సంక్షిప్త వార్తలు : 30-05-2025:బిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని, మాజీ సిఎం కెసిఆర్ కు లేఖ రాయడంలో తన తప్పు లేదని అన్నారు. కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించానని పేర్కొన్నారు.
పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన
కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించా.. ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ మే ౩౦
బిఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పార్టీని కాపాడుకుకోవాలనేదే తన తపన అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని, మాజీ సిఎం కెసిఆర్ కు లేఖ రాయడంలో తన తప్పు లేదని అన్నారు. కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించానని పేర్కొన్నారు. లేఖను బయట పెట్టిన వారిని పట్టుకోవాలని సూచించారు. తనకంటూ సొంత జెండా, అజెండా లేదని చెప్పారు. కెసిఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని, బిజెపిలో పార్టీ విలీనాన్ని తాను ఒప్పుకోనని కవిత తెలియజేశారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని, తాను జైల్లో ఉన్నప్పుడు బిజెపితో పొత్తు ప్రస్తావన ఆవేదన కలిగించిందని కవిత స్పష్టం చేశారు.
ఒకే సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగోదు
సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలి
ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్
హైదరాబాద్ మే ౩౦
ఒకే సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగోదని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తెలిపారు. ఎపిలోనూ సినీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలని, ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఎపి ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని సూచించారు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలని, సినిమాలను తెలంగాణ, ఆంధ్రా అంటూ వేర్వేరుగా చూడొద్దని కోరారు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటేనని, తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారని మురళీమోహన్ పేర్కొన్నారు.
కాంట్రాక్టు క్యారేజ్ బస్సుల తనిఖీలు
ఏలూరు
రాష్ట్ర రవాణా కమిషనరు ఆదేశాల మేర ప్రతి వారం కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న విషయము తెలిసిందే. దాంట్లో భాగంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీ అధికారులు కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 152 కేసులు నమోదు చేసి రూ. 5,01,500/- అపరాధ రుసుము, పన్ను విధించారు. ఏలూరు జిల్లాలోని వాహన తనిఖీ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేసారు. శాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీవోలు కె.ఎస్.ఎం.ఎన్.కృష్ణారావు ఎండి. మదని, వాహన తనిఖీ అధికారులు ఎస్.రంగనాయకులు, జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు, కళ్యాణి, కృష్ణవేణి, పి.నరేంద్ర బాబు, అన్నపూర్ణ, డి.ప్రజ్ఞ పాల్గొన్నారు.
జాగాలు ఇచ్చినవారికి ఇల్లు ఇవ్వడంలేదు

ఎంపి ఈటల
సికింద్రాబాద్
సికింద్రాబాద్ డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై ఈటల రాజేందర్ స్పందించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో 30 గజాలు 40 గజాలు స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి సికింద్రాబాద్ నడిబొడ్డున గుడిసెలను ఉండొద్దని డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు చేశారు. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం జాగాలు ఇచ్చిన వారికి ఆ ఇల్లు కేటాయించడంలో విఫలం చెందారు. ఇల్లు కేటాయించకుండా చాలా సంవత్సరాల నుంచి అలానే ఉంటున్నాయి. అర్హులకు ఇల్లు ఇవ్వండి తప్ప బ్రోకర్లకు పైరవీకారులకు ఇల్లు ఇస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్ కి చెప్పామని అన్నారు.
ముందుగా భూమి ఇచ్చిన వారికి ఇళ్ల కేటాయింపు చేయాలని మరోసారి కోరుతున్నాము. కొంతమంది బ్రోకర్లు, పైరవీకారులు, ప్రభుత్వ సంబంధించిన నాయకులు ఇళ్లు కేటాయిస్తామని డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని చెప్తున్నాం. కలెక్టర్ పాజిటివ్గా ఉన్నారు న్యాయాన్ని అమలు చేయడానికి సంకల్పంతో ఉన్నారు.. కాబట్టి కింద అధికారుల మీద నియంత్రణ పెట్టుకుని అక్రమాలు అన్యాయం జరగకుండా డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు జరగపాలని కోరాము. దీపిక నాయకత్వంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు కలెక్టర్ ను కలుస్తారు అని ఈటల రాజేందర్ తెలిపారు
ఎంపీ వద్దిరాజును కలిసిన ఏల్ఏచ్పీఏస్ నాయకులు

హైదరాబాద్
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను లంబాడీ హక్కుల పోరాట సమితి (ఏల్ఏచ్పీఏస్) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఏల్ఏచ్పీఏస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షుడు దశరథ్ నాయక్ ల ఆధ్వర్యాన పలువురు నాయకులు ఎంపీ రవిచంద్రను శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
గోర్ బోలి భాషను అధికారికంగా గుర్తిస్తూ రాజ్యాంగంలో పొందుపర్చాలని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి మైదాన ప్రాంతాలలో ఐటీడీఏలను నెలకొల్పాలని కోరుతూ ఎంపీ రవిచంద్రకు వినతిపత్రం సమర్పించారు. ఈవిధంగా తమ న్యాయమైన హక్కుల సాధనకు సంపూర్ణ మద్దతునివ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజుకు వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రాజేష్, దశరథ్ నాయక్ ల వెంట ఏల్ఏచ్పీఏస్ నాయకులు శివాజీ నాయక్,నందూ నాయక్, గణేష్ నాయక్,లాలునాయక్ తదితరులు ఉన్నారు.
