విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత విశాఖపట్టణం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) AP శాఖలో నూనె వ్యాపారులు కృత్రిమ కొరత గేమ్ మొదలెట్టేశారు. నూనెల దిగుమతులపై 20 శాతం సుంకం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. అది ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ డీలర్లు సిండికేట్‌గా మారిపోయి నూనె అమ్మకాల్ని రెండ్రోజుల పాటు నిలిపేసి కృత్రిమ డిమాండ్ సృష్టించేశారు. శని, ఆదివారాల్లో నూనె అమ్మకాలుండవంటూ చిరు వ్యాపారులకు వర్తమానం పంపించేశారు. అసలే వినాయక చవితి సంబరాల్లో భాగంగా చాలా చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులకు జెల్ల కొట్టేలా శనివారం తెల్లవారుజాము నుంచే వ్యాపారులు 30 శాతం ధరలు పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రం ప్రకటించింది లూజ్ ఆయిల్‌పై.. అంటే ట్యాంకర్ల ద్వారా గుజరాత్, ముంబయి,…
Read MoreTag: AP News
Banjara festival | అనంతలో బంజరాలు పండుగ సందడి | Eeroju news
అనంతలో బంజరాలు పండుగ సందడి అనంతపురం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Banjara festival సింధు నాగరికత నుంచి సనాతన సంస్కృతి సాంప్రదాయాలను.. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు బంజారాలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ తరహాలో గిరిజన తండాలో పల్లెదనం ఉట్టిపడేలా పూర్వీకుల నుంచి వస్తున్న తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బంజారాలు హర్యాలీ తీజ్ పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బంజారా కళలను కనుమరుగు కాకుండా వాటికి జీవం పోస్తూ నేటికీ వారి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉన్నారు. రాను రానూ మారుతున్న కాలానుగుణంగా బంజారాల తీజ్ పండుగను అక్కడక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండాలో ఈ ఉత్సవాలను 11 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. విశిష్ట చరిత్ర కలిగిన తీజ్ ఉత్సవాలను కన్యలు పండుగ జరపాలని గ్రామ పెద్ద…
Read MoreRoja | రోజా రిటర్న్స్… | Eeroju news
రోజా రిటర్న్స్… తిరుపతి, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Roja కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడిని నిజం చేస్తున్నారు మాజీ మంత్రి రోజా. తన సొంత నియోజకవర్గంలో నగరిలో అంతా సెట్ చేసుకోడానికి చకచకా పావులు కదుపుతున్నారు. తన ఓటమి కారణమైన సొంత పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తన కంట్లో నలుసులా వ్యవహరిస్తున్న నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజే శాంతి దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన తన కసిని తీర్చుకున్నారు. నగరిపై మళ్లీ పట్టు పెంచుకునేలా రోజా చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. మూడేళ్లుగా నగరిలో రోజాకు ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు. అధికార పార్టీలో మంత్రి పదవిలో ఉన్నప్పటికీ రోజాకు సంతోషం ఉండేది కాదు. మొన్నటి ఎన్నికల వరకు ఆమెకు ఇంటాబయటా సమస్యలే. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే రోజాను ఓడించేందుకు…
Read MoreNominated posts by Dussehra | దసరా నాటికి నామినేటెడ్ పోస్టులు | Eeroju news
దసరా నాటికి నామినేటెడ్ పోస్టులు విజయవాడ, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Nominated posts by Dussehra ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది.మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ,21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాయి. అయితే పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మూడు పార్టీల నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల జాబితా కూడా అధికంగా ఉంది. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల మధ్య సమన్యాయం పాటించాల్సిన అవసరం సీఎం చంద్రబాబుపై పడింది. అందుకే నామినేటెడ్ పోస్టుల ప్రకటన జాప్యం అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఒక నామినేటెడ్…
Read MoreAchchennaidu | అధికారులకు అచ్చెన్నాయుడు స్మూత్ వార్నింగ్ | Eeroju news
అధికారులకు అచ్చెన్నాయుడు స్మూత్ వార్నింగ్ శ్రీకాకుళం, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Achchennaidu టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పలు ప్రభుత్వ కార్యాలయాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. సిబ్బందిపై ఆరా తీశారు. మొదటిసారిగా క్షమించి వదిలేస్తున్నాను.. ప్రజలు ఎవరైనా సరే ఇబ్బందులు పడ్డారని తన దృష్టికి వస్తే మాత్రం క్షమించేది లేదన్నారు. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కాదు.. ప్రజల కోసం మాత్రమే పని చేస్తుందన్నారు. ఏ అధికారైనా సరే ఆఫీస్ పనులు నిమిత్తం బయటకు వెళితే పరవాలేదు, వ్యక్తిగత పనులకు మాత్రం ఊరకనే వెళ్తే మాత్రం తాను రంగంలో దిగవలసి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడైతే అచ్చెన్నాయుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరిగెత్తారు, ఇక అధికారులు పరుగులు పరుగున అక్కడికి చేరుకొని.. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సమస్యలపై ఆయనకు వివరించారు. ఇక మీరు ఏం చేస్తారో…
