బ్యాక్ టూ హైదరాబాద్
విజయవాడ
మూడు రోజులపాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకొన్న వారంతా.. తిరిగి హైదరాబాద్ వైపు క్యూ కట్టారు. దీంతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నాలుగు టోల్ ప్లాజాల దగ్గర హైదరాబాద్ వైపు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. కేతపల్లి మండల పరిధిలోని కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర హైదరాబాద్ వైపు 6 ఇంటీలను ఓపెన్ చేయగా.. చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర హైదరాబాద్ వైపు ఎనిమిది ఎంట్రీలను ఓపెన్ చేశారు. నార్కెట్పల్లి-అద్దంకి హైవేపై హైదరాబాద్ వైపు ఆరు టోల్ ప్లాజా ఎంట్రీలను ఒపెన్ చేయగా.. హైదరాబాదు-వరంగల్ హైవేపై ఆరు ఎంట్రీలను ఓపెన్ చేశారు.