తిరుపతి, జూన్ 13, (న్యూస్ పల్స్) అందరి లక్ష్యం ఆయనే. ఆయన టార్గెట్ గా రాబోయే రాజకీయమంతా నడుస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. శత్రువుల సంఖ్య అపారం. ఆయనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి పని పట్టేందుకు ఇప్పుడు అధికార పార్టీ నేతలంతా కాచుకూర్చుని ఉన్నారు. ఒక్కరైతే పర్లేదు. కానీ కూటమిలోని మూడు పార్టీలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శత్రువులున్నారు. ఈ ఎన్నికల్లో మరింత పెరిగారు. దీంతో ఆయన లక్ష్యంగా అధికార పార్టీ ఎక్కుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా సుదీర్థ రాజకీయాల నుంచి కొందరితో శత్రువులుంటే.. మరికొందరిని పార్టీ కోసం తనకు వ్యతిరేకంగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు వైఎస్ జగన్ కంటే ముందు ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడమే అధికార పార్టీ నేతలకు ఫస్ట్ ప్రయారిటీగా మారనుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
Read MoreTag: Eeroju news
యనమల లేని ఫస్ట్ కేబినెట్ | First cabinet without movement | Eeroju news
కాకినాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) చంద్రబాబు నాయుడు ఈసారి కేబినెట్ లో సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారు. సీనియర్ నేతలు ఎవరినీ ఈసారి పరిగణనలోకి తీసుకోలేదు. యనమల రామకృష్ణుడు నుంచి మొదలు పెడితే… అమర్‌నాధ్ రెడ్డి వరకూ ఎవరికీ తన మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీలోకి యువరక్తం ఎక్కించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్ లో ఎలాంటి రాజకీయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు సామాజికవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడుతుంది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు లేని చంద్రబాబు కేబినెట్ ఇదే మొదటిది అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా యనమల రామకృష్ణుడు ఖచ్చితంగా మంత్రిగా ఉంటారు. ప్రాధాన్యత కలిగిన…
Read Moreఏపీకి సూపర్ ఛాన్స్ | Super chance for AP | Eeroju news
విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో చంద్రబాబు నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అతిరథ మహారధుల సమక్షంలో కొత్త పాలకుల ప్రమాణస్వీకారం పూర్తయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకోవడం ఖాయం. ప్రమాణం చేసిన 24 మంది రేపటి నుంచి తమ విధుల్లోకి వెళ్ళనున్నారు. కొత్త పాలన ప్రారంభించనున్నారు. జనసేన తరఫున ముగ్గురు, బిజెపి తరఫున ఒక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన 17 మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మంత్రివర్గంలో కనిపిస్తున్నది యువ రక్తమే. అందుకే ప్రమాణ స్వీకారం సైతం ఉత్సాహంగా సాగిపోయింది. ఈ…
Read Moreఅమరావతిలో భూముల ధరలకు రెక్కలు | Wings for land prices in Amaravati | Eeroju news
విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత అయిదేళ్లుగా చతికిలపడిన భూముల రేట్లు కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రాజధాని ఆశలతో తిరిగి పుంజుకున్నాయి. నిజం చెప్పాలంటే 2023 డిసెంబరు నెల నుంచే తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి కానున్నారనే టాక్ రావడంతో నిర్జీవమైన భూముల ధరల్లో చలనం కనిపించింది. మూడు రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వం తెరపైకి తేవడంతో.. ఏపీ రాజధాని అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు దాదాపు నాలుగేళ్లపాటు నేల చూపులు చూశాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే పరిస్థితికొచ్చాయి. భూములు కొనుగోళ్ల పరిస్థితి అటుంచితే.. కనీసం అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు వైపు సైతం చూసేవారు లేని పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని నెలల నుంచి పరిస్థితిలో మార్పు కనిపించింది. వైసీపీ…
Read Moreబీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు సంబరాలు…| TDP leaders celebrate BC Janardhan Reddy’s ministership… | Eeroju news
కొలిమిగుండ్ల, జూన్ 12, కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మన బనగానపల్లె నియోజకవర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు బస్టాండ్ సెంటర్లో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటపాడు శివరామిరెడ్డి, కొలిమిగుండ్ల అందేరాము, బొట్టు స్వామి, నాగార్జున రెడ్డి, తెలికి నాగేశ్వర్ రెడ్డి, గూడూరు నాగేశ్వర్రెడ్డి, నిమ్మకాయల చిన్న దస్తగిరి, గ్రామ టిడిపి అధ్యక్షుడు బత్తూరి శీను, టైలర్ వెంకట్రాముడు, సీతారామయ్య, నర్సింహులు, చంద్రశేఖర్, రవి, మధు,మంధా విజయ్, దస్తగిరి, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Moreకోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు | Telugu Desam Party Lines in Kodada Constituency | Eeroju news
సూర్యాపేట జిల్లా, జూన్ 12 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా కోదాడ రూరల్ మండలం గుడిబండ గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ, పార్టీలు వేరైనా లక్షల మంది గుండెల్లో నందమూరి తారక రామారావు అభిమానం కలదు అన్నారు . కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఓరుగంటి ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం నేర్పింది , సంక్షేమ పథకాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు అన్నారు. నారా చంద్రబాబునాయుడు పాలనలో బీసీలకు రాజ్యాధికారము కల్పించినారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించింది అంటే దానికి చంద్రబాబు నాయుడు…
Read Moreమాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ | Big shock for former minister, Medchal MLA Mallareddy | Eeroju news
మేడ్చల్ జూన్ 12 బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సుచిత్ర పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు బుధవారం హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ ను పంపించారు.అయితే.. దశాబ్ద కాలంగా అది తన భూమి అపి మల్లారెడ్డి అంటున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేపట్టిన రెవిన్యూ అధికారులు.. ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు.
Read Moreజీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం | Minister Ponnam Prabhakar is angry with GHMC officials | Eeroju news
హైదరాబ్నాద్ జూన్ 12 జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి పొన్నం జీహచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని జీహచ్ఎంసీ, వాటర్ బోర్డ్ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ ను అధికారులు మంత్రికి తెలియజేశారు. ముందస్తు చర్యలపై అధికారుల సమాధానంపై పొన్నం అసహనం వ్యక్తం చేశారు.వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్ళు ఆగుతున్నాయని అధికారులు ప్రశ్నించారు. నగరంలో శానిటేషన్ అధ్వన్నంగా ఉందని.. అధిక సంఖ్యలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి నిలదీశారు. నగరంలో సాయంత్రం పీక్ అవర్స్ లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీదే ఉండాలని చెప్పారు.
Read Moreపెరిగిన ఆర్టీసీ బస్సు టిక్కెట్లు | Increased RTC bus tickets | Eeroju news
హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో మరో సారి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీల్లో టోల్ గేట్ రుసుములు పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 చొప్పున చార్జీలు పెరిగాయి. టోల్ గేట్లు ఉన్న రహదారుల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుములు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంతో టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్ చార్జీల్లో కలిసి ఉన్న టోల్ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు,…
Read Moreటెట్ ఫలితాలు రిలీజ్ | Tet results release | Eeroju news
హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు బుధవారం (జూన్ 12) వెలువడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన పదిరోజుల్లోనే టెట్ ఫలితాలను విడుదల చేయడం విశేషం.టెట్-2024 ఫలితాలకు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం,…
Read More