Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

దోస్త్..మేరా దోస్త్.. ఎవరికి ఎవరు.

0

ఏపీలో పొత్తు రాజకీయం పై క్లారిటీ వస్తోంది జగన్ వర్సస్ చంద్రబాబు రాజకీయ యుద్దంలో ఎవరెటు వైపో స్పష్టత కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ టీడీపీతో పాటుగా బీజేపీతో పొత్తు ఖాయమని ధీమాగా చెప్పారు. బీజేపీ ఒప్పుకోకుంటే ఒప్పిస్తామని చెప్పుకొచ్చారు. కానీ, ఢిల్లీ కేంద్రంగా సమీకరణాలు మారిపోతున్నాయి పొత్తు ప్రతిపాదన తరువాత బీజేపీ నాయకత్వం ఏపీ సీఎం జగన్ తో మరింత సఖ్యతగా కనిపిస్తోంది. మహానాడు సమయంలో అటు ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలతో పొత్తుల లెక్కలు మారిపోతున్నాయి.

 

ఏపీలో పొత్తు రాజకీయం :ఏపీలో పొత్తు రాజకీయం ఢిల్లీ కేంద్రంగా సాగుతోంది. బీజేపీ నిర్ణయం పైన పొత్తుల వ్యవహారం ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు కూడా ఈ రెండు పార్టీలతో పొత్తుకు సిద్దంగా ఉందనే అభిప్రాయం కలిగింది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవటంతో తెలుగు రాష్ట్రాల్లో పొత్తుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ, ఢిల్లీ నుంచి దీనికి భిన్నంగా సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సుదర్ఘ కాలంగా కేంద్రం వద్ద అభ్యర్ధిస్తున్న అంశాలను ఈ మధ్య కాలంలో వేగంగా ఢిల్లీలో క్లియరెన్స్ లభిస్తోంది.

 

అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీ పెద్దల వద్ద ప్రాధాన్యత పెరిగినట్లు స్పష్టంగా కనపిస్తోంది.  సీఎం జగన్ కు ప్రాధాన్యత:నూతనంగా నిర్మించిన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బీజేపీ ముఖ్యలు నుంచి ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం అందింది. అదే సమయంలో ప్రధాని పార్లమెంట్ ప్రారంభించటం పైన వివాదం మొదలైంది. ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఈ కార్యకరమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ సమయంలో సీఎం జగన్ చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ప్రధాని మోదీని అభినందించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరారు.

జగన్ ట్రాప్ లో చంద్రబాబు.

సీఎం స్వయంగా పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లో తొలి వరసులో జగన్ కు సీటు కేటాయించారు. ఇవన్నీ చూసిన తరువాత టీడీపీ, జనసేనకు బీజేపీ నేతలు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టత వచ్చింది. పవన్ చేతిలో నిర్ణయం:బీజేపీ తమతో కలిసి రాదని దాదాపు టీడీపీకి అర్దమైంది. మహానాడు సమయంలనే పార్టీలో ముఖ్య నేతల మధ్య ఢిల్లీ పరిణామాలపై చర్చ జరిగింది. సీఎంకు బీజేపీ మద్దతుగా నిలుస్తున్న సమయంలో టీడీపీ, జనసేన మాత్రమే పొత్తుతో వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

 

బీజేపీ తో పొత్తు లేదనే అంతిమ నిర్ణయానికి వస్తే వామపక్షాలను కలుపుకొని వెళ్లే ఛాన్స్ ఉంది. బీజేపీతో ప్రతిపాదన చేసింది పవన్ కావటంతో.. ఇప్పుడు పవన్ మరోసారి బీజేపీతో చర్చలు చేస్తారా..లేక..బీజేపీ వైఖరి కారణంగా ఇక టీడీపీతో కొనసాగాలని నిర్ణయిస్తారా అనేది ఇప్పుడు పవన్ నిర్ణయించాల్సి ఉంది.దీంతో..రానున్న కొద్ది రోజుల్లోనే బీజేపీతో పొత్తు కొనసాగింపు..టీడీపీతో అధికార పొత్తు పైన పవన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని, జనసేన, బిజెపి పొత్తుతో ఏపీలో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఏదైనా చెబితే అది వారి సొంత అభిప్రాయం కింద పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

 

పురోగతి లేక అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందని.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందని తెలిపారు. పార్టీ విధానంలో మేమంతా పని చేస్తామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకే కేంద్రం సహకారం అనే వాదనలో వాస్తవం లేదని కొట్టి పారేశారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే కేంద్రం కోరుకుంటుందని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టారు. పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తుందని,పోలవరం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి సరిగా లేదని వ్యాఖ్యానించారు. చేసిన పనులకు బిల్లులు పూర్తి గా ఇవ్వలేదన్నారు.

 

మోడీ తొమ్మిదేళ్లలో పూర్తి పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, మోడీ మంచి పాలన అందిస్తున్నారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. 2024 ఎన్నికలలో దేశ వ్యాప్తంగా మోడీ హవాతో విజయం సాధిస్తామని,దేశ ఆర్ధికాభివృద్ధి ఎంతో పెరిగిందని చెప్పారు.భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల నుంచి కూడా తరలి వస్తున్నారని, సుస్థిరమైన ప్రభుత్వం, సమర్ధవంతంగా మోడీ పాలనే ఇందుకు కారణం అన్నారు. మహారాష్ట్రలో శివసేన బిజెపితోనే ఉందన్నారు. మమతా బెనర్జీ, కేసీఆర్ విధ్వంసకర విధానాలు అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie