Bala Sadan girls who tied rakhis to the collector | కలెక్టర్ కు రాఖీలు కట్టిన బాల సదనం బాలికలు | Eeroju news

Bala Sadan girls who tied rakhis to the collector

కలెక్టర్ కు రాఖీలు కట్టిన బాల సదనం బాలికలు సిద్దిపేట Bala Sadan girls who tied rakhis to the collector రాఖి పౌర్ణమి పండగ సందర్భంగా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయం బాలసదనం చిన్నారులతో సందడిగా మారింది. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని  సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలసదనం బాలికలు జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి కి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ప్రతి ఒక చిన్నారి రాఖీ కట్టగా జిల్లా కలెక్టర్ చాలా సంతోషించి ప్రతి ఒక చిన్నారికి స్వయంగా  స్వీట్స్ తినిపించి అక్షింతలు వేసి ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని  ఆశీర్వదించారు. వారితో కాసేపు సంభాషించి ఎలా చదువుకుంటున్నారు అని, రాఖీ పండుగ సందర్భంగా ఏం కావాలని ఆప్యాయంగా పిల్లలను…

Read More

Greetings from Chief Minister Chandrababu on the occasion of World Photography | వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు | Eeroju news

Greetings from Chief Minister Chandrababu on the occasion of World Photography

వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు కెమేరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీసిన సీఎం గుంటూరు Greetings from Chief Minister Chandrababu on the occasion of World Photography వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని సిఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో…

Read More

Delivery to pregnant woman by RTC bus on Rakhi festival | రాఖీ పండుగ నాడు ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ | Eeroju news

Delivery to pregnant woman by RTC bus on Rakhi festival

రాఖీ పండుగ నాడు ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ గద్వాల Delivery to pregnant woman by RTC bus on Rakhi festival తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారు. అనంతరం…

Read More

Women public representatives tied rakhi to CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు.. | Eeroju news

Women public representatives tied rakhi to CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు.. హైదరాబాద్ Women public representatives tied rakhi to CM Revanth Reddy రక్షా బంధన్‌ సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్‌ లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవం త్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కు రాఖీలు కట్టారు. సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి…

Read More

CM Revanth Reddy congratulated Rakhi | రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి | Eeroju news

CM Revanth Reddy congratulated Rakhi

రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ CM Revanth Reddy congratulated Rakhi తెలంగాణలోని మహిళలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలను సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు.   Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news

Read More

New traffic rules come into effect | అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ | Eeroju news

New traffic rules come into effect

అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ హైదరాబాద్, ఆగస్టు 19  (న్యూస్ పల్స్) New traffic rules come into effect ఒకప్పుడు రవాణా సదుపాయం కోసం వాహనాలను వినియోగిస్తుంటాం. ఇప్పుడు సుఖవంతమైన ప్రయాణం కోసం, ప్రెస్జేజీ కోసం కూడా చాలా మంది వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఉపాధి పొందుతున్నారు. దీంతో వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోడ్లపై ట్రాఫిక్‌ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు కూడా రోడ్ల విస్తరణ చేపడుతున్నాయి. అయినా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధానం కారణం వాహనదారులు అతి వేగంగా వెళ్లడం, ట్రాఫిక్‌ నియమాలు పాటించకపోవడం.. మద్యం సేవించి వాహనం నడపడం లాంటి కారణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమేరకు క్రైమ్‌ రిపోర్ట్స్‌ కూడా ఇదే విషయం చెబుతున్నాయి. ప్రమాదాల బారిన పడుతన్న వారిలో ఎక్కువ మంది 30…

