విశాఖపట్టణం, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో అధికారం మార్పు… అనేక మార్పులకు దారి తీస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని భూముల ధరల మార్పు జరుగుతోంది. టీడీపీ కూటమి గెలవడంతో వైజాగ్ లో భూముల ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజల్లో మాత్రం పట్టలేనంత ఆనందం వెల్లువిరుస్తుంది.2014 రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు అనివార్యం అయింది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎంపిక కోసం నాటి యూపీఏ-2 ప్రభుత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కే.సీ శివరామకృష్ణన్ చైర్మన్ గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ నియమించింది. ఈ కమిటీ తుది నివేదికను 2014 ఆగస్టు 31లోపు అందజేయాలని శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వం చెప్పిన…
Read MoreTag: Eeroju news
అసెంబ్లీ స్పీకర్ కోసం… సీనియర్లు | For Assembly Speaker… Seniors | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 14,(న్యూస్ పల్స్) కొత్త అసెంబ్లీలో కాబోయే స్పీకర్ ఎవరు? మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ పదవిపైనే పడింది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచి నూతన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకోవాలి. సభలో సీనియర్ నేతలను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సభలో సీఎం చంద్రబాబుతో పాటు మరో ఇద్దరు నేతలు మాత్రమే ఏడు సార్లు గెలిచారు. చంద్రబాబు సీఎంగా ఉన్నందున ఆయనతో పాటు ఏడుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాల అయ్యన్నపాత్రుడులో ఎవరో ఒకరు ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. అయితే, స్పీకర్ పదవిపై కన్నేసిన ఈ ఇద్దరు నేతలు ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు అంగీకరిస్తారా? అన్నదే ప్రశ్న.చంద్రబాబు 4.O ప్రభుత్వంలో అనేకమంది…
Read Moreప్రమాణల వేళ….అనుబంధాల కోవెల… | At the time of swearing… | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం లో బలమైన బంధాలు, భావోద్వేగాలు వెలుగు చూశాయి. సమాజానికి అవసరమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నందమూరి, నారా, కొణిదెల కుటుంబాలు బలమైన ముద్రను చాటుకున్నాయి. తమ మధ్య ఉన్న కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలను ప్రతిబింబించాయి. సామాన్య ప్రజలను సైతం ఆలోచింపజేశాయి. అందరినీ దూరం చేసుకుంటూ జగన్ అపజయాన్ని మూట కట్టుకోగా.. అందర్నీ కలుపుకొని, అన్ని కుటుంబాలు ఏకమై విజయాన్ని అందుకున్నాయి. విజయాన్ని ఆస్వాదించాయి. ప్రమాణ స్వీకారం మహోత్సవం అసాంతం కుటుంబ విలువలు తెలిపేలా దృశ్యాలు కనిపించాయి.ప్రమాణ స్వీకార వేదిక పైకి వచ్చిన నారా భువనేశ్వరిని సోదరుడు నందమూరి బాలకృష్ణ నుదుటిపై ముద్దు పెట్టి తనలో ఉన్న ఆప్యాయతను చూపించారు. అన్న దీవెనలను ఆమె సంతోషంగా స్వీకరించారు. దానిని ప్రతి ఒక్కరూ చూసి సంతోషించారు. చంద్రబాబు, నారా…
Read Moreకొండపల్లికి 40, ఫరూ్ఖ్ కు 74 | 40 for Kondapalli, 74 for Farooq | Eeroju news
కర్నూలు, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. యువకులు, సీనియర్లు సమ్మిళితంగా రాష్ట్ర మంత్రివర్గం కూర్పు ఉంది. క్యాబినెట్లో కొండపల్లి శ్రీనివాస్ అత్యంత చిన్న వయసు. ఆయనకు 40 సంవత్సరాల వయసు కాగా.. ఎన్ఎండి ఫరూక్ అత్యంత పెద్దవారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. సామాజిక సమతూకంతో పాటు యువతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సీనియార్టీ కి సైతం పెద్దపీట వేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయసు పరంగా ఎన్ ఎం డి ఫరూక్ అందరికంటే పెద్దవారుగా నిలిచారు. టిడిపిలో ఆయన సీనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. అందుకే ఆయనకు గౌరవించి మైనారిటీ కోట కింద పదవి ఇచ్చారు చంద్రబాబు. విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే…
Read Moreఅశోకగజపతిరాజుకు గవర్నర్ గిరీ… | Governor Giri to Ashokagajapatiraj… | Eeroju news
విజయనగరం, జూన్ 14, (న్యూస్ పల్స్) కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా మారింది. ఎన్డీఏ లో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అందుకే కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. మిగతా భాగస్వామ్య పార్టీలకు లేనివిధంగా.. ఒక క్యాబినెట్ మంత్రి పదవితో పాటు సహాయ మంత్రి పదవి టిడిపి దక్కించుకుంది. రాష్ట్రంలో సైతం బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించారు చంద్రబాబు. అయితే ఎన్డీఏ సుస్థిరతకు పెద్దపీట వేసిన క్రమంలో.. తెలుగుదేశం పార్టీకి అన్నింటా ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి భావిస్తోంది. అందులో భాగంగా టిడిపికి గవర్నర్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అందుకే గవర్నర్ కోసం పేర్లు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు గవర్నర్ల పదవీకాలం ముగిసింది. కొత్తవారిని నియమించాలని బిజెపి భావిస్తోంది. అందుకే తన…
