Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీఆర్ఎసే కావాలంటున్న బీ ఆర్ ఎస్ నేతలు

0

హైదరాబాద్, జనవరి 13, (న్యూస్ పల్స్)
బీఆర్‌ఎస్‌ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారింది గులాబీ పార్టీ పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడంపై కార్యకర్యల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నిర్ణయంపై.. బీఆర్‌ఎస్ అధినేత.. కేసీఆర్ ఎలా స్పందిస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణలో తనదైన మార్క్ వేసుకున్న గులాబీ పార్టీకి.. బీఆర్‌ఎస్ పేరు పెద్దగా కలిసిరాలేదు. ఉద్యమ పార్టీగా ప్రజలకు చేరువై.. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల మన్ననలు పొందింది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. రెండోసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతోనే అధికారంలోకి వచ్చినా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలన్న అభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు.

 

పార్టీ కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలపడంతో పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మారింది.పార్టీ పేరు మార్చిన కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి.. పార్టీని విస్తరించే కార్యాచరణను అమలు చేశారు. మహారాష్ట్ర, ఢిల్లీలో పార్టీ కార్యాలయాలను మొదలుపెట్టారు. ఇదే సమయంలో పార్టీ క్యాడర్ నుంచి పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. టీఆర్ఎస్ పేరు మార్చడంతో.. తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమైందన్న వాదనను కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు తెరపైకి తెచ్చారు. పార్టీ పేరు మార్పు ప్రభావం ఎన్నికలలో ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యంగా అధినేత కేసిఆర్ నేతల అభ్యంతరాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అధినేతగా కెసిఆర్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించే యత్నం చేశారుఈలోపే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో.. బీఆర్ఎస్‌గా తొలి ఎన్నికల్లో అధికార పార్టీకి రాష్ట్రంలో ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

 

ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్‌కు ఈ సమీక్షల్లో పార్టీ పేరు మార్పు పైన కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్లీ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ పెద్దలకు తమ అభిప్రాయాలను వినిపిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న కడియం శ్రీహరి లాంటి నేతలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తెలంగాణ ప్రజలతో మమేకం అయిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.వరుసగా నిర్వహిస్తున్న సమావేశాల్లో పేరు మార్చాలని డిమాండ్ పెరుగుతుండడంతో పార్టీ కూడా ఇప్పుడు పునరాలోచనలో పడిందన్న చర్చ గులాబీ నేతల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ మళ్లీ టిఆర్ఎస్ గా మారుతుందా అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది. పార్టీ పేరును మార్చాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వస్తే పార్టీ అధినేత కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరమే ఇందుకు సంబంధించిన నిర్ణయం ఉండవచ్చని తెలుస్తోంది

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie