Telugu Film Chamber : తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్నిరోజులుగా నడుస్తున్న థియేటర్ల బంద్ అంశంపై తెలుగు ఫిలిం ఛాం బర్ కీలకప్రకటన చేసింది.విశాఖ దొండపర్తిలోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో అధ్యక్షుడు భరత్భూషణ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సినీ పరిశ్రమ సమస్యల అధ్యాయానికి కమిటీ
తెలుగు ఫిలిం ఛాం బర్ కీలకప్రకటన
విశాఖపట్నం
తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్నిరోజులుగా నడుస్తున్న థియేటర్ల బంద్ అంశంపై తెలుగు ఫిలిం ఛాం బర్ కీలకప్రకటన చేసింది.విశాఖ దొండపర్తిలోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో అధ్యక్షుడు భరత్భూషణ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సంక్షోభానికి కీలకంగా భావిస్తున్న సినిమా టిక్కెట్ల రేట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలు, పైరసీ, రెమ్యూనరేషన్లు, తిను బండారాల ధరలు వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. మూడు విభాగాల నుంచి తొమ్మిదేసి మంది తో మొత్తంగా 27 మందితో సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నిర్ణయించాలని సమావేశం తీర్మానించింది. త్వరలోనే కమిటీ సభ్యులను వెల్లడి స్తామని ప్రకటించింది.
రాష్ట్రప్రభుత్వం సినీ పరిశ్రమ మధ్య సానుకూల వాతావరణం నెలకొనేలా చూడాలనే అభిప్రా యం సమావేశంలో వ్యక్తమైంది. రాష్ట్రప్రభుత్వం చెబు తున్న సినీ పాలసీపై కూడా కసరత్తు చేయాలని నిర్ణయిం చింది. ఈ మేరకు కొత్త సినిమాల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడాలనీ, పెద్ద సినిమాలకు ధరల పెంపునకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేయా లనీ, థియేటర్లు యథావిధిగా పనిచేసేలా ఛాంబర్ తరపున ప్రయత్నాలు కొనసాగిస్తామని అధ్యక్షులు భరత్భూషణ్, ప్రధాన కార్యదర్శి దామోదరప్రసాద్ వెల్లడించారు.
సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, పర్సంటేజీల విధానం వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చిం చినట్లు సి.కల్యాణ్ తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చినట్లు ఆయన వెల్లడించారు.డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాలకు చెందిన సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని,ప్రతి సంఘం నుంచి తొమ్మిది మంది చొప్పున మొత్తం 27 మంది సభ్యులతో ఈ కమిటీ ఉంటుందని సి.కల్యాణ్ పేర్కొన్నారు. కమిటీలో పాలుపంచుకునే సభ్యుల పేర్లను తొలుత ప్రభుత్వానికి తెలియజేస్తామని, అనంతరం సోమవారం నాడు కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తా మని ఆయన స్పష్టం చేశారు.
Read more:Sunny Yadav : ట్రావెల్ జ్యో, బయ్యాకు సంబంధాలు.. ఆరా తీస్తున్న అధికారులు
