దూరమవుతున్న పార్టీ పిల్లర్లు… విజయవాడ, సెప్టెంబర 19, (న్యూస్ పల్స్) YS Jaganmohan Reddy వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి కలిసి నడుస్తున్న నేతలు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఆయన పార్టీ పరిస్థితిపై సంచలన ఆరోపణలు చేయబోతున్నారు. జగన్ కోసం మొదట్లో రాజీనామా చేసిన నేత మాత్రమే కాదు.. జగన్ సమీప బంధువు కూడా. అయనను కూడా జగన్ తో పాటు కలిసి నడిచేలా ఉంచుకోలేకపోతున్నారు. ఒక్క దారుణ పరాజయం తర్వాత వైసీపీ ఫేట్ ఒక్క సారిగా మారిపోయింది. అతి భారీ మెజార్టీలతో ఓడిపోవడంతో భవిష్యత్ ఉంటుందా లేదా అన్న గందరగోళంతో పాటు జగన్ వ్యవహారశైలి వల్ల ఇబ్బంది పడిన వారంతా.. మెల్లగా వేరే దారి చూసుకుంటున్నారు. నిజానికి ఇంకా ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ వంటి కార్యక్రమాలు…
Read MoreTag: Eeroju news
Special focus on BC | బీసీలపై స్పెషల్ ఫోకస్ | Eeroju news
బీసీలపై స్పెషల్ ఫోకస్ విజయవాడ, సెప్టెంబర్ 19, (న్యూస్ పల్స్) Special focus on BC ఏపీలో కూటమి ప్రభుత్వం బీసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు కులాలవారీగా కార్పొరేషన్లు పెట్టి ఆకట్టుకుంది. ఆ కార్పొరేషన్ల వల్ల అట్టడుగు వర్గాలకు లాభం జరిగిందా, కేవలం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మెంబర్లు లబ్ధిపొందారా అనే విషయం పక్కనపెడితే తాజాగా కూటమి ప్రభుత్వం బీసీలకు నిజమైన ప్రోత్సాహం అందిస్తామంటూ ముందుకొస్తోంది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా మరో అడుగు ముందుకేస్తామంటోంది. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామంటోంది ప్రభుత్వం. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సంబంధించిన ఫైల్ పై ఈరోజు మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. రాబోయే…
Read MoreBalineni | పార్టీ నుంచి సపోర్ట్ లేదన్న ఫీలింగ్ బాలినేని షాక్… | Eeroju news
పార్టీ నుంచి సపోర్ట్ లేదన్న ఫీలింగ్ బాలినేని షాక్… ఒంగోలు, సెప్టెంబర్ 19, (న్యూస్ పల్స్) Balineni మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఆయన ఉక్కపోతకు గురవుతున్నారు. తనకు ఏ మాత్రం గౌరవం లభించడం లేదని ఆయన కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింద. అయితే చివరి క్షణంలో జగన్ బుజ్జగించడంతో ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఘోరపరాజయం పాలయ్యారు. ఆ తర్వాత తాను ఈవీఎంల వల్లే ఓడిపోయానని పోరాటం చేశారు. ఈవీఎంల చెకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టుల్లోనూ కేసులు వేశారు. అయితే పార్టీ నుంచి కనీసం సపోర్టు లేదని.. జగన్ పట్టించుకోవడం లేదని అసంతృప్తి…
Read MoreVizianagaram | 20 నుంచి పైడితల్లి ఉత్సవాలు | Eeroju news
20 నుంచి పైడితల్లి ఉత్సవాలు విజయనగరం, సెప్టెంబర్ 19, న్యూస్ పల్స్) Vizianagaram ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి దీక్షల విరమణ ఉంటుంది. దేవస్థానం ఛైర్మన్, ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు, భక్తుల సలహాలు, సూచనలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర పండగగా ప్రకటించినందున అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తాయి. సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 11 గంటలకు వనం గుడి వద్ద ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 10న అర్ధమండల దీక్షలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 14న తొలేళ్ల ఉత్సవం, అక్టోబర్…
Read More‘సిక్కోలులో బాబాయ్, అబ్బాయ్ మార్క్ | Eeroju news
‘సిక్కోలులో బాబాయ్, అబ్బాయ్ మార్క్ శ్రీకాకుళం, సెప్టెంబర్ 19, (న్యూస్ పల్స్) బాబాయ్ అబ్బాయిలపై సిక్కోలు జిల్లా అభివృద్ధి మంత్రం ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు పదవులు వచ్చాయని అంతా అన్నారు. జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గత పదేళ్లుగా శ్రీకాకుళం ఎంపీగానే ఉన్నారు. ఆయన పార్లమెంటులో వివిధ సమస్యలపై గళం విప్పడంతో ప్రధాన మంత్రి మోదీ దృష్టిలో పడ్డారు. అంతేకాకుండా సీనియర్ కేంద్ర మంత్రులతో కూడా ఆయనకున్న సత్ససంబంధాలే ఇప్పుడు సిక్కోలు జిల్లా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుంది. ప్రధానంగా జిల్లాలోని ఆముదాలవలస, పలాస, రైల్వే స్టేషన్లు అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందిశ్రీకాకుళం రోడ్ మీదుగా నడిచే వివిధ రైళ్లుకూడ అక్కడ స్టేషన్ లో నిలిచేందుకు కృషి చేశారు. కేవలం శ్రీకాకుళం జిల్లాపైన…
