Ayushman Scheme : ఆయుష్మాన్ స్కీంలో ఇంపార్ట్ టెంట్ అప్ డేట్

Ayushman Scheme: Important update on Ayushman Scheme

Ayushman Scheme :ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో సీనియర్ సిటిజన్స్ చికిత్స పొందవచ్చు. అయితే 70 ఏళ్ళు పైబడిన   ఈ కార్డు కోసం ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా 10 సులభమైన దశలలో ఎలా దరఖాస్తు చేసుకోవాలో అలాగే ఈ కేవైసీ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుష్మాన్ స్కీంలో ఇంపార్ట్ టెంట్ అప్ డేట్

హైదరాబాద్, మే 30
ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో సీనియర్ సిటిజన్స్ చికిత్స పొందవచ్చు. అయితే 70 ఏళ్ళు పైబడిన   ఈ కార్డు కోసం ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా 10 సులభమైన దశలలో ఎలా దరఖాస్తు చేసుకోవాలో అలాగే ఈ కేవైసీ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్ కి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. పై వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఆసుపత్రి ఖర్చుల గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ వయా వందన యోజన పథకం ద్వారా సీనియర్ సిటిజన్స్ ఉచితంగా ఐదు లక్షల వరకు బీమా పొందవచ్చు.

మీరు సంపాదించిన దానితో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఈ కార్డుతో సీనియర్ సిటిజన్స్ ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు.దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 2024లో ప్రారంభించిన ఈ పథకం ఆయుష్మాన్ భారత్ లో ఒక భాగం అని చెప్పొచ్చు. ఈ పథకం కింద 70 ఏళ్ళు భయపడిన ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య భీమా కవరేజ్ పొందవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి ఈ కార్డు ఉంటే చాలు వాళ్ళు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. వీరికి ఇంతకుముందు ఉన్న వ్యాధులు అన్నిటికీ కూడా కార్డు తీసుకున్న తొలి రోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స అందుతుంది.

వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ కార్డు కోసం మీ ఫోన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆయుష్మాన్ భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో బెనిఫిషియరీగా లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటిపి ద్వారా లాగిన్ అవ్వండి.ఆ తర్వాత మీ రాష్ట్రం పేరుతో పాటు ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ ఈ జాబితాలో మీ పేరు కనిపించకపోతే వెంటనే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి. ఓటిపి పొందిన తర్వాత అనుమతి ఇవ్వండి. అందులో వివరాలన్నీ పూర్తిగా నింపి డిక్లరేషన్ను సమర్పించండి. చివరకు మీ మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేయండి. అలాగే క్యాటగిరి పిన్కోడ్ వంటి వివరాలు కూడా ఇవ్వండి. ఒకవేళ మీ ఇంట్లో 70 ఏళ్ళు పైబడిన ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ల వివరాలను కూడా యాడ్ చేసి చివరకు సబ్మిట్ చేయండి. ఈ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మీరు యాప్ నుంచే ఈ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Read more:Bayya Yadav : స్లీపర్ సెల్ లో యూ ట్యూబర్ బయ్యా యాదవ్

Related posts

Leave a Comment