Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ – అవినాష్ రెడ్డి ఏ-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

0

హైదరాబాద్, జూన్ 9,

మాజీ మంత్రి వివేకానందరెడ్డి  హత్య కేసులో .. ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఇప్పటి వరకూ నిందితుడిగా ఎక్కడా చెప్పలేదు. తొలిసారిగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చింది.  హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరివివేతలో కీలకంగా వ్యవహరించారని సీబీఐ కౌంటర్ లో తెలిపింది. భాస్కర్ రెడ్డికి  బెయిల్ ఇస్తే.. దర్యాప్తు, సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తారని సీబీఐ కౌంటర్ లో తెలిపింది. భాస్కర్ రెడ్డి పులివెందులలో చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని … ఆయనకు బెయిల్ ఇవ్వవొద్దని కోరింది. భాస్కర్ రెడ్డిని  అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేశారని.. ఆయన బయట ఉంటే.. పులివెందుల సాక్షులు ప్రభావితమైనట్లేనని కౌంటర్ లో సీబీఐ స్పష్టం చేసింది.

 

బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. విచారణకు సహకరిస్తున్నామని భాస్కర్ రెడ్డి చెబుతున్నారని..కానీ అదంతా అబద్దమన్నారు.    శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ రెడ్డి హత్యాస్థలానికి చేరుకున్నారని అంతకు ముందే .. గంగిరెడ్డి, శివంకర్ రెడ్డి , అవినాష్ రెడ్డి మాట్లాడుకున్నారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారన్నారు. కేసు పెట్టవద్దని.. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు  అవినాష్ , శివశంకర్ రెడ్డి చెప్పారన్నారు. సీబీఐ , కోర్టుకు ఏమీ చెప్పవద్దని దస్తగిరిని ప్రలోభపెట్టారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో భారీ కుట్ర ఉందని దానిపై దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ తెలిపింది.

 

హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. దాఖలు చేసిన కౌంటర్ లో సీబీఐ సీఎం జగన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని  బయట ప్రపంచానికి తెలియక ముందే .. సీఎం జగన్ తెలుసని కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా సీబీఐ కోర్టులోనూ చెప్పింది. దీంతో మరోసారి జగన్ ప్రస్తావనను సీబీఐ తెచ్చినట్లయింది. భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదనలు వినిపించారు.  భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు.  వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సీబీఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు అన్నారు.

మరో వివాదంలో కోడెల శివరామ్

ఆరోపణలు మాత్రమే సీబీఐ పరిగణలోకి తీసుకుందని, భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకబడి ఉన్న వ్యక్తి అని, ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి అని, ఆయన నేరం చేశారనడానికి ఎక్కడా సరైన సాక్ష్యాలు లేవన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదని అన్నారు. ఈ కేసు విషయంలో ఇంప్లీడ్ అయ్యేందుకు గతంలో వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie