జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం | Cabinet sub-committee meeting on Geo 317 | Eeroju news

దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 30వ తేదీ వరకు అవకాశం హైదరాబాద్ జూన్ 13 జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం  సమావేశ మైంది.ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు .  ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.  ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది.  ఈ సమావేశంలో వెబ్ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ – ఆప్షన్ ఇవ్వడం…

Read More

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ | Kishan Reddy assumed responsibility as Union Minister of Coal and Mines | Eeroju news

న్యూ ఢిల్లీ జూన్ 13  ఢిల్లీ శాస్త్రి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పిత్తి జరుగుతోందని, విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలన్నారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుదామని, ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు.తెలంగాణ భవన్‌ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వందనం సమర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల స్తూపం…

Read More

సియం ముఖ్య కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యం.రవిచంద్ర | Ym. Ravichandra took office as the chief secretary of CM | Eeroju news

అమరావతి,13 జూన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా యం.రవిచంద్ర గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈమేరకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో ఆయన సియం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు దివ్య ఆశిస్సులు అందించారు.అనంతరం పలువురు అధికారులు,సిబ్బంది రవిచంద్రకు పుచ్చ గుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.అంతకు ముందు టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న,గుంటురు జిల్లా కలక్టర్ యం.వేణు గోపాల్ రెడ్డి,ఎస్పి తుషార్ గూడి,న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్,ప్రోటోకాల్ డైరక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి,సచివాలయ వివిధ విభాగాల అధికారులు,సిబ్బంది,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడి ఎంట్రీ..? | Phone tapping case ED entry..? | Eeroju news

హైదరాబాద్  తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా.? ఈ కేసు వివరాలను ఈడి అధికారులు ఎప్పటికప్పుడు ఆరాతిస్తున్నారా.? త్వరలో ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారిన అక్రమ నగదు లావాదేవీల మీద విచారణ కు ఈడి వచ్చే అవకాశం ఉందా.? అంటే అవుననే ప్రచారం జరుగుతుంది ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు దీంతో ఈడి రాక ఖాయం అనే వాదన మొదలైంది. తెలంగాణలోని గత రెండు అసెంబ్లీ ఎన్నికల బిఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు సమకూర్చామని రాధా కిషన్ రావు ఆయన బృందంలోని అనేకమంది పోలీస్ అధికారులు విచారణలో కుండ బద్దలు కొట్టడంతో పాటు ఈ వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీల  విచారణ…

Read More

25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : హరీశ్ రావు.. | 25 thousand teacher posts should be filled : Harish Rao.. | Eeroju news

హైదరాబాద్ 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ద్వారా 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం 11 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనఊరు- మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్కూళ్లలో పారిశుధ్య సిబ్బందిని నియమించాలని, బడులకు ఫ్రీ కరెంటు ఇవ్వాలని కోరారు.

Read More

అన్నా క్యాంటిన్లు పునః ప్రారంభం | Anna canteens relaunched | Eeroju news

అనంతపురం – ఏపీ లోని పేదలకు కేవలం ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో దాదాపు 368 అన్నా క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వం రాగానే అవన్నీ మూతపడ్డాయి.- ఆ తర్వాత పలు ప్రాంతాల్లో టిడిపి నాయకులు స్వయంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కూడా వైసిపి ప్రభుత్వం వాటిని కూలదోసింది… అనంతపురం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటిన్లు అపరిశుభ్రంగా, తాగుబోతులకు నిలయంగా ఉన్నాయి, అయితే పేదలు మాత్రం ఈ క్యాంటిన్లు పునః ప్రారంభం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు…

Read More

కధువా… జల్లెడ పడుతున్న భద్రతా దళాలు | Kadhua… Sifting security forces | Eeroju news

