AP : లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు: రజత్ భార్గవను ప్రశ్నించిన సిట్

Andhra Pradesh Liquor Scam: Former IAS Rajat Bhargava Appears Before SIT

AP : లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు: రజత్ భార్గవను ప్రశ్నించిన సిట్:ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో, నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ విచారణకు హాజరయ్యారు. ఉదయం తన ఆరోగ్యం బాగోలేదని, విచారణకు హాజరుకాలేనని సిట్ అధికారులకు రజత్ భార్గవ సమాచారం పంపారు.

ఏపీ లిక్కర్ స్కామ్: కీలక మలుపు, రజత్ భార్గవ సిట్ విచారణకు హాజరు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో, నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ విచారణకు హాజరయ్యారు. ఉదయం తన ఆరోగ్యం బాగోలేదని, విచారణకు హాజరుకాలేనని సిట్ అధికారులకు రజత్ భార్గవ సమాచారం పంపారు.

అయితే, సిట్ విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేయడంతో, ఆయన తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లతో సహా విచారణకు వచ్చారు. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని విచారించి, అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రజత్ భార్గవ విచారణ ఈ కేసులో తదుపరి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.

Read also:PriyaNair : వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్న ప్రియా నాయర్

 

Related posts

Leave a Comment