Read More

Mind Game Politics.. Revanth Reddy | మైండ్ గేమ్ పాలిటిక్స్… | Eeroju news

Mind Game Politics.. Revanth Reddy

మైండ్ గేమ్ పాలిటిక్స్… హైదరాబాద్,ఆగస్టు 19  (న్యూస్ పల్స్) Mind Game Politics.. Revanth Reddy కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనం అవుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి ఇది త్వరలో నెరవేరుతుంది.. బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో ఇటీవల చేసిన వ్యాఖ్యలు. ఆయన అలా మాట్లాడాడో లేదో.. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.. కెసిఆర్ తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తారని, ఆయన గవర్నర్ అయిపోతారని, కేటీఆర్ కు ఏదో ఒక పదవి వస్తుందని, హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడవుతారని అన్నారు. నిజానికి పై వ్యాఖ్యలు కింది స్థాయి నాయకులు చేస్తే పెద్దగా విలువ ఉండేది కాదు. వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ…

Read More

Full demand for aviation | విమానయానానికి ఫుల్ డిమాండ్.. | Eeroju news

Full demand for aviation

విమానయానానికి ఫుల్ డిమాండ్.. హైదరాబాద్  నుంచి  63.83 లక్షల మంది ప్రయాణం హైదరాబాద్, ఆగస్టు 19  (న్యూస్ పల్స్) Full demand for aviation ఆర్థిక స్థిరత్వం అంతగా లభించని రోజుల్లో విమానయానం అనేది శ్రీమంతులకు మాత్రమే అందుబాటులోకి ఉండేది. పైగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బేగంపేట విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు, దేశీయ విమానాలు రాకపోకలు సాగించేవి. శంషాబాద్ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన తర్వాత.. ఐటీ సంస్థలు, ఫార్మా సంస్థలు తామర తంపర గా ఏర్పాటయిన తర్వాత హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయింది. పైగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా, ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు, చదువు, విహారయాత్ర.. కారణాలు ఏవైనా విదేశీ యానం చేసే వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఫలితంగా హైదరాబాద్ విమానాశ్రయంలో అధిక అభివృద్ధి నమోదయింది.…

Read More

A Gajam in Begambazar costs Rs. 10 lakhs | బేగం బజార్ లో గజం రూ. 10 లక్షలు | Eeroju news

A Gajam in Begambazar costs Rs. 10 lakhs

బేగం బజార్ లో గజం రూ. 10 లక్షలు హైదరాబాద్, ఆగస్టు 19, (న్యూస్ పల్స్) A Gajam in Begambazar costs Rs. 10 lakhs హైదరాబాద్‌లో భూమి ధర ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, గచ్చిబౌలి పేర్లు వినిపిస్తాయి. కానీ, వాటిని తలదన్నేలా బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ పడుతోంది. ముంబయిలో మాదిరిగా ఇక్కడ గజం భూమి తక్కువలో తక్కువ రూ.10 లక్షల వరకు పలుకుతోంది. భూమి లభ్యత లేకపోవడంతో పాత భవనాలే నూతన నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్రకు చెందిన హోల్‌సేల్‌ వ్యాపారులు ఎంతోమంది ఇక్కడే స్థిరపడ్డారు. చదరపు అడుగుల చొప్పున అమ్మకాలు జరిగే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలోనే పలుకుతున్నాయి. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట భూములకు అత్యధిక…

Read More

The stage is set for Roja’s arrest | రోజా అరెస్ట్ కు రంగం సిద్ధం | Eeroju news

The stage is set for Roja's arrest

రోజా అరెస్ట్ కు రంగం సిద్ధం తిరుపతి, ఆగస్టు 19  (న్యూస్ పల్స్) The stage is set for Roja’s arrest నాటి నటి.. నిన్నటి ఎమ్మెల్యే.. నేడు మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఆడుదాం ఆంధ్రా క్రీడలు ఉచ్చు బిగిస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. అసలు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆమెపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి.మాజీమంత్రి రోజా అనగానే గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో అప్పటి ఎమ్మెల్యే, మంత్రీ రోజా మాటలు తూటాలుగా పేలేవి.. ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి గురించి మాట్లాడినా సోషల్ మీడియా లో వైరల్ గా మారేది. ఇక జనసైనికుల నుంచి…

Read More