సంక్షిప్త వార్తలు:05-05-2025:పోలీస్ శాఖ అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉండే సంస్థ . ప్రతి పౌరుడు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులు నేరుగా పోలీస్ అధికారులకు తెలియజేసే హక్కు కలిగి ఉన్నారు. ఇందులో ఎటువంటి మధ్య వర్తులు, సిఫార్సు దారులు, లేదా ఎలాంటి ఇతర ప్రభావాలు అవసరం లేదు . మేము (పోలీస్ అధికారులు) ప్రజల అవసరాలను గౌరవించి, పారదర్శకమైన విధానాలతో స్పందించడానికి కట్టుబడి ఉన్నాము.
నన్ను నేరుగా వచ్చి కలవచ్చు
సమస్యలు పరిష్కరిస్తాం
జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
పోలీస్ శాఖ అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉండే సంస్థ . ప్రతి పౌరుడు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులు నేరుగా పోలీస్ అధికారులకు తెలియజేసే హక్కు కలిగి ఉన్నారు. ఇందులో ఎటువంటి మధ్య వర్తులు, సిఫార్సు దారులు, లేదా ఎలాంటి ఇతర ప్రభావాలు అవసరం లేదు . మేము (పోలీస్ అధికారులు) ప్రజల అవసరాలను గౌరవించి, పారదర్శకమైన విధానాలతో స్పందించడానికి కట్టుబడి ఉన్నాము. ఎస్పీ కార్యాలయం ప్రతిరోజూ విధి విధానాల ప్రకారం ప్రజలకు అందు బాటులో ఉంటుంది.
ప్రజలు తమ సమస్యలను స్వయంగా చెప్పగలగడం ద్వారా సమస్యల పరిష్కారం త్వరితగతిన జరుగుతుంది. మధ్యవర్తులు లేదా ఇతరులు ప్రజల సమస్యలను తప్పుగా లేదా వక్రీకరించిన విధంగా తెలియజేసే అవకాశం ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం మరియు న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో, ఎవరూ ఎటువంటి భయాందోళన లేకుండా మహబూబాబాద్ జిల్లా ప్రజలు నేరుగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ ని కలవ వచ్చునని, పోలీసులు, ప్రజల స్నేహితులుగా ఉండే విధంగా వ్యవహరించడమే మా లక్ష్యమని ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది.
యువజన కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..

జమ్మికుంట పట్టణానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మరియు యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్, పట్టణంలోని వివాహ వేడుకకు ఆదివారం హాజరయ్యారు. అనంతరం యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, ఆహ్వానం మేరకు జమ్మికుంట లోని వారి యువజన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, వారిని శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో; కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమారస్వామి, యువజన కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్, యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శులు వొల్లాల రవి, యేబూషి అజయ్, నాయకులు పచ్చిమట్ల భాను, వెంకటేష్, ఎండీ.జావిద్, సల్మాన్, చిరంజీవి, సత్యనారాయణ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు…
గార్డియన్ స్కూల్ లో 50% ఫీజు రాయితీతో అడ్మిషన్లు ప్రారంభం..!
ప్రైవేటు ఇంగ్లీష్ విద్యను పేద విద్యార్థులకు అందించడమే ముఖ్య ఉద్దేశం.

ప్రస్తుత పరిస్థితులలో ప్రవేటు పాఠశాలలు అధిక ఫీజుల దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో. జమ్మికుంట కొత్తపల్లిలోని సాహితీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గార్డియన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ తో పేద మధ్యతరగతి పిల్లలకి నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ రాముల కుమార్, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదవాడు
ప్రైవేట్ పాఠశాలలో చదవాలనేటువంటి కోరికను నెరవేర్చుటకు గార్డియన్ స్కూల్ నీ స్థాపించామని ఇట్టి సదవకాశాన్ని జమ్మికుంట పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు తమ పిల్లలను గార్డియన్ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని అడ్మిషన్ల కోసం పాఠశాల కార్యాలయ ఫోన్ నెంబర్ (8121266344) గల నెంబర్ కు సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అంకుష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలి అమలాపురం

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్ష పదవి చేపట్టిన చర్ల జగ్గిరెడ్డి తొలిసారిగా అమలాపురం ప్రెస్ క్లబ్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా దళారులకు మద్దతు పలుకుతోంది. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలి. కమీషన్ల కోసం అమరావతి పనులను ప్రారంభించడం కాదు. ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతుందని అన్నారు.
