భం లేదు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్నారు. గత కొన్ని రోజుల్లో ఆఫ్ లైన్ లో పదుల సంఖ్యలో తగ్గాయేకాని, కొందరు వ్యక్తులు సోషియల్ మీడియాలో గతవారం రోజుల్లో వందల సంఖ్యలో టికెట్లు మిగిలిపోయినట్లు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం. అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Read more:Andhra Pradesh : కేశినేని నాని అక్రమాలపై సిబిఐ డైరెక్టర్ కు లేఖ ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాస్
