సంక్షిప్త వార్తలు:05-06-2025:జగిత్యాల జిల్లాలో విద్యార్థిని బలిగొన్న నీట్ పరీక్ష…కీ విడుదలతో మార్కులు తక్కువ వస్థాయని మనస్థాపంతో విద్యార్ధిని ఉరి వేసుకుంది. నీట్ పరీక్ష జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఈసారి పరీక్ష పేపర్ హార్డ్ గా రావడంతో మార్కులు తక్కువ వస్తాయని భావించిన విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామానికి చెందిన జంగా పూజ ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ పోలీసులకు పిర్యాదు చేశారు.
జిల్లాలో ఆదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
అంబేద్కర్ కోనసీమ
కోనసీమ జిల్లాలో అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి వెల్లడించారు. జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్షం కాగా ఇంత వరకు లక్షా 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మిల్లర్లు కూడా మద్ధత్తు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి. తడిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఆమె అన్నారు.
నీట్ లో మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్దిని ఆత్మహత్య

జగిత్యాల
జగిత్యాల జిల్లాలో విద్యార్థిని బలిగొన్న నీట్ పరీక్ష..కీ విడుదలతో మార్కులు తక్కువ వస్థాయని మనస్థాపంతో విద్యార్ధిని ఉరి వేసుకుంది. నీట్ పరీక్ష జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఈసారి పరీక్ష పేపర్ హార్డ్ గా రావడంతో మార్కులు తక్కువ వస్తాయని భావించిన విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామానికి చెందిన జంగా పూజ ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
నీట్ పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. గత రెండు సంవత్సరాలుగా నీట్ పరీక్ష రాస్తున్న పూజకు ర్యాంకు రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. ఆదివారం జరిగిన నీటి పరీక్ష కు హాజరయ్యారు. నిన్న నీట్ పరీక్షకు సంబంధించిన కీ విడుదల కావడంతో తక్కువ మార్కులు వస్తున్నట్లు భావించిన పూజ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈసారి నీట్ పరీక్ష పేపర్ చాలా హార్డ్ గా వచ్చిందని, విద్యార్థులతోపాటు అధ్యాపకులు తెలిపారు. ఫిజిక్స్ చాలా టఫ్ గా ఉండడంతో మార్కుల స్కోర్ తగ్గే అవకాశం ఉండడంతో చాలామంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ మంత్రి తుమ్మల

హైదరాబాద్
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సొంత ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసారు. రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. ఉచితాలు తగ్గించాలి.. అందరికీ రేషన్ కార్డులు కావాలంటే ఎలా అని నిలదీసారు. తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉంటే, 1 కోటి 25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.. అంటే తెలంగాణలో అందరూ పేదలేనా అని ప్రశ్నించారు.
అవాకులు చవాకులు మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

పల్నాడు
పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మేత్త కోటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొన్ని రోజులుగా అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. గోపిరెడ్డి ఘోర ఓటమి దెబ్బకి ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామ స్థాయికి వచ్చాడు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో గొడవలు పెట్టి లబ్ది పొందాలనే గోపిరెడ్డి కుతంత్రాలు పన్నుతున్నాడు.
నరసరావుపేటకి పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పనైనా చేశావా అని ప్రశ్నించారు. పంచాయతీ సెక్రటరీ సోమనాథ్ పై చేసినవి అన్ని తప్పుడు ఆరోపణలే. బుచ్చిపాపన్న పాలెంలో గ్రామంలో ఒకప్పుడు నువ్ చేసిన భాగోతాలు గుర్తులేవా. మరోసారి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు. పంచాయితీ సెక్రటరీ సోమనాథ్ ని పదేళ్లు నువ్వే లెటర్ ఇచ్చి రెండు గ్రామాలకు సెక్రటరీగా నియమించావు ఆ విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు.
కిడ్నాప్ ఘటనను అడ్డుకున్న పోలీసులు
![]()
అనంతపురం
అనంతపురం నగరంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. ఆరో రోడ్డుకు చెందిన మురళి అనే వ్యక్తిని కిడ్నాప్ చేయాలని నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులోనికి ఎక్కించారు. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు కారును వెంబడించి టవర్ క్లాక్ సమీపంలో చుట్టుముట్టి కారుని ఆపారు. కిడ్నాపర్ల చర నుంచి మురళి అనే వ్యక్తిని తప్పించి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆరో రోడ్డుకు చెందిన మురళి అనే వ్యక్తి తాడిపత్రి కి చెందిన లక్ష్మీ అనే మహిళతో వివాహేతర సంబంధం విషయంలో ఈ కిడ్నాప్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. తాడిపత్రికి చెందిన మహిళకు మురళితో గొడవల కారణంగా కొంతమంది వ్యక్తులతో కలిసి మురళిని కిడ్నాప్ చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. ప్రస్తుతం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించాలని వైకాపా అందోళన

తిరువూరు
వైఎస్సార్సీపి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ తిరువూరు (లక్ష్మీపురం) సబ్ స్టేషన్ వద్ద ఆందోళన జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జ్- నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ 15వేల 400 కోట్లను కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపింది. ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచమని అబద్ధపు హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం, టిడిపి,జనసేన,బిజెపి కలిసి ఇచ్చిన మేనిఫెస్టో నేడు అమలు కావడం లేదని అన్నారు.
విద్యుత్ బిల్లులు చెల్లించలేక సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, రకరకాల పన్నులు తీసేయాలి పేద ప్రజలకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేసారు. హామీలకు నేను గ్యారంటీ అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తరువాత విద్యుత్ శాఖ ఏఈ కి వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఎన్. సుధారాణి,జిల్లా, నియోజకవర్గ స్థాయిలోని ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
