కాంగ్రెస్ వేదికపై విజయమ్మ… విజయవాడ, జూలై 6, (న్యూస్ పల్స్) Vijayamma on Congress stage ఏపీలో కీలక రాజకీయ పరిణామం. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తండ్రి పేరుతో జగన్ పార్టీ పెట్టారు. అధికారంలోకి రాగలిగారు. గత ఐదేళ్లలో వైయస్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధికారిక కార్యక్రమం గా ప్రకటించి మరి వేడుకలు జరిపారు. కానీ ఈ ఏడాది అధికారానికి వైసీపీ దూరం కావడంతో… కేవలం ఇడుపులపాయలో నివాళులు అర్పించేందుకు మాత్రమే జగన్ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అట్టహాసంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించేందుకు షర్మిల సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులతో పాటు కీలక నేతలంతా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వారితో విజయమ్మ వేదిక పంచుకోనుండడం…
Read MoreTag: Eeroju news
26 members of the Britain Parliament are Indians | బ్రిటన్ పార్లమెంట్ లో 26 మంది బార్న్ ఇండియన్స్ | Eeroju news
బ్రిటన్ పార్లమెంట్ లో 26 మంది బార్న్ ఇండియన్స్ హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) 26 members of the Britain Parliament are Indians బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో భారత సంతతి నేతలు సత్తా చాటారు. పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్‌లో భారత సంతతి హవా కొనసాగింది. భారత మూలాలు ఉన్న 26 మంది అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తెలుగు సంతతికి చెందిన ఉదయ్ నాగరాజు, చంద్ర కన్నెగంటి మాత్రం ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి నేతల్లో ప్రధాని రిషి సునాక్ ముందున్నారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి విజయం సాధించారు. మాజీ హోం మంత్రులు సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. భారత సంతతికి చెందిన క్లెయిర్ కౌటిన్హో కూడా…
Read MoreBhole Baba Properties | 100 కోట్ల భోలే బాబా | Eeroju news
100 కోట్ల భోలే బాబా న్యూడిల్లీ, జూలై 6, (న్యూస్ పల్స్) Bhole Baba Properties యూపీలోని హాథ్రస్ జిల్లాలో జూలై 2న భోలే బాబా నిర్వహించిన సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఇంకా అనేకమంది తీవ్రగాయాల పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలు ఇప్పటికీ గుండెలవిసేలా రోధిస్తున్నాయి. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. అనాధలుగా మిగిలారు. తాజాగా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరుగుతున్నదని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయితే.. ఘోర దుర్ఘటనకు కారణమైన భోలే బాలా అలియాస్ సూరజ్ పాల్ సింగ్ అలియాస్ నారాయణ్ సాకార్ ఎక్కడున్నాడో ఇంతవరకూ పోలీసులకు తెలియలేదు. భోలే బాబా ఆచూకీ కోసం పోలీసులు…
Read MoreNEET PG online test on 11th August | ఆగస్టు 11న నీట్ పీజీ ఆన్ లైన్ టెస్ట్ | Eeroju news
ఆగస్టు 11న నీట్ పీజీ ఆన్ లైన్ టెస్ట్ న్యూడిల్లీ, జూలై 6, (న్యూస్ పల్స్) NEET PG online test on 11th August దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్-పీజీ పరీక్షను NBE వాయిదే వేసిన సంగతి తెలిసిందే. జూన్ 23న ఈ పరీక్ష జరగవల్సి ఉండగా.. పరీక్షకు కొన్ని గంటల ముందు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసింది. నీట్ యూజీ 2024, యూజీసీ నెట్ 2024 పరీక్షల పేపర్ లీకేజీల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెల్పింది. అయితే తాజాగా నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీలను NBE ప్రకటించింది. 2024-25 విద్యాసంవత్సరానికి పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11న పరీక్ష…
Read MoreHow much work did KCR, Revanth Reddy BT batch | బీటీ బ్యాచ్ ఎంత పని చేసిందో… | Eeroju news
బీటీ బ్యాచ్ ఎంత పని చేసిందో….. హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) How much work did KCR, Revanth Reddy BT batch చేర్చుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అధికారం పోయిన తర్వాత ఎవరూ ఉండరు. ఇది అన్ని పార్టీలకూ అప్లయ్ అవుతుంది. నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నాడు తమ పార్టీ నుంచి వెళ్లి బీఆర్ఎస్ లో పదవులు పొంది, పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వారిని కూడా వదలడం లేదు. ఎవరిని బడితే వారిని.. వస్తామంటే కండువా కప్పేశామా? లేదా? వాళ్లకు అస్సలు ప్రజల్లో ఇమేజ్ ఉందా? వారివల్ల భవిష్యత్ లో పార్టీకి ఉపయోగం ఉందా? అన్నది ఆలోచించడం లేదు. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ లో చేరారంటే నిజంగా కేసీఆర్…
