Amaravati : అమరావతి అభివృద్ధి కోసం రెండో దశ

Second phase for Amaravati development

Amaravati :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో అమరావతి అభివృద్ధి కోసం రెండో దశలో 40 నుంచి 45 వేల వేల ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తోంది. ఈ భూమిని భూ సమీకరణ ద్వారా, భూసేకరణ ద్వారా తీసుకోవాలా అనే అంశాలను పరిశీస్తోంది.

అమరావతి అభివృద్ధి కోసం రెండో దశ

విజయవాడ, జూన్4
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో అమరావతి అభివృద్ధి కోసం రెండో దశలో 40 నుంచి 45 వేల వేల ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తోంది. ఈ భూమిని భూ సమీకరణ ద్వారా, భూసేకరణ ద్వారా తీసుకోవాలా అనే అంశాలను పరిశీస్తోంది. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయాలను తీసుకునే పనిలో ఉన్నారు. అమరావతిలో కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టు తరహాలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాలు అవసరం అవుతాయన్నారు మంత్రి నారాయణ. పెట్టుబడిదారులు అమరావతికి రావాలంటే 5 వేల ఎకరాలతో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఉండాలన్నారు.

స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,500 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుందన్నారు.హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు అప్పట్లో దూరదృష్టితో ఆలోచించారన్నారు. అప్పట్లోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అన్ని వేల ఎకరాలు ఎందుకు? బేగంపేటలో ఉన్న ఎయిర్‌పోర్టు చాలదా? అని విమర్శించారన్నారు. అప్పుడు కనుక శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మించకపోతే ఇప్పుడు అక్కడికి వస్తున్న విమానాల్లో పది శాతం కూడా బేగంపేటలో దిగలేవని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు రావాలంటే అంతర్జాతీయ విమానాలు దిగేలా ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే అమరావతిలోనూ 5,000 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్లాన్ చేశామన్నారు.అమరావతి పరిధిలో ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో 12,000 ఎకరాలు భూసమీకరణ ద్వారా సేకరించడానికి రైతులు ముందుకు వచ్చారన్నారు మంత్రి నారాయణ.

ఈ రెండో విడతలో రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులకు మూడేళల్లో మూడేళ్లలో అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగిస్తామన్నారు. రాజధానిలో విద్య, వైద్య సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇవ్వాలని సీఆర్డీఏ నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. కోర్ క్యాపిటల్ ఏరియాలో రూ.3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసిన విషయాన్ని తెలిపారు.అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే ఏడాదికి రెండు మూడు పెద్ద ఈవెంట్లు జరుగుతాయని.. ఇలా దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు, ఫ్యాన్స్ వస్తారన్నారు.. అప్పుడు హోటల్స్ కూడా ఏర్పాటవుతాయన్నారు. ఇలా ప్రభుత్వానికి GST పెరుగుతుంది అన్నారు. భూసమీకరణలో తీసుకున్న భూమిలో రైతులకు స్థలాలు కేటాయించగా సీఆర్డీఏకు 25 శాతమే మిగులుతాయన్నారు. ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీలకు 10,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.

Read more:Government Employees : జూన్ 10 వరకు బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Related posts

Leave a Comment