Read Moreచిరూ పవర్ చూపించిన పవన్ | Pawan who showed Chiru power | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసకర పాలన సాగించారు జగన్. 151 సీట్లతో గెలిచేసరికి విజయ గర్వంతో ఊగిపోయారు. తన ప్రతి నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తారని భావించారు. తన మాటకు ఎదురు తిరగరని అంచనా వేశారు. అమరావతి ఏకైక రాజధానికి అందరూ ఆమోదముద్ర వేస్తే.. తాను మాత్రం మూడు రాజధానులు అంటూ విభిన్నంగా ఆలోచించారు.అందుకే 166 నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అమరావతికి జై కొట్టారు. మూడు రాజధానులు వద్దు అంటూ తేల్చి చెప్పారు. చివరకు రాజధాని ఇస్తామన్న ఉత్తరాంధ్ర ప్రజల సైతం తిరస్కరించారు. విశాఖ నగరవాసులు కనీసం ఆహ్వానించలేదు. పైగా భారీ ఓటమితో బదులు చెప్పారు.అధికారంలో ఉండగా అన్ని అనుకూలతలు కనిపిస్తాయి. ప్రధాని మోదీ ఆహ్వానిస్తారు. అవకాశం ఇచ్చారు. కూర్చోబెట్టి చర్చించారు. చాలా రకాల మినహాయింపులు ఇచ్చారు. అది ఒక దేశ…
Read Moreప్రైవేటీకరణ చేస్తారా… ఆపేస్తారా… | Will Privatization… Stop… | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 14, (న్యూస్ పల్స్) విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను..2021లో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించడంతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు, వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పటినుంచి అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారింది విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశం. అయితే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా ముందడుగే వేసింది కేంద్రం ప్రభుత్వం.అయిదేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సొంత గనులు లేకపోవడంతో…
Read Moreఅసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం…? | YCP away from assembly meetings…? | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో కొత్త అసెంబ్లీ ఏర్పడింది. పార్టీల బలాబలాలు మారిపోయాయి. వైఎస్ఆర్‌సీపీ 151 స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది. ప్రతిపక్ష స్థానం కూడా లేదు. ప్రతిపక్ష నేత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అసెంబ్లీలో సీట్లు కూడా చివరి వరుసలో కేటాయించే అవకాశం ఉంది. సీట్లు ఎక్కడ ఉండాలనేది స్పీకర్ ఇష్టం. అయితే గత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు చూపించిన అవమానాలు అన్నీ గుర్తు పెట్టుకుంటామని టీడీపీ చెబుతోంది. అంటే.. వైఎస్ఆర్‌సీపీ సభ్యులకు గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాల్సిన పని లేదు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానించినందుకే చంద్రబాబు సవాల్ చేసి బయటకు వచ్చారు. తర్వాత ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. తమ అధినేతను, వారి కుటుంబాన్ని అంత తీవ్రంగా వేధించిన వారిని టీడీపీ సభ్యులు…
Read Moreఅప్పులపై శ్వేత పత్రం… | White Paper on Debt… | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది. వైసీపీ హయాంలో లక్షల కోట్ల అప్పులు చేశారని అనేక సార్లు ఆరోపించారు. అసలైన వివరాలు బయట పెట్టడం లేదని గవర్నర్‌కు అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేశారు. పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఇంత వరకూ పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పూర్తి స్థాయి లెక్కలను బయట పెట్టేందుకు సిద్దమయింది. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రతీ వారం రెండు నుంచి నాలుగువేల కోట్ల వరకూ అప్పు తీసుకు వస్తోంది. యభై రోజుల్లోనే పాతిక వేల కోట్ల వరకూ…
Read Moreజూన్ 22 న జిఎస్ టి మండలి సమావేశం | GST Council meeting on June 22 | Eeroju news
న్యూఢిల్లీ జూన్ 13 వస్తువులు, సేవల పన్ను(జిఎస్ టి) మండలి జూన్ 22 న సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఈ ఏడాది తొలి సమావేశం కానున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. ఈ 53వ జిఎస్ టి కౌన్సిల్ సమావేశం జూన్ 22న న్యూఢిల్లీలో జరుగనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జిఎస్ టి కౌన్సిల్ సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి సమావేశం కావల్సి ఉంటుంది. కానీ 2022 నుంచి ఇప్పటి వరకు కేవలం ఆరు సార్లే సమావేశం అయింది. జరుగనున్న జిఎస్ టి కౌన్సిల్ సమావేశం ఏజెండా ఏమిటన్నది తెలియలేదు. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రులు కొన్ని పరోక్ష పన్నులను కేంద్ర బడ్జెట్ లో చేర్చాలని కోరవచ్చని అనుకుంటున్నారు. బెట్టింగ్ వాటి మీద…
Read More