Read MoreBhuma Akhilapriya | భూమా వారి రెడ్ బుక్ రెడీ | Eeroju news
భూమా వారి రెడ్ బుక్ రెడీ కర్నూలు, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Bhuma Akhilapriya ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన వద్ద కూడా ఒక రెడ్ బుక్ ఉందని, అందులో చాలా మంది చెడ్డోళ్ల పేర్లున్నాయని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. తాను ఎవరినీ వదలబోనని స్పష్టం చేశారు. నేనసలే ఊరుకునే దానిని కాదన్నారు. వారు అధికారంలో ఉండగా తమ వారిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా వేధింపులకు గురిచేశారని, ఇప్పుడు వదులుతానని ఎలా అనుకున్నారని ఆమె ప్రశ్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరినీ వదిలి పెట్బబోమని అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చింది తన రాజకీయ ప్రత్యర్థులైన గంగుల కుటుంబంతోనూ, టీడీపీలోనే ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైరం ఉంది. ఎవరిని ఉద్దేశించి అఖిలప్రియ…
Read MoreAP BJP : కాపు సామాజిక వర్గం బీజేపికి ఆశాకిరణమేనా?
AP BJP : కాపు సామాజిక వర్గం బీజేపికి ఆశాకిరణమేనా? విజయవాడ, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) ఏపీ పై బీజేపీ ఫోకస్ పెట్టిందా? బలపడడానికి ఇదే సరైన సమయం అని భావిస్తోందా? ఒక సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ, బీసీల మద్దతు ఉంది. జనసేనకు కాపు సామాజిక వర్గం అండగా నిలబడుతోంది. బిజెపి కి మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచింది రెడ్డి సామాజిక వర్గం. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ వైఖరి నచ్చక సైలెంట్…
Read MoreIT experts for Gudlawalleru | గుడ్లవల్లేరుకు ఐటీ నిపుణులు | Eeroju news
గుడ్లవల్లేరుకు ఐటీ నిపుణులు విజయవాడ, సెప్టెంబర్ 4, (న్యూస్ పల్స్) IT experts for Gudlawalleru గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన అభూత కల్పనా? ఉద్దేశపూర్వకంగా సృష్టించిందా? ఆకతాయిలు అలా ప్రచారం చేశారా? దానికి రాజకీయ రంగు పులుముకుందా? ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జరిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 3,000 మంది చదువుకుంటున్నారు. బాలికల హాస్టల్లో వాష్ రూమ్లలో సీక్రెట్ కెమెరాలు అమర్చారు అన్నది ఒక ప్రచారం. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులు రాత్రంతా ఆందోళన చేశారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కాలేజీని సందర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు అవకాశం ఇవ్వొద్దని..…
Read MoreByreddy | పాపం… బైరెడ్డి | Eeroju news
పాపం… బైరెడ్డి కర్నూలు, సెప్టెంబర్ 4, (న్యూస్ పల్స్) Byreddy వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. హత్య కేసులో ఆయనకు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడితో సిద్ధార్థ రెడ్డి ఫోన్లో మాట్లాడిన వాయిస్ కాల్ ఒకటి బయటకు వచ్చింది. అదే కేసులో సిద్ధార్థ రెడ్డి అనుమానితుడు కూడా. అయితే ప్రధాన నిందితుడితో సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన వాయిస్ కాల్స్ కు సంబంధించిన సంభాషణలు హత్యకు గురైన వ్యక్తి కుమార్తెకు దొరకడం విశేషం. ఇప్పటికే ఈ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎలాగైనా శిక్ష పడాలని మృతుడి కుమార్తె భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆమెకు కీలక సాక్షాలు చిక్కడం విశేషం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్…
Read MoreVijayawada | విలవిలల్లాడిన విజయవాడ | Eeroju news
విలవిలల్లాడిన విజయవాడ విజయవాడ Vijayawada విజయవాడలో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపో త వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకు పోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ విలవిల్లా డింది. పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్ లో భారీ వరద పోటెత్తిం ది. విజయవాడ సమీపంలోని జాతీయ రహదారుల నీటిలో చిక్కుకుపోయాయి. మొగల్రాజ పురం వద్ద కొండచరియల విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అధికారులు శిథి లాలను తొలగిస్తున్నారు. పడిపో యిన కొండరాళ్లను డ్రిల్లింగ్ చేసి, భారీ క్రేన్లతో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలిస్తున్నారు. మొగల్రా…
Read More