Chinni as president of Andhra Cricket Association | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్ని | Eeroju news

Chinni as president of Andhra Cricket Association

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్ని విజయవాడ, ఆగస్టు 19  (న్యూస్ పల్స్) Chinni as president of Andhra Cricket Association ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన అధ్యక్షుడిగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెల 8న విడుదల కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులచేతుల్లోనే ఏసీఏ ఉండేది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు. విజయవాడలో ఈ నెల 4న జరిగిన సర్వసభ్య సమావేశంలో వీరి రాజీనామాలను ఆమోదించారు. కొత్త కార్యవర్గం కోసం కసరత్తు ప్రారంభమైంది. అధ్యక్షుడితోపాటు అపెక్స్ కౌన్సిల్‌లోని ఆరు పదవులకు శుక్రవారం విశాఖ స్టేడియంలో నామినేషన్లు స్వీకరించారు.…

Read More

IPSs in long leave thinking | లాంగ్ లీవ్ ఆలోచనలో ఐపీఎస్ లు | Eeroju news

IPSs in long leave thinking

లాంగ్ లీవ్ ఆలోచనలో ఐపీఎస్ లు విజయవాడ,ఆగస్టు 19  (న్యూస్ పల్స్) IPSs in long leave thinking పని లేని శిక్ష.. ఏపీలో 16 మంది ఐపీఎస్‌ ఆఫీసర్లకు కలవరం పుట్టిస్తోందట…. ఇన్నాళ్లు వెయిటింగ్‌లో పెట్టినా చింతించని ఐపీఎస్‌లు… రోజూ ఆఫీసుకు రావాలని జారీ చేసిన మెమోతో తల పట్టుకుంటున్నారు… పనిలేకుండా ఖాళీగా కూర్చోలేమంటూ సెలవు తీసుకునేందుకు రెడీ అవుతున్నారట… కానీ, ప్రభుత్వం ఐపీఎస్‌ల పట్ల కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోందట.పనిఉన్నా, లేకపోయినా, రోజా ఆఫీసుకు రావాల్సిందే.. హాజరు వేసుకోవాల్సిందేనంటూ ఖరాకండీగా చెప్పేస్తుందట… దీంతో ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట ఐపీఎస్‌లు. ఎక్కువ మంది దీర్ఘకాలిక సెలవు కోసం దరఖాస్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఐపీఎస్‌లకు సెలవు ఇస్తుందా? లేదా? అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ మారింది. వైసీపీ హయాంలో జరిగిన…

Read More

Onion is in huge demand | ఉల్లికి భారీ డిమాండ్ | Eeroju news

Onion is in huge demand

ఉల్లికి భారీ డిమాండ్ కర్నూలు, ఆగస్టు 19  (న్యూస్ పల్స్) Onion is in huge demand దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధర రూ.20-30 వరకు ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి రూ.50కి చేరింది. ఉల్లి ధర 50కిపైగా శాతం పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.50 పలుకుతోంది. అలాగే రైతు బజారులో కిలో ఉల్లి రూ.42 నుంచి రూ.45 పలుకుతుంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఉల్లి అంటేనే భయపడిపోతున్నారు. సాధారణంగా ఉల్లి ధరలు సెప్టెంబర్ సమయంలో పెరుగుతాయి. అయితే ఈసారి ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడమే అందుకు కారణం. మహారాష్ట్రలో ఉల్లి పంటదెబ్బ తినడంతో కర్నూలు ఉల్లికి భారీగా డిమాండ్ పెరిగింది. దానికి తోడు…

Read More

Full budget in September | సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ | Eeroju news

Full budget in September

సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ విజయవాడ, ఆగస్టు 19  (న్యూస్ పల్స్) Full budget in September ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయమై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు కానుంది. బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నతాధితారులకు ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని అంచనాలు పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఇక, ఈ నెల 31వ తేదీలోగా అన్ని శాఖలు బడ్జెట్ అంచనాలను పంపాలని ఆర్థిక శాఖ కోరింది. సంక్షేమ పథకాలకు ఈ పూర్తి…

Read More

All from Bangalore.. Shift from Tadepalli.. | అంతా బెంగళూరు నుంచే … తాడేపల్లి నుంచి షిఫ్ట్…. | Eeroju news

అంతా బెంగళూరు నుంచే ... తాడేపల్లి నుంచి షిఫ్ట్....

