IndependenceDay : విజయవాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ

79th Independence Day Celebrations in Vijayawada - CM Chandrababu Hoists Flag

IndependenceDay : విజయవాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ:విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

విజయవాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ

విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ వేడుకలకు విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి తన వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. ఈ ఉత్సవాల్లో ప్రదర్శించిన శకటాలు, పరేడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పరేడ్‌లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను సీఎం పరిశీలించారు.

Read also:Diabetes : షుగర్ నియంత్రణకు సహాయపడే నాలుగు ఆహారాలు

 

Related posts

Leave a Comment