సంక్షిప్త వార్తలు : 28-05-2025

District Collector's wife gives birth in government hospital

సంక్షిప్త వార్తలు : 28-05-2025:ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్  జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ సతీమణి చాలకాలం గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లొనే పరీక్షలు చేయించుకుంటున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ సతీమణికి  కాన్పు జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్  జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ సతీమణి చాలకాలం గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లొనే పరీక్షలు చేయించుకుంటున్నారు. కలెక్టర్  ప్రభుత్వ వైద్యం పై నమ్మకం పెంచారు.

వెంకటరావుపేటలో రోడ్డెక్కిన రైతులు

@TNewsTelugu's video Tweet
కోనరావుపేట మండలం వెంకటరావుపేటలో రైతులు రోడ్డెక్కారు. సన్న రకం వరిధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మొలకొచ్చిన ధాన్యం, పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. నిమ్మపల్లి ఎక్స్ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేసారు. నెలలు గడుస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు.

లెక్టర్ రావాలి..సన్న ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యం పండించాలని, 500 బోనస్  ఇస్తామని చెప్పి కొనుగోలు చేయడంలో జాప్యంఫై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు కదలమని భీష్మించుకుని కూర్చుకున్నారు. అధికారులు పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి చస్తామని హెచ్చరించారు.  రెవెన్యూ, వ్యవసాయ అధికారులు రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేసారు.

 మాజీ ఎమ్మెల్యే హౌజ్ అరెస్టు
కొమురం భీం ఆసిఫాబాద్

How Does House Arrest ACTUALLY Work?

తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ను మేడిగడ్డకు తరలిస్తుంటే మాజీ ఎమ్మెల్యే కోనప్ప అసెంబ్లీ లో గాని బయటగాని నోరు మెదపలేదని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం వలన తూర్పు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని … ఈ విషయంలో తుమ్మిడిహెట్టి వద్ద బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు.

దాంతో బుధవారం ఉదయం ఇరువురిని  హౌజ్ అరెస్ట్ చేసారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సవాలుకు సిద్ధమైన కోనేరు కోనప్ప ని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది ప్రాంతానికి వెళ్తుండగా  అడ్డుకున్నారు.   అటు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు నివాసం వద్ద కూడా ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు.

జూరాల ప్రాజెక్టుకు వరద నీరు షురూ
జోగులాంబ గద్వాల

Jurala project | జూరాలకు పోటెత్తిన వరద.. 32 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల | vidhaatha.com

జూరాల  ప్రాజెక్టుకు వరద మొదలైంది.. ఎగు ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో కుడుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది… 2.800 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది… జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.684 టీఎంసీల నీరు నిల్వ చేరింది… ఎగువ ప్రాంతాల్లో వరద ఇలాగే కొనసాగితే మరో 4,5 రోజుల్లో ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు…

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి

NTR: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి | junior -ntr-and-kalyan-ram-pay-tribute-to-ntr

హైదరాబాద్
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు

Related posts

Leave a Comment