అంతా బెంగళూరు నుంచే … తాడేపల్లి నుంచి షిఫ్ట్…. కడప, ఆగస్టు 19 (న్యూస్ పల్స్) All from Bangalore.. Shift from Tadepalli.. జగన్ ఎందుకో ఏపీలో ఉండేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. పని ఉంటే మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నారు. పని ముగిసిన వెంటనే బెంగళూరు వెళుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ అంత సేఫ్ కాదని భావిస్తున్నట్లు ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. తనపై నిఘా ఉంటుందని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఇక్కడ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు జరపకూడదని భావిస్తున్నారు. నేరుగా బెంగళూరు నుంచి చేసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని.. అదే హైదరాబాద్ అయితే చంద్రబాబుకు అనుకూల ప్రభుత్వం అక్కడ ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచే బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. నెలలో మూడు…

Read More

CM Chandrababu’s review of education department | విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష | Eeroju news

CM Chandrababu's review of education department

విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి CM Chandrababu’s review of education department ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించారు.  గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోయాయని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై సీఎం ఆరా తీసారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యల్లో ప్రమాణాల పెంపునకు శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలపై  మంత్రి లోకేశ్ వివరించారు. గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని  అధికారులు వెల్లడించారు.   CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

Read More

Good news for Telangana farmers | తెలంగాణ రైతాంగానికి శుభవార్త | Eeroju news

Good news for Telangana farmers

తెలంగాణ రైతాంగానికి శుభవార్త గురువారం  మూడో విడత రైతు రుణమాఫీ..! హైదరాబాద్ Good news for Telangana farmers ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సవాల్ చేసిన సీఎం రేవంత్, అన్నట్లుగానే గురువారం మూడో విడత రైతు రుణమాఫీ ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే 32.50 లక్షల మంది రైతులకు రుణ విమూక్తి కల్పించేందుకు రూ.31 వేల కోట్లు కేటాయించి రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతగా రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది. ఇక రెండో విడత కింద రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. మూడో విడతలో లక్షన్నర నుంచి రూ.2 లక్షల…

Read More

It was KCR who struggled.. Credit the Congress.. Harish Rao | కష్టపడ్డది కేసీఆర్.. క్రెడిట్ కాంగ్రెస్ ది.. హరీష్ రావు. | Eeroju news

It was KCR who struggled.. Credit the Congress.. Harish Rao

కష్టపడ్డది కేసీఆర్.. క్రెడిట్ కాంగ్రెస్ ది.. హరీష్ రావు   హైదరాబాద్‌ It was KCR who struggled.. Credit the Congress.. Harish Rao తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్‌ నిర్మిస్తూ. కాంగ్రెస్‌ క్రెడిట్‌ కొట్టేయాలని చూస్తోందన్నారు. రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని ప్రాజెక్టును తామే కట్టినట్లు కలరింగ్‌ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, హరీష్‌ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ. ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం కాంగ్రెస్‌ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. రోజుకో మంత్రి వెళ్లి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారన్నారు. అసలు ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించింది కేసీఆర్‌. ఆయన నిర్మించిన ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది. ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్‌ పార్టీనే నిర్మించినట్టు ఫుల్‌ కలరింగ్‌ ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌…

Read More

Hydra in Hyderabad… thunderbolts | హైదరాబాద్ లో హైడ్రా… పిడుగులు | Eeroju news

Hydra in Hyderabad... thunderbolts

హైదరాబాద్ లో హైడ్రా… పిడుగులు హైదరాబాద్, ఆగస్టు 13 (న్యూస్ పల్స్) Hydra in Hyderabad… thunderbolts హైదరాబాద్‌లో  వారం రోజులుగా అక్రమ నిర్మాణాలను విస్తృతంగా కూల్చివేస్తున్నారు. చెరువుల బఫర్ జోన్లలో నిర్మిస్తున్న వాటిని..నాలాలుకబ్జా చేసిన వాటిని కూల్చివేస్తున్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధికారులే ఆ పని చేసేవారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థను తీసుకు వచ్చారు. హైడ్రా అంటే  హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ . హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలను కూల్చి వేయడం..  ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు దీన్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా ఆక్రమణలపై హైడ్రా అధికారులు విరుచుకుపడుతున్నారు. రాజేంద్రనగర్‌ పరిధి శివరాంపల్లిలో  చెరువును ఆక్రమించిన  ప్లాట్లు వేసి నిర్మాణాలు చేపట్టారు. వాటిని కూల్చి వేస్తున్నారు. గాజుల రామారం…

Read More

Covert politics | మళ్లీ తెరపైకి కోవర్టు పాలిటిక్స్.. | Eeroju news

Covert politics

మళ్లీ తెరపైకి కోవర్టు పాలిటిక్స్.. హైదరాబాద్, ఆగస్టు  13 (న్యూస్ పల్స్) Covert politics తెలంగాణ రాజకీయం మయా రంజుగా నడుస్తోంది. రోజుకో ఇష్యూపై నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకటేనని మళ్లీ రచ్చ మొదలెట్టారు. తెలంగాణలో షాడో మంత్రుల పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు రెండు విలీన ప్రచారంతో ఉక్కబోత అనుభవిస్తున్నాయి….. మాకు.. మాకూ ఏ సంబంధం లేదు నమ్మండి మహాప్రభో అంటూ చెప్పుకోవడానికి నానాపాట్లూ పడుతున్నాయి…. ఇంతకీ విలీన ప్రచారం ఎందుకు జరుగుతోంది…ఈ ప్రచారంలో వాస్తవమెంత… ఈ ప్రచారంతో మునిగేదెవరు…తేలేదెవరు….?నిజం గడపదాటేలోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుందంటా…. ఈ సామెత ఎవరు చెప్పారోగానీ… రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బీజేపీలో…

Read More