Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అట్టహాసంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం

Actress Mrinal Thakur CMR shopping mall opening

0
  • ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల
  • గదీశ్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ
  • సందడి చేసిన సినీ నటి మృనాల్ ఠాకూర్
  • అంగరంగ వైభవంగా కొనసాగిన ప్రారంభ వేడుకలు ప్రజల నుండి విశేష స్పందన

వస్త్ర ప్రపంచంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్న సీఎంఆర్ 23వ షాపింగ్ మాల్ ను మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ లు సీఎంఆర్ షాపింగ్ మాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన గావించారు వేద పండితులను ఆశీర్వచనాలతో సన్నాయి మృదంగంతో ఆహుతులకు స్వాగతం పలికారు. అనంతరం సినీ నటి సీతారామ ఫెమ్ మృనా ల్ ఠాకూర్ సందడి చేశారు అన్ని ఫ్లోర్లు అంతా కలియ తిరుగుతూ తనదైన శైలిలో ప్రజలను వినియోగదారులను అభిమానులను ఆకట్టుకునే విధంగా హావభావాలతో సందడి చేశారు.

CMR shopping mall opening

తదుపరి సీఎంఆర్ అధినేత మా ఊరు వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వస్త్ర సౌరంభం సూర్యాపేటలో లభిస్తుందని ప్రజలు తమకు కావలసిన అన్ని రకాల వేడుకలకు సీఎంఆర్ తగువిధంగా అన్ని మోడల్స్ లో కుటుంబం అంతటికి నచ్చే విధంగా వస్త్రాలు అందించడం సిఎంఆర్ ప్రత్యేకత అన్నారు సినీనటి మృనాల్ ఠాకూర్ మాట్లాడుతూ సీఎంఆర్ 23వ షోరూం మరింత దినదినాభివృద్ధి చెంది షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందనే నమ్మకం సీఎంఆర్ కల్పిస్తుందన్నారు.

ప్రతివారికి సరసమైన ధరలలో అన్ని రకాల వస్త్రాలు సీఎంఆర్ లో లభిస్తున్నాయని సీఎంఆర్ ను ఆదరించి ప్రజలు షాపింగ్ చేయాలని కుటుంబ సమేతంగా సీఎం ఆర్ కు విచ్చేసి అందరికీ అందుబాటులో ఉన్న ధరల ప్రకారం కొనుగోలు చేయాలని ఆమె ఆకాంక్షించారుమంగళవారం ఉదయం నుండి యాంకర్లు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా సీఎంఆర్ ఫణి భాను రమణమూర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి జ్యోతి కరుణాకర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie