BSNL : విజయవాడలో BSNL 4G ప్రారంభం: అమరావతిలో జనవరి నాటికి తొలి క్వాంటం కంప్యూటర్ – సీఎం చంద్రబాబు

CM Chandrababu Announces Quantum Computer for Amaravati

విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని భద్రతకు క్వాంటం కంప్యూటింగ్ ఎంతో అవసరమని వ్యాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో జరిగిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా క్వాంటం మిషన్‌ను ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే అమరావతిలో అత్యాధునిక క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మరియు బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి చంద్రబాబు మాట్లాడుతూ, సాంకేతిక…

Read More

Pawan Kalyan Suvvi Suvvi Lyric Video from OG Movie | OG Movie Song Lyrics

suvvi suvvi song from og

Song Title : SUVVI SUVVI Album / Movie : They Call Him OG Written & Directed by Sujeeth Music by Thaman S Production: DVV Entertainment Presented by: Smt D.Parvathi Produced by DVV Danayya, Kalyan Dasari DI : Annapurna Studios Audio on: Sony Music “Suvvi Suvvi Lyric Video from OG Movie | Pawan Kalyan | Sujeeth | Thaman S | DVV Danayya” Song Lyrics ఉండిపోవా ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా విడివిడిగానే అడుగులు ఉన్నా విడిపడలేని నడకలలాగా ఎవరు రాయని ప్రేమకధ ఇది…

Read More

KTR : కాంగ్రెస్ అసమర్థ పాలనపై కేటీఆర్ ఫైర‍్

ktr

నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు మూడు రోజులు గడుస్తున్నా వెలికితీయకపోవడంపై ఆగ్రహం ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదని విమర్శ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలు మూడు రోజులు గడిచినా వెలికితీయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురి మృతదేహాలు ఇప్పటికీ గుర్తించలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు చివరి చూపు కూడా కల్పించలేని పరిస్థితి మానవత్వం లేని పాలనకు ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. నాలాల్లో బలి అయిన ముగ్గురి మృతదేహాలను కూడా ప్రభుత్వం గుర్తించకపోతే, బీఆర్ఎస్ నిశ్శబ్దంగా ఉండదని కేటీఆర్ హెచ్చరించారు. Read : AP : మెగా…

Read More

YS Viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు – సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక

supreme court

వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ తదుపరి దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ కోర్టు ఆదేశిస్తే ముందుకెళతామని స్పష్టం చేసిన దర్యాప్తు సంస్థ దర్యాప్తు కొనసాగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు కేసులో తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పిటిషనర్లు కోరినట్లుగా విచారణను ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ, దానిపై కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. మంగళవారం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్…

Read More

Polvaram Project : పోలవరం ప్రాజెక్టు పనులకు గడువు 2027 జులై

Polavaram

గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారన్న సాయి ప్రసాద్ నీటి సంరక్షణ చర్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన  కేంద్ర ప్రభుత్వ నిధులతో 38,457 చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధికి సంకల్పించామని వెల్లడి పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అయితే, గోదావరి పుష్కరాలు జరగబోయే జులై 2027 నాటికే ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలనే దిశగా వేగంగా పనులు జరుగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తెలిపారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు డిసెంబరు 2027 కంటే ముందే, అంటే పుష్కరాల నాటికే పనులు పూర్తి చేయాలని…