Read MoreCongress chief Mallikarjun Kharge | ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం సాద్యం కాదు | Eeroju news
ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం సాద్యం కాదు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే న్యూ డిల్లీ సెప్టెంబర్ 19 Congress chief Mallikarjun Kharge జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం చేశారు. మన ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఖర్గే పేర్కొన్నారు. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియకు ఇవాళ కేంద్ర…
Read MoreJohnny master | కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు | Eeroju news
కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు హైదరాబాద్ సెప్టెంబర్ 19 Johnny master జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..! డ్యాన్సర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు బాధితురాలి నుంచి ఇప్పటికే స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. కాగా పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. పోలీసులు జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని ఆధారాలు సేకరించడంలో భాగంగా…
Read MoreRajiv gandhi | రాజీవ్ గాంధీ విగ్రహంపై రాద్దాంతం… | Eeroju news
రాజీవ్ గాంధీ విగ్రహంపై రాద్దాంతం… హైదరాబాద్, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Rajiv gandhi అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రశ్నలు సహజం. ఆరోపణలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండటం ప్రజాస్వామ్యానికి అవసరం. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాన్ని నిలబెట్టడం.. తప్పు చేస్తే ప్రజా కోర్టులో బోనెక్కించడానికి ప్రతిపక్షం పని చేయాలి. కానీ, ప్రతిపక్షం అయినంత మాత్రానా ప్రభుత్వంపై అక్కర్లేని ఆరోపణలు, అనవసర రాద్ధాంతాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏ పనికి శ్రీకారం చుట్టినా అడ్డుతగిలి ఆటంకపరచాల్సిన పనీ లేదు. అనవసర వాద ప్రతివాదనలు చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడాన్ని ఎవరూ హర్షించరు. ఇప్పుడు విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న గొడవపై ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. కొత్త సచివాలయంలో తాము ఒక ఐలాండ్ ఏర్పాటు చేశామని, అందులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని…
Read MoreRation card | రేషన్ కార్డులకు లైన్ క్లియర్ | Eeroju news
రేషన్ కార్డులకు లైన్ క్లియర్ వరంగల్, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Ration card తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కుటుంబాల నుంచి వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్నవారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఆశావాహులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సోమవారం భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో…
Read MoreBJP | 47 స్థానాల్లో 19 కమలం పొటీయేనా.. | Eeroju news
47 స్థానాల్లో 19 కమలం పొటీయేనా.. ముందే హ్యాండ్స్ అప్పా… శ్రీనగర్, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) BJP దాదాపు 10 సంవత్సరాల తర్వాత జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2014లో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎలక్షన్స్ లో పీడీపీ 28 సీట్లు గెలిచింది. భారతీయ జనతా పార్టీ 25 అసెంబ్లీ స్థానంలో ఘన విజయం సాధించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పిడిపి, బిజెపి కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. అయితే ఆ తర్వాత విభేదాలు పొడ చూపడంతో పీడీపీ, భారతీయ జనతా పార్టీ కటీఫ్ చెప్పుకున్నాయి. నేతలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ త్రిబుల్ తలాక్ ను రద్దు చేసింది. అదే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గణనీయమైన…
Read More