Read MoreMargani Bharath for sympathy | సింపతి కోసం మార్గాని దారుణం | Eeroju news
సింపతి కోసం మార్గాని దారుణం రాజమండ్రి, జూలై 6 ( న్యూస్ పల్స్) Margani Bharath for sympathy ఏపీలో జగన్ కు అత్యంత సన్నిహితమైన నేతల్లో మార్గాని భరత్ ఒకరు. తొలుత సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినిమాల కంటే రాజకీయాలే ఉత్తమమని భావించి వైసిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తొలి ప్రయత్నం లోనే భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఈసారి మాత్రం రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించే వారన్న విమర్శ ఉంది. అయితే ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ప్రచార రథాన్ని ప్రత్యర్థులు దగ్ధం చేశారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి…
Read MoreTirumala Tirupati Devasthanam Update for Srivari Devotees | 16 బ్రేక్ దర్శనాలు రద్దు… | Eeroju news
16 బ్రేక్ దర్శనాలు రద్దు… తిరుమల, జూలై 6, (న్యూస్ పల్స్) Tirumala Tirupati Devasthanam Update for Srivari Devotees శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో జూలై 9వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని ప్రకటించింది. దీంతో జూలై 9 , 16వ తేదీల్లో తిరుమలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. తాజా నిర్ణయం కారణంగా జూలై 8, 15వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఓ ప్రకటనలో కోరింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తుంటారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ…
Read MoreIf sand is free but clarity on conditions | ఇసుక ఫ్రీ అయితే… కానీ కండిషన్స్ పై క్లారిటీ | Eeroju news
ఇసుక ఫ్రీ అయితే… కానీ కండిషన్స్ పై క్లారిటీ విజయవాడ, జూలై 6, (న్యూస్ పల్స్) If sand is free but clarity on conditions ఏపీలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 8నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అందుబాటులోకి రానుంది. అయితే ఇసుకను ప్రజలు ఎలా పొందాలనే దానిపై మాత్రం ఇంకా స్ఫష్టత రాలేదు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ధరలు చుక్కలనంటుతున్నాయి. యూనిట్ లేదా టన్ను ధర గరిష్టంగా రూ.10వేలు పలుకుతోంది. ధర చెల్లించడానికి సిద్ధమైనా గత నెల రోజులుగా మార్కెట్లో ఇసుక దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలనే నిర్ణయం తీపికబురే అయినా దాని ఫలితాలు ప్రజలకు ఏ మేరకు అందుతాయనేదే ప్రశ్నార్థకం. రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక…
Read MoreYS Jaganmohan Reddy | జగనా… ఇది తగునా | Eeroju news
జగనా… ఇది తగునా నెల్లూరు, జూలై 6, (న్యూస్ పల్స్) YS Jaganmohan Reddy ఏపీ మాజీ సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. తాననుకున్నదే నిజమనే భావనతోనే ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగన్ నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. దాదాపు అరగంట పాటు ములాఖత్‌లో పిన్నెల్లితో మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు తన ఆవేశం, అక్రోశాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, అందుకు మూల్యం చెల్లించుకుంటారని తీవ్ర స్థాయిలో జగన్ హెచ్చరించారు. జగన్ రాజకీయంగా చేసిన విమర్శలు, వాదనల మాటెలా ఉన్నా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. తాను ఎవరి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదనే…
Read MoreTarget Dwarampudi Chandrasekhar Reddy | టార్గెట్ ద్వారంపూడి… | Eeroju news
టార్గెట్ ద్వారంపూడి… కథ ముగిసినట్టేనా కాకినాడ, జూలై 6, (న్యూస్ పల్స్) Target Dwarampudi Chandrasekhar Reddy కాకినాడ జిల్లాల్లో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తల నోట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే వినబడుతుంది. గత ప్రభుత్వం హయాంలో ఆయన డైరెక్షన్ లో జరిగిన వ్యవహారాలన్నింటిపై ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్‌కు చేతనైతే కాకినాడ సిటీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంతే కాకుండా పవన్‌కళ్యాణ్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. జనసేనకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వైరం పెరిగింది. పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళనకు యత్నించిన జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలపై ఆయన అనుచరులు దాడి…
Read More