15 ఏళ్ల వాహానాలు దాటితే…వాహానాలు ఇక స్క్రాపే.. హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణలో 15ఏళ్లు దాటిన వాహనాలను తక్కు కింద మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నియత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలు తెలంగాణ 30 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే 15 ఏళ్లు నిండిన 20 లక్షల వాహనాలు ఉన్నాయి. వాటిలో 17 లక్షల బైకులు, 3.5 లక్షల కార్లతో పాటు లక్ష గూడ్స్ క్యారేజీలు, 20,000 ఆటోలు ఉన్నాయి,2025, జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రమాదకరమైన మరియు కాలుష్యకారక వాహనాలను స్క్రాప్‌కు పంపాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు….అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయితే… ఆ వాహనాలకు…
Read MoreTag: Hyderabad
CPS employees | సీపీఎస్ కోసం ఉద్యోగుల ఒత్తిడి | Eeroju news
సీపీఎస్ కోసం ఉద్యోగుల ఒత్తిడి హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) CPS employees కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ విధానం.. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందనే వాదనలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తరువాత.. వారికి రావాల్సిన భృతి అందటం ప్రశ్నార్ధకంగా మారింది. 2004 సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సీపీఎస్ విధానాన్ని ఉపాధ్యాయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి.. అమలు బాధ్యతను ఇచ్చికంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. జీవో ఎంఎస్ నెంబర్ 653, 654, 655 ద్వారా అమలు చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత.. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని తమ నిర్ణయాన్ని అడిగింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం జీవో…
Read MoreJohnny master | కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు | Eeroju news
కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు హైదరాబాద్ సెప్టెంబర్ 19 Johnny master జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..! డ్యాన్సర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు బాధితురాలి నుంచి ఇప్పటికే స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. కాగా పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. పోలీసులు జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని ఆధారాలు సేకరించడంలో భాగంగా…
Read MoreRajiv gandhi | రాజీవ్ గాంధీ విగ్రహంపై రాద్దాంతం… | Eeroju news
రాజీవ్ గాంధీ విగ్రహంపై రాద్దాంతం… హైదరాబాద్, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Rajiv gandhi అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రశ్నలు సహజం. ఆరోపణలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండటం ప్రజాస్వామ్యానికి అవసరం. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాన్ని నిలబెట్టడం.. తప్పు చేస్తే ప్రజా కోర్టులో బోనెక్కించడానికి ప్రతిపక్షం పని చేయాలి. కానీ, ప్రతిపక్షం అయినంత మాత్రానా ప్రభుత్వంపై అక్కర్లేని ఆరోపణలు, అనవసర రాద్ధాంతాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏ పనికి శ్రీకారం చుట్టినా అడ్డుతగిలి ఆటంకపరచాల్సిన పనీ లేదు. అనవసర వాద ప్రతివాదనలు చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడాన్ని ఎవరూ హర్షించరు. ఇప్పుడు విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న గొడవపై ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. కొత్త సచివాలయంలో తాము ఒక ఐలాండ్ ఏర్పాటు చేశామని, అందులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని…
Read MoreVande Bharat Train | 19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్స్ | Eeroju news
19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్స్ హైదరాబాద్, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Vande Bharat Train మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రైల్వే శాఖ.. రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రయాణికులను ఆట్టుకునేలా అత్యాధునిక సౌకర్యాలతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ రైళ్లను రూపొందించింది. ఏడాదిగా వందే భారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా కేంద్రం వందే భారత్ రైళ్లను కేటాయించింది. తాజాగా మరో రెండు రైళ్లను రెండు తెగులు రాష్ట్రాల మీదుగా నడపాలని నిర్ణయించింది. ఈమేరకు రూట్లు ఖరారు చేసింది. సెప్టెంబర్ 16న ఒకేసారి ఆరు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన రెండు వందే…
Read MoreThe case against Johnny Master | జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు | Eeroju news
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు హైదరాబాద్, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) The case against Johnny Master తెలుగు, తమిళ చిత్రసీమలతో పాటు హిందీలోనూ పేరు ఉన్న నృత్య దర్శకుడు జానీ మాస్టర్ . ధనుష్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, భారతీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ‘తిరు చిత్రంబళం’ సినిమాలో పాటకు గాను జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన మీద లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. మాస్టర్ తనను కొంత కాలంగా వేధిస్తున్నారని, తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 21 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఆరోపణలు చేసింది. సదరు మహిళా నృత్య దర్శకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ మీద ఫిర్యాదు చేసిన అమ్మాయి ఆయనతో…
Read MoreAP BJP : కాపు సామాజిక వర్గం బీజేపికి ఆశాకిరణమేనా?
AP BJP : కాపు సామాజిక వర్గం బీజేపికి ఆశాకిరణమేనా? విజయవాడ, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) ఏపీ పై బీజేపీ ఫోకస్ పెట్టిందా? బలపడడానికి ఇదే సరైన సమయం అని భావిస్తోందా? ఒక సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ, బీసీల మద్దతు ఉంది. జనసేనకు కాపు సామాజిక వర్గం అండగా నిలబడుతోంది. బిజెపి కి మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచింది రెడ్డి సామాజిక వర్గం. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ వైఖరి నచ్చక సైలెంట్…
Read MoreAgrigold | అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి | Eeroju news
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి హైదరాబాద్ Agrigold అగ్రిగోల్డ్ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ హామి ఇవ్వడం పట్ల తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.సునీత హర్షం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించి మోసం చేసిందని, వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధుల బృందం సిఎం రేవంత్ కలిసి వినతి పత్రం సమర్పించింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షలమంది ఉన్నారని, వీరి నుంచి ఆ సంస్థ రూ.500 కోట్లను సేకరించిందని తిరిగి చెల్లించే…
Read MoreKCR and Kavitha | ప్రజల్లోకి కేసీఆర్, కవిత | Eeroju news
ప్రజల్లోకి కేసీఆర్, కవిత హైదరాబాద్, ఆగస్టు 31 (న్యూస్ పల్స్) KCR and Kavitha బీఆర్ఎస్ పార్టీ కొంత కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత కవిత అరెస్టు.. పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం.. సగం చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీకి ఊహించని దెబ్బ. కోలుకోవాలంటే..ముందుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం స్థైర్యాన్ని కూడదీసుకోవాలి. ఓ వైపు కుమార్తె కవిత జైల్లో ఉంటే.. కేసీఆర్ బయటకు రాలేకపోయారు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు కవిత రిలీజయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి రావడమే మిగిలిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీని టార్గెట్ చేస్తారన్నది కీలకంగా మారింది.…
Read MoreCM Revanth | సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు | Eeroju news
సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు హైదరాబాద్ CM Revanth సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిసి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారినలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు వున్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju…
Read More