శ్రీనగర్, జూన్ 13, (న్యూస్ పల్స్) జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. రియాసీలో బస్సుపై ఉగ్రదాడి తర్వాత వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు సైతం ధీటుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు ఇంటింటికీ వెళ్లి మంచినీళ్లు అడుగుతున్నారు.అయితే, అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే తలుపులు వేసుకుని, అధికారులను అప్రమత్తం చేశారని పోలీసు అధికారి తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో కనీసం ఒక ఉగ్రవాది మరణించారు. మరో ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం కథువాలోని సైదా గ్రామం సమీపంలో దాక్కున్న రెండో ఉగ్రవాదిని ఆర్మీ, పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ హతమార్చింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు, భద్రతా బలగాలపై…

Read More

ఇంకో మంత్రి పదవి భర్తీ ఎప్పుడు | When will another ministerial position be filled? | Eeroju news

విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. చంద్రబాబుతో పాటు నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది.కొణతాల రామకృష్ణ సీనియర్ నేత. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత ఒక్కరే మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. విశాఖ లాంటి జిల్లాకు ఒక్కరే మంత్రి పదవి అని ఎవరూ ఊహించని విషయం. అయితే అదే సమయంలో విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. BJPఅయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కొణతాల రామకృష్ణ ఇలా అనేక మంది నేతలు కూటమి నుంచి విజయం సాధించి ఉన్నారు. అందులో మహిళ, ఎస్సీ కోటాలో ఒక్క వంగలపూడి అనిత…

Read More

కూరగాయల ధరలకు రెక్కలు.. | Wings for vegetable prices.. | Eeroju news

రాజమండ్రి, జూన్ 13, (న్యూస్ పల్స్) తూర్పుగోదావరి జిల్లాల్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధ‌ర‌ల మంట‌కు సామాన్యుల క‌ల్లల్లో నీరు తిరుగుతుంది. అమాంతం పెరిగిన నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను ధ‌ర‌ల‌ను చూసి సామాన్యులు విల‌విలలాడుతున్నారు. ఇటీవ‌లి కురిసిన అకాల వ‌ర్షాల వ‌ల్లే కూర‌గాయల ధ‌ల‌కు రెక్కలు వ‌చ్చాయ‌ని రైతులు, విక్రయ‌దారులు పేర్కొంటున్నారు. కూర‌గాయ‌లు, ఇత‌ర వంట స‌రుకుల ధ‌ర‌లు సామాన్యుని వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. ఏం కొనేట‌ట్టు లేదు…ఏం తినేట‌ట్టు లేదు అన్న ప‌రిస్థితి నెల‌కొంది. వారం రోజుల్లోనే రిటైల్ మార్కెట్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌లు బెంబేలెత్తుతున్నారు. కొన్నింటి ధ‌ర‌లు మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగాయి.వారం క్రితం వ‌ర‌కూ కిలో ట‌మాటా రూ.20 ఉండ‌గా, ప్రస్తుతం అది మూడింత‌లు పెరిగి రూ.60కు చేరింది. ప‌చ్చిమిర్చిని ముట్టుకుంటే ధ‌ర…

Read More

ఫ్యామిలీలను పక్కన పెట్టేశారు… | Families were left aside… | Eeroju news

నెల్లూరు, జూన్ 13, (న్యూస్ పల్స్) చంద్రబాబు నాయుడు ఈసారి మంత్రి వర్గ కూర్పులో విన్నూత్న తరహాను అవలంబించారు. సిన్సియారిటీ, సీనియారిటీ అన్నది కూడా పెద్దగా చూడలేదు. అలాగే రాజకీయాల్లో ప్రతిష్ట కలిగిన కుటుంబాలను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా చంద్రబాబు మారిపోయారన్న దానికి ఈ మంత్రి వర్గ కూర్పు ఉదాహరణ అని అందరూ భావించేలా కేబినెట్ ఉందన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు కేబినెట్ అంటే ఖచ్చితంగా ఉంటామని భావించిన వాళ్లకు ఈసారి మాత్రం నిరాశ ఎదురయింది. అంతేకాదు.. తాను ఇంతేనని చంద్రబాబు కొందరు నేతలకు చెప్పినట్లయింది.ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కొన్ని కుటుంబాలతో వేరు చేసి చూడలేం. ఎందుకంటే దశాబ్దకాలం నుంచి ఆ కుటుంబాలు టీడీపీతో నడుస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురయినా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సమస్యలు…

Read More