Harish Rao : రైతు భరోసాపై రచ్చ: రేవంత్-హరీశ్‌రావుల మధ్య మాటల యుద్ధం

Harish Rao Slams Revanth Reddy Over Comments on KCR and Rythu Bharosa

Harish Rao : రైతు భరోసాపై రచ్చ: రేవంత్-హరీశ్‌రావుల మధ్య మాటల యుద్ధం:రైతు భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదికపైనైనా చర్చకు తాను సిద్ధమని, తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపిస్తానని ఆయన ‘ఎక్స్’ వేదికగా సవాల్ విసిరారు.

కేసీఆర్‌పై సంస్కారహీనమైన వ్యాఖ్యలు: హరీశ్‌రావు విమర్శ

రైతు భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదికపైనైనా చర్చకు తాను సిద్ధమని, తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపిస్తానని ఆయన ‘ఎక్స్’ వేదికగా సవాల్ విసిరారు. ప్రభుత్వ కార్యక్రమంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని మరోసారి ప్రదర్శించారని హరీశ్‌రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలోని అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆయన ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై భరోసా లేకనే విధిలేని పరిస్థితుల్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం ప్రపంచం నవ్విపోతోందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయలేని దద్దమ్మ ఇప్పుడు అన్నారం, సుందిళ్ల కూడా కూలాయని అంటున్నారని, “అది నోరా మోరా?” అని హరీశ్‌రావు ప్రశ్నించారు.దమ్ముంటే, ఇసుమంతైనా నిజాయితీ ఉంటే 30 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసాను అమలు చేసి మాట్లాడాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

అలాగే, సన్న వడ్లకు రూ.1,200 కోట్ల బోనస్ బకాయిలు రైతుల ఖాతాల్లో వేయాలని ఆయన కోరారు. హామీలపై ప్రశ్నిస్తున్నందుకే తమపై బూతులతో చెలరేగుతున్నారని, అయినా తాము సంయమనం కోల్పోబోమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు అబద్ధాల పుట్టను బద్దలు కొడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. “గెలిచిన వాడు రాజు, ఓడిపోయిన వాడు రావణాసురుడు” అని సీఎం అంటున్నారని, మరి రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా అని హరీశ్‌రావు నిలదీశారు.

Read also:Cargo Ship : మెక్సికో వెళ్తున్న కార్గో నౌక సముద్రంలో మునక

 

Related posts

Leave a Comment