Kavitha : జయశంకర్ సార్ విగ్రహ గద్దె కూల్చివేత: కవిత ఆగ్రహం:రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం నిర్మిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ వేదికను అధికారులు కూల్చివేశారు. నమాజ్ చెరువు కట్ట శివారులో అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ అధికారులు జేసీబీతో ఈ గద్దెను నేలమట్టం చేశారు.
గంభీరావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ వేదిక కూల్చివేత – కవిత తీవ్ర ఖండన
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం నిర్మిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ వేదికను అధికారులు కూల్చివేశారు. నమాజ్ చెరువు కట్ట శివారులో అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ అధికారులు జేసీబీతో ఈ గద్దెను నేలమట్టం చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ఆమె గుర్తుచేశారు.
నమాజ్ చెరువు కట్టపై ఆయన విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన వేదికను కూల్చివేయడం దారుణమన్నారు. “జై తెలంగాణ” అనని ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ మహనీయులకు ఇలాంటి అవమానాలు జరగడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, అలాగే గద్దెను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
Read also:AP : ఏపీలో భారీ వర్షాలు: ఐదు రోజులపాటు విస్తారంగా వానలు