Read More

గజ్వేల్‌లో వినాయక నగర్ కాలనీలో కుల వివాదం – ఆరు నేమ్ బోర్డులు ఏర్పాటు

6 names to a colony

వీధి మొదట్లో రాత్రికి రాత్రే వెలిసిన ఆరు నేమ్ బోర్డులు మొత్తం 25 ఇళ్లు మాత్రమే ఉన్నా కాలనీకి ఆరు పేర్లు నాడు “వినాయక నగర్”.. నేడు కులం పేర్లతో కొత్త బోర్డులు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని వినాయక నగర్ కాలనీలో కుల వివాదం కొత్త రూపు దాల్చింది. రాత్రికి రాత్రే కాలనీ ప్రవేశద్వారం వద్ద ఆరు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 25 ఇళ్లే ఉన్న ఈ కాలనీని ప్రారంభంలో “వినాయక నగర్” అని పిలిచేవారు. అయితే, ఇటీవల చోటుచేసుకున్న వివాదం కారణంగా కుల విభేదాలు బయటపడ్డాయి. ఇక్కడి కుటుంబాల్లో 70 శాతం ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఉండగా, మిగతా 30 శాతం ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. మెజార్టీ వర్గం తమ కులం పేరుతో…

Read More

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is coming to Delhi is making the hearts of Union ministers start pounding.

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కీలక ప్రకటన చేసిన సీఎం  కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రైతులకు ప్రోత్సాాహకంగా ఇస్తామన్న చంద్రబాబు రబీ సీజన్ లో అధార్ అనుసంధానంతో ఇంటి వద్దకే ఎరువులు పంపిణీ  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు ముఖ్య ప్రకటన చేశారు. యూరియా వినియోగాన్ని తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తా కొకటికి రూ.800 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర జీఎస్‌డీపీపై సమీక్ష నిర్వహించిన సీఎం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. యూరియా విక్రయాల నిర్వహణ సక్రమంగా జరిగి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. ఎరువుల శాఖలో సరైన…

Read More

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సం_భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం

himachal floods

డెహ్రాడూన్‌ శివార్లలో భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం సహస్రధార ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ప్రఖ్యాత టపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు ఉత్తరాఖండ్ మరోసారి ప్రకృతి ఆగ్రహానికి గురైంది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి దారితీసింది. సహస్రధార ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో డెహ్రాడూన్‌లో పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. తమ్సా నది ఉప్పొంగి ఆలయ ఆవరణలోకి ప్రవేశించింది. హనుమాన్ విగ్రహం వరకు నీరు చేరినా, గర్భగుడి మాత్రం…

Read More

యువ తెలంగాణ ఛాంపియన్‌షిప్ 2025: జోగులాంబ లయన్స్ అద్భుత విజయం

yuva kabaddi

ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికయ్యింది – తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్ హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో బుధవారం యువ తెలంగాణ ఛాంపియన్‌షిప్ 2025 ఘనంగా ముగిసింది. ఫైనల్లో జోగులాంబ లయన్స్ అద్భుత ప్రతిభను ప్రదర్శించి, భద్రాద్రి బ్రేవ్స్‌ను 35-21 తేడాతో ఓడించి విజేతలుగా నిలిచాయి. సూఠపర్ 4 దశలో ఉత్కం పోరు ఫైనల్‌కు ముందు సూపర్ 4 దశలో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. మొదటి మ్యాచ్: యాదాద్రి యోధులు, బసర విద్యుత్‌పై 66-45 తేడాతో గెలిచారు. రైడింగ్, డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చాటిన యోధులు, ఫైనల్‌కు చేరుకోకపోయినా తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించారు. మరోవైపు వరుస పరాజయాలతో విద్యుత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. చివరి మ్యాచ్: భద్రాద్రి బ్రేవ్స్, జోగులాంబ లయన్స్‌పై 45-44…

Read More

Pawan Kalyan : ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

pawan kalyan

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 54వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా మోదీ ఎక్స్ (X)లో పోస్టు చేస్తూ,“శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అనేకమంది ప్రజల హృదయాలలో, మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మంచి పాలనపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో NDAని బలోపేతం చేస్తున్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. సినీ రంగంలో పవర్ స్టార్గా పేరు తెచ్చుకుని, ప్రజా జీవితంలోనూ విశేషమైన ప్రభావాన్ని చూపారు. ‘తోలి ప్రేమ’ (1998), ‘ఖుషి’ (2001), ‘గబ్బర్ సింగ్’ (2012), ‘అత్తారింటికి దారేది’…

Read More