Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మెదక్ లక్ష్యంగా అడుగులు

0

మెదక్, జనవరి 17, 

రాష్ట్రంలో ప్రభుత్వంను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా పెద్ద ఎత్తున్న ఎంపీ సీట్లను గెలవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానాన్ని గెలవాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మెదక్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహపై పెట్టిందట కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే ఆయనను మెదక్ లోక్ సభ ఎన్నికల కోఆర్డినేటర్‌గా నియమించారు. కానీ ఇక్కడ పార్టీ పరిస్థితి చూస్తే మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉన్నదని, సీరియస్‌గా తీసుకోకపోతే కష్టమే అని గుర్తించిన మంత్రి ఇప్పటి నుండే వ్యూహా రచనలు చేస్తున్నారట.మెదక్ ఎంపీ సీటు అనేది చాలా హాట్ సీట్ కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అందరి చూపు ఈ పార్లమెంట్ స్థానం పై ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్అధిష్టానం మెదక్ లోక్ సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించి, ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహాకు మెదక్లోక్సభ స్థానంలో కాంగ్రెస్పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించిందట.

ఇక్కడ ప్రియాంక గాంధీని పోటీలో ఉంచాలని అధిస్థానం ఆలోచనలు చేస్తుందట. మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 చోట్ల బీఆర్‌ఎస్‌ విజయ కేతనం ఎగురవేసింది. సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట బీఆర్ఎస్అభ్యర్థులు గెలుపొందగా, కేవలం ఒక్క మెదక్అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్అభ్యర్థి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మెదక్ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు లభించిన ఓట్లలో భారీ వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో మెదక్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులువయ్యే పరిస్థితి కనిపించడం లేదట.

ఈ విషయాన్ని గమనించిన మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ పార్లమెంట్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారట. ఎప్పటికప్పుడు మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న నేతలతో టచ్ లో ఉంటున్నారటరెండున్నర దశాబ్దాల కాలంగా మెదక్ పార్లమెంటు స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పట్టు బిగించి వరుస విజయాలతో మెదక్ లోక్సభ స్థానంలో పాగా వేశాయి. 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత బాగారెడ్డి ఎంపీగా గెలుపొందగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఈ స్థానంలో గెలవలేదు. 2009 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన విజయశాంతి ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, 2019లో అదే పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఇలా మెదక్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. మరో వైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ గెలిచేలా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తున్నారట.

అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మెదక్ పార్లమెంటు పై ఫోకస్ పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట మాజీ మంత్రి హరీష్.ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న మరో సమస్య గ్రూప్ పాలిటిక్స్. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఓటమి పాలుకావడానికి, కాంగ్రెస్నాయకులందరు కలిసికట్టుగా పని చేయకపోవడమేనట. చాలామంది నేతల్లో ఓవర్కాన్ఫిడెన్స్, కొన్ని చోట్ల నాయకుల మధ్య వర్గ, విబేధాలలే ఓటమికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట. ముఖ్యంగా సిట్టింగ్స్థానమైన సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం ఆ పార్టీకి పెద్ద షాక్ఇచ్చింది. ఈ క్రమంలో మెదక్ లోక్సభ స్థానంలో గెలుపొందాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని, తదనుగుణంగా లోపాలు సరిదిద్దుకోవాలని కొంతమంది పార్టీ సీనియర్లు మంత్రి దామోదర రాజనర్సింహ ముందు పదే పదే చెప్తున్నారట..మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే, కాంగ్రెస్నాయకులందరిని ఏకతాటి మీదకు తీసుకురవడం అనేది, ప్రస్తుతం దామోదర రాజనర్సింహ ముందు ఉన్న పెద్ద టాస్క్. ఇది చేస్తే కానీ మెదక్ పార్లమెంటు స్థానంలో ఆశించిన ఫలితం దక్కదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. దీనికి తోడు ఎంపీ ఎన్నికలలోపు కాంగ్రెస్ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇంకా అమలులోకి రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు వారి ప్రచార అస్త్రాలుగా మార్చుకునే అవకాశం లేకపోలేదని, ఇవన్నీ చూస్తూ ఉంటే, లోక్సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్గా నియమితులైన మంత్రి దామోదర రాజనర్సింహాకు ఇది ఒక్క పెద్ద టాస్క్ అని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం దామోదర రాజనర్సింహ ఎలాంటి వ్యూహ రచన చేస్తారన్న దాని పై మెదక్ పార్లమెంటు పరిధిలో సర్వత్రా ఆసక్తి నెలకొం

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie