సంక్షిప్త వార్తలు:04-24-2025:జమ్ము కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
పహల్గాం మృతులకు సీఎం రేవంత్ నివాళులు
హైదరాబాద్
జమ్ము కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
బీజేపీ కొవ్వోత్తి ర్యాలీ
అనుచిత వ్యాఖ్యాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
![]()
పహాల్గం ఘటనకు నిరసన చేసిన బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై కేసు నమోదు అయింది. జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గం టెర్రరిస్ట్ మరణకాండపై వరంగల్ బిజెపి నేతలు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. కొవ్వత్తుల ర్యాలీ బీజేపీ నేత సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పోస్ట్ లో మహమ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసాడు. దాంతో మహమ్మద్ ఇమ్రాన్ పై స్థానిక మాట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ..
నెల్లూరులో పోలీసుల హై అలర్ట్

నెల్లూరు జిల్లాలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేసారు. అనుమానితులను విచారిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బుచ్చికి చెందిన అహ్మద్ ఇటీవల నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ నేపద్యంలో పోలీసులు జిల్లాలో స్లీపర్ సెల్స్ పై ఆరా తీస్తున్నారు..
పహల్గాం ఘటనపై జగన్ సంతాపం

జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ సంతాపం ప్రకటించారు. గురువారం నాడు అయన కడప జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. సమావేశం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు,.
ఉగ్రవాదులను భూమిలోకి తొక్కేస్తాం

ప్రధాని మోడీ
పాట్న
ఉగ్రవాదులను భూమిలోకి తొక్కేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారను. కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తాం. పహల్గాం ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. చనిపోయిన వారు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు . ఉగ్రవాదులను వారికి సహకరించిన వారిని సూత్రధారులను వదలమని అన్నారు.
