సంక్షిప్త వార్తలు : 04-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 04-06-2025:కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులం ఏంటని తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో బోరబండ లో మీడియా సమావేశం నిర్వహించారు.

స్థానిక క్యాబ్ వెండర్స్ అవకాశాలు ఇవ్వాలి

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులం ఏంటని తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో బోరబండ లో మీడియా సమావేశం నిర్వహించారు. హైటెక్ సిటీ లో క్యాబ్ వేండర్స్ గా ముంబై, చెన్నై, నోయిడా, ఢిల్లీ, బెంగళూరు రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తూ తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్స్కు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.

మన తెలంగాణ రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్,  వెండర్స్ సమస్యలు తీరాలంటే తమకు అసోసియేషన్ ఉండాలని దాదాపు 100 మందితో కూడిన  తెలంగాణ లోకల్ క్యాబ్స్, వెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధ్యక్షుడిగా బంగి మల్లేష్, ఉపాధ్యక్షుడిగా గద్వాల వెంకటేష్, జనరల్ సెక్రెటరీగా గోపు రవీందర్, జాయింట్ సెక్రటరీగా వాసలి మధు,  ట్రెజరర్ గా వెంకటేష్ ను నియమించడం జరిగిందన్నారు.

లోకల్ క్యాబ్ డ్రైవర్స్, వెండర్స్కు ఎటువంటి సమస్యలు వచ్చినా 24/7 వారికి అందుబాటులో ఉంటామన్నారు.  హైదరాబాద్ ఫ్రీ జోన్ కనుక అందరికీ అవకాశం ఇచ్చినట్టే మొదటిగా స్థానిక లోకల్ క్యాబ్ వెండర్స్ కు అవకాశం కల్పించాలని సాఫ్ట్వేర్, ఐటి కంపెనీలను కోరారు. లేనియెడల లోకల్ క్యాబులను నిలిపివేసి నిరసనలు తెలుపుతామన్నారు. బయటి రాష్ట్రాల వెండర్స్కు అవకాశం ఇస్తూ సబ్ వేండర్స్ గా మాత్రమే లోకల్ వెండర్స్కు అవకాశం కల్పిస్తూ తమ కష్టార్ జీతాన్ని నాన్ లోకల్ వెండర్స్ లాభాలను అర్జిస్తున్నాయని వాపోయారు.

మలబార్ డైమండ్స్ కొత్త షోరూమ్ ప్రారంభం

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దాని అంధేరీ షోరూమ్ - ఇండియన్ రిటైలర్‌ను పునఃప్రారంభించింది

హైదరాబాద్
ప్రముఖ ఆభరణాల రిటైల్ విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన సరికొత్త షోరూమ్ను ఎ.ఎస్. రావు నగర్లో ఏర్పాటు చేసింది. ఉప్పల్ ఎమ్మెల్యే  బండారి లక్ష్మ రెడ్డి, కార్పొరేటర్ శ్రీమతి శిరీష రెడ్డి తో కలిసి ఈ షోరూంను ప్రారంభించారు. నగరానికి చెందిన ప్రముఖులు, వినియోగదారులు, మలబార్ యాజమాన్య బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎ.ఎస్. రావు నగర్ ప్రజలకు మా అత్యద్భుతమైన ఆభరణాల సేకరణలు, ప్రపంచస్థాయి షాపింగ్ అనుభూతిని అందించడానికి మేమెంతో సంతోషిస్తున్నామని మలబార్ గ్రూప్ చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎ.ఎస్. రావు నగర్ షోరూం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ కస్టమర్లకు ప్రత్యేక ప్రారంభ ఆఫర్లను ప్రకటించింది

మా భూములే లాక్కుంటారా అంటూ కడుపుమండి తిరగబడ్డ రైతులు
ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన
పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పు

Tension in Pedda Dhanwada
రాజోలి జూన్ 4
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మా భూములే లాక్కుంటారా అంటూ కడుపుమండి రైతులు తిరగబడ్డారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టారు. గాయత్రి ఇథనాల కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పు పెట్టారు.

కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను కర్రెలు చేత పట్టుకొని తరిమేశారు. అందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైతులు భారీ సంఖ్యలో ఉండటంతో పోలీసులు నిలువరించలేకపోయారు. గతంలో పనులు నిలిపివేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ మరోసారి కంపెనీ యాజమాన్యం పనులు ప్రారంభించడంతో రైలు ఆందోళనకు దిగి వాహనాలును తగలబెట్టారు.

Related posts

Leave a Comment