Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీలో ఫ్లెక్సీ వార్.

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ-జనసేన మధ్య ఫ్లెక్సీ యుద్ధం నడుస్తూ ఉంది. ఓ వైపు సోషల్ మీడియాలో వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ పార్టీల మధ్య ఫ్లెక్సీల యుద్ధం నడుస్తోంది. వైసీపీ వచ్చే ఎన్నికల్లో సోలోగా పోటీ చేస్తూ ఉండగా.. జనసేన ఎవరి తరపున పోరాడుతుందో తెలియని పరిస్థితి. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఓట్లను చీల్చమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇది వరకే స్పష్టం చేయగా.. తాము ప్రజలకు చేస్తున్న మంచిని ఓర్వలేక కొందరు దుర్మార్గులు చేతులు కలిపారంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు.

 

ఇన్ని రోజులూ మాటలకే పరిమితమైన ఈ గొడవలు కాస్తా.. ఇప్పుడు ఫ్లెక్సీ వార్ కు కారణమయ్యాయి.పేదలకి పెత్తందారు. లకి మధ్య జరిగే యుద్ధం’ పేరుతో రాష్ట్రంలో వైసీపీ ఏర్పాటు చేస్తున్న పెక్సీల పట్ల జనసేన వర్గాల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు వైసీపీ ఏర్పాటు చేయగా.. ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరుతూ జన సేన నాయకులు ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం సిటీలో వైసీపీ ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాక్షస పాలన అంతం..ప్రజా పాలన ఆరంభమంటూ జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 

జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వివేకా మొండెం ఉండేలా ఫ్లెక్సీలను తయారీ చేయించారు. జగన్‌ షర్ట్‌పై 6093 నంబర్, వైసీపీ నేతలతో కూడిన జగన్ ఫ్లెక్సీని జనసేన ఏర్పాటు చేసింది. సిరిపురం వీఐపీ రోడ్‌లో పక్కపక్కనే ఇరువర్గాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక విజయవాడలోనూ విజయవాడ పటమట సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం సాక్షిగా ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. విగ్రహం చుట్టూ వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల ఏర్పాటుపై వివాదం రేగింది. ఎన్టీఆర్‌, సీఎం జగన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ , కడియాల బుచ్చిబాబు ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

దోస్త్..మేరా దోస్త్.. ఎవరికి ఎవరు.

నందమూరి తారక రామారావు శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు చుట్టూ వెలిశాయి. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో రెచ్చగొట్టే చర్యలకు దేవినని అవినాష్ పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్లెక్సీలను ఎవరూ తొలగించకుండా పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.దేవినేని అవినాష్ తీరుపై విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని నెహ్రూకు ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న మాట వాస్తవమని.. నెహ్రూ పసుపు జెండా పార్టీవ దేహం మీద కప్పించుకున్నారన్నారు. చంద్రబాబు అనాడు స్వయంగా పార్టీ జెండా కప్పారని.. కానీ నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ చర్యలను ఖండిస్తున్నామన్నారు.

 

ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ కార్యాలయం పై దాడి చేయించారని.. పార్టీ జెండాను కింద వేసి తొక్కారన్నారు.హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగిస్తే అవినాష్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగే ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర వారి ఫ్లెక్సీలు ఎందుకని ప్రశ్నించారు. ధన బలం, రౌడీయిజంతో ఏమైనా చేయొచ్చంటే.. తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. విజయవాడలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం‌ చేయొద్దని.. పోలీసు అధికారులకు‌ చెప్పినా తమ వల్ల కాదని చేతులేత్తేశారన్నారు. ఇటువంటి చర్యలు పోలీసులు కంట్రోల్ చేయక పోవడం దారుణమని.. దేవినేని అవినాష్ కూడా ఒకసారి ఆలోచించాలన్నారు. ఇటువంటి చర్యలు ద్వారా వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారన్నారు.

 

ఇప్పుడు అయినా మారకుంటే ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు.ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం అన్నార దేవినేని అవినాష్. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ లలితకళ అవార్డును సినీ నటులు పోసాని కృష్ణమురళికి ప్రధానం చేస్తామని.. ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే తన తండ్రి నెహ్రూకి ఎంతో అభిమానం అన్నారు. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie