Sri Sailam project : శ్రీ శైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం

srisailam-dam

Sri Sailam project : తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం డ్యామ్‌‌కు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలోనే పలు నిపుణుల బృందాలు, ప్యానళ్లు, కమిటీలు డ్యామ్‌ను పరిశీలించాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి నీరు కిందపడే ప్రాంతంలో భారీ గుంత ఏర్పడి.. అది అంతకంతకూ పెరిగి పునాదులు బయటపడే వరకు వెళ్లింది అంటున్నారు.

శ్రీ శైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం

కర్నూలు, జూన్ 2
తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం డ్యామ్‌‌కు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలోనే పలు నిపుణుల బృందాలు, ప్యానళ్లు, కమిటీలు డ్యామ్‌ను పరిశీలించాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి నీరు కిందపడే ప్రాంతంలో భారీ గుంత ఏర్పడి.. అది అంతకంతకూ పెరిగి పునాదులు బయటపడే వరకు వెళ్లింది అంటున్నారు. నేషనల్ ‌డ్యామ్ సేఫ్టీ అథారిటీ శ్రీశైలం డ్యామ్ దుస్థితిపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. అసలు శ్రీశైలం డ్యామ్ ఎందుకు ప్రమాదంలో చిక్కుకుంది?.. ఎలా ఆ సమస్యను ఎలా పరిస్కరించాలనే చర్చ జరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ప్లంజ్‌పూల్‌ గుంత పెద్దది కావడం వల్ల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.డ్యామ్ దగ్గర నీరు భూమిని కోసుకుంటూ వెళ్లడంతో.. డ్యామ్ అడుగు భాగానికి కూడా ఆ గుంత వ్యాపిస్తుందని.. దాని వల్ల డ్యామ్ పునాదులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలా శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది.

శ్రీశైలం డ్యామ్ స్పిల్‌వే నుంచి గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలిన సమయంలో.. ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు నేలపై పడితే గుంతలా ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కూడా అదే జరుగుతోంది.. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచన సమయంలో నీళ్లు పడిన చోట భూమిపై గుంత ఏర్పడి ప్రాజెక్ట్ పునాదుల వరకు వెళుతోంది.. దానిని ప్లంజ్ పూల్ అంటారు. అలా నీళ్లు పడటంతో రివర్ బెడ్‌ను కోసేస్తోంది.. ఆ క్రమంలో గుంత పెద్దదిగగా మరుతుంది. అక్కడ గుంత చాలా లోతు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి 1980లోనే ఈ సమస్య ఉందని గుర్తించారు.. దాని కోసం యాప్రాన్‌ను రక్షణగా నిర్మించారు. అలాగే ఇబ్బందులు రాకుండా స్టీల్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో ఎత్తు నుంచి నీళ్లు కిందపడినా భూమి కొట్టుకుపోకుండా ఉంటుంది. కానీ 2009లో వరదలతో ఆ స్టీల్ సిలిండర్లు కూడా కొన్ని కొట్టుకుపోగా.. మరికొన్ని ధ్వంసం అయ్యాయి.

ఆ గుంతను సెట్ చేయడానికి, అక్కడ మళ్లీ స్టీల్ సిలిండర్లు పెట్టడానికి, ఆ ప్లంజ్ పూల్ విస్తరించకుండా తక్షణ ఏర్పాట్లు చేయడానికి.. ఎడమ, కుడి వైపుల నది ప్రవాహం ఎక్కువగా వచ్చిన సమయంలో కొండచరియలు విరిగిపడకుండా, కోతకు గురికాకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గతంలో రిపేర్లకు రెండున్న కోట్లు అడిగితే రూ.40 లక్షలే ఇచ్చారని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది. ప్లంజ్ పూల్ పూర్తిస్థాయిలో రీడిజైన్ చేయాలన్నారు. మోడ్రన్ జియో టెక్నికల్ ఎక్విప్‌మెంట్ ఉండాలని సూచించారు.. ఈ ఎక్విప్‌మెంట్ ఉంటే డ్యామ్‌కు ఇబ్బందులుంటే పసిగట్టి అలర్ట్ చేస్తుంది అంటున్నారు.గతంలోనే ఈ ప్లంజ్‌పూల్‌ గుంత వల్ల శ్రీశైలం డ్యామ్‌‌కు ఇబ్బంది ఉందని నిపుణుల బృందాలు హెచ్చరించాయి. అయితే ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై అధ్యయనం కోసం రూ.14 కోట్లు మంజూరు చేసింది అంటున్నారు. ప్రాజెక్టులోని ప్లంజ్‌పూల్‌ సమస్యపై అధ్యయనం చేయడానికి సీడబ్ల్యూపీఆర్‌సీకి అనుమతి ఇవ్వాలని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు.

అలాగే ఇటీవల దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో చర్చించారు. తెలంగాణ అధికారులు వెంటనే అధ్యయనం చేయించాలని కోరారు.. ఏపీ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డు సూచించింది. ప్రాజెక్టు ఇంజనీర్లు చంద్రబాబు ప్లంజ్‌పూల్‌ సమస్య, మరమ్మతుల గురించి వివరించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేఆర్‌ఎంబీ సూచించింది. అయితే ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులుపడలేదు అంటున్నారు.నిండు కుండలా ప్రాజెక్టులు భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు పెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో…కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జురాల నిండుకుండలా ఉండగా… మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.కొద్దిరోజులుగా ఏపీకి ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కృష్ణమ్మ పరుగులు మొదలయ్యాయి. బేసిన్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ పరిధిలోని జూరాల నిండుకుండను తలపిస్తోంది.

జూరాలతో పాటు సంకుశుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారుజూరాలకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో… కొన్ని గేట్లు కొంత మేర పైకి ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.ఇక జూరాల నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యామ్ లోని నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది ఉదయం రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 826 దాటింది. నీటినిల్వ 46 టీఎంసీలకుగా నమోదైంది. ఎగువ నుంచి 55,999 క్యూసెక్కుల వరద వస్తుండగా…ఔట్ ఫ్లో 800 ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరికొన్ని రోజులు పడుతుంది.

పూర్తిస్థాయిలో డ్యామ్‌ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈసారి ముందుగానే నిండటం ఖాయంగానే కనిపిస్తోంది.మరోవైపు నాగార్జున సాగర్ లో పరిస్థితి చూస్తే ఇవాళ ఉదయం రిపోర్ట్ ప్రకారం నీటిమట్టం 512.4 గా ఉంది. ఇక 135.78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 10,176 గా ఉండగా… 10,176 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 159.77 అడుగుల నీటిమట్టం ఉంది. 25.29 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.

Read more:Class X : టెన్త్ వాల్యుయేషన్ లో తీవ్రమైన లోపాలు

Related posts

Leave a Comment