Telangana :తెలంగాణలో రెబల్స్ పార్టీలకు తలనొప్పిగా మారాయి.ఒకటి ప్రాంతీయ పార్టీ. ఇంకో రెండు జాతీయ పార్టీలు. ఆ మూడు పార్టీల్లో ఆ ముగ్గురు సీనియర్ లీడర్లు. జీవన్‌రెడ్డి ఫక్తు కాంగ్రెస్ వాది. కవిత బీఆర్ఎస్లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఇక రాజాసింగ్ కట్టర్ హిందూ.
పార్టీల్లో రెబల్స్ బెడద.
హైదరాబాద్, జూన్ 2
తెలంగాణలో రెబల్స్ పార్టీలకు తలనొప్పిగా మారాయి.ఒకటి ప్రాంతీయ పార్టీ. ఇంకో రెండు జాతీయ పార్టీలు. ఆ మూడు పార్టీల్లో ఆ ముగ్గురు సీనియర్ లీడర్లు. జీవన్‌రెడ్డి ఫక్తు కాంగ్రెస్ వాది. కవిత బీఆర్ఎస్లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఇక రాజాసింగ్ కట్టర్ హిందూ. బీజేపీ కోర్ ఐడియాలజీకి దగ్గరగా మాట్లాడుతుంటారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు సొంత పార్టీల అ్రగనేతలే టార్గెట్‌గా బాణాలు వదలుతున్నారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి.ప్రస్తుతం తెలంగాణలో ప్రైమ్ టైమ్ డిబేట్‌గా ఉంటున్న టాపిక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం. ఇంతకాలం పార్టీలో ప్రతి ఒక్కరూ అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించిన ఆమె..ఇప్పుడు ఏకంగా అన్న కేటీఆర్ టార్గెట్ విమర్శలు సంధిస్తున్నారు. ఆమె రాసిన లెటర్, ఆపై సంచలన కామెంట్స్, తర్వాత ఆఫ్ ది రికార్డులో చేసిన కామెంట్స్‌తో బీఆర్ఎస్లో ప్రకంపనలకు తెరలేపింది.కవిత స్టేట్మెంట్స్ ప్రత్యర్థి పార్టీలకు అస్ర్తంగా మారడంతో కారు పార్టీ లీడర్లకు మింగుడు పడడం లేదు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ చేస్తున్న కామెంట్స్ సొంత పార్టీ నేతలను ఇరుకున పెడుతున్నాయి. పోనీ కవితపై చర్యలు తీసుకుందామంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదట.
ఇలా బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు ఎమ్మెల్సీ కవిత.క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే కాషాయ పార్టీలో కూడా కల్లోలం మొదలైంది. గత కొంతకాలంగా బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న.. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం భగ్గుమంటుంది. రాజాసింగ్ ఎక్కుపెడుతున్న మిసైల్స్‌తో..సొంత పార్టీ లీడర్లు గందరగోళంలో ఉన్నారట. రాజాసింగ్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. గతంలో సొంత పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలను పాత ఇనుప సామానుతో పోల్చి చర్చకు తెరలేపారు రాజాసింగ్.లేటెస్ట్గా ఎమ్మెల్సీ కవిత వాఖ్యలను కోట్ చేస్తూ..తమ పార్టీ నేతలకు మరింత ఇరుకున పెడుతున్నారు. పార్టీలో దొంగలున్నారని..మంచి ప్యాకేజీ ఇస్తే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారంటూ రాజాసింగ్ చేసిన కామెంట్స్ కమలం పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీలో..రాజాసింగ్ ఎక్కుపెడుతున్న బాణాలకు సమాధానం ఇచ్చుకోలేకపోతున్నారు. బీజేపీ నాయకత్వం సైలెంట్‌గా ఉంటున్న.. రాజాసింగ్ మాత్రం రోజుకో మిస్సైల్‌ను పేల్చుతున్నారు.
ఒకవేళ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉందట. అందుకే ఏ ఒక్క నేత కిమ్మనడం లేదట.కాంగ్రెస్ పార్టీలో కూడా ఓ సీనియర్ లీడర్ అసంతృప్తి గళం రాష్ట్ర నేతలకు హెడెక్‌గా మారిందట. హస్తం పార్టీలో సీనియర్ లీడర్‌గా పేరున్న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ ఉంటోంది. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పి గా మారిందట. పార్టీ ఫిరాయింపులతో మొదలుకొని..ఈ మధ్య జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన పలువురు మంత్రులు ఎదుటే తన వాయిస్ వినిపిస్తూ జీవన్‌రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.మంత్రి పొంగులేటి జగిత్యాలకు వచ్చిన సందర్భంగా మీరే రాజ్యం ఏలుకొండంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ కాక పుట్టించాయి. అంతకు ముందు జానారెడ్డి, రేవంత్ రెడ్డిలకన్నా తానే సీనియర్ అని… పార్టీ ఫిరాయింపులు సరికాదంటూ ఆయన వదిలిన బాణాలు ఎవరెవరికో తగిలాయి. ఇలా జీవన్ రెడ్డి వ్యవహారం హస్తం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా… ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఇలా ఆ ముగ్గురు నేతల తీరు..ఆ మూడు రాజకీయ పార్టీలను ఉక్కపోతకు గురిచేస్తుంది.
ఈ ముగ్గురు విషయంలో మూడు పార్టీలకు ఏం చేద్దామన్నా ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారిందట. చూడాలి మరి.. వీరి అసంతృప్తి గళానికి ఆయా పార్టీల అగ్రనేతలు ఎలాంటి ముగింపు ఇస్తారో.రాజాసింగ్ ఆరోపణలు తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు వ్యతిరేకంగా కరీంనగర్ నుంచి యుద్ధం మొదలైందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రత్యక్షంగా చెప్పకపోయినా, పరోక్షంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే గతంలో కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య బండి సంధి కుదిర్చిన విషయం తెలిసిందే. తాజాగా రాజాసింగ్ తిరిగి సంజయ్‌పైనే వ్యాఖ్యలు చేయడంతో, కమలదళంలో అంతర్గత కలహాలు మరింత తీవ్రరూపం దాల్చినట్టు కనపడుతోంది.ఇదిలా ఉంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన జైలులో ఉన్న సమయంలోనే తన వద్దకు వచ్చిందని ఆమె వెల్లడించారు. తాను పార్టీకి వీడ్కోలు చెప్పేలా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనికి కొనసాగింపుగా, తాను కేసీఆర్‌ను మాత్రమే నాయకుడిగా చూస్తానని, ఇతరుల నాయకత్వాన్ని తాను అంగీకరించనని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్, కవిత చేసిన ఆరోపణల్లో నిజమెంత ఉందని అన్నారు. పెద్ద మొత్తంలో ప్యాకేజీ వస్తే తమ నేతలు ఇప్పటికే బీఆర్ఎస్తో కలిసిపోతారని విమర్శించారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ తమ నేతలు ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకుని బీజేపీకి నష్టం తెచ్చారని ఆరోపించారు.
Read more:Sunny Yadav : అడ్డంగా బుక్కైన సన్నీ.
