Hyderabad : హైదరాబాద్ నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. జనాభా తోపాటు.. సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేశారు. పలు సేవలను అందిస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల కోసం జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అందుబాటులోకి జీహెచ్ఎంసీ యాప్
హైదరాబాద్, మే 13
హైదరాబాద్ నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. జనాభా తోపాటు.. సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేశారు. పలు సేవలను అందిస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల కోసం జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల పౌర సేవలను అందించడానికి ‘మై జీహెచ్‌ఎంసీ’ మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా అందించే సేవలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ వివరించారు. నగర పౌరులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. అరచేతి నుంచే సేవలను పొందాలని సూచించారు..ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్, ఆరోగ్యం, వీధి దీపాలు, మురుగునీటి సమస్య, రహదారులను ఊడ్చడం వంటి సమస్యలపై ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఫొటో తీసి సమస్య ఉన్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేయవచ్చు..పౌరులు పంపిన ఫొటోలను కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలిస్తారు.
యాప్‌లో ఫిర్యాదు నమోదైన ప్రాంతానికి సంబంధిత అధికారులను పంపిస్తారు..ఫిర్యాదు చేసిన వ్యక్తి మొబైల్‌కు కంప్లైంట్ నంబర్, సంబంధిత అధికారి ఫోన్ నెంబర్లతో మెసేజ్ వస్తుంది. యాప్‌లో ఫిర్యాదు పరిష్కారమైందా, లేదా అని సూరిచూసుకోవచ్చుసమస్య పరిష్కారం కాకపోయినా..అయినట్టు చూపే అధికారులపై కంట్రోల్ రూమ్ నంబర్ 040-21111111 కు ఫిర్యాదు చేయొచ్చు.సమస్యల పరిష్కారమే కాకుండా.. పలు సేవల కోసం దీన్ని వినియోగించవచ్చు. ట్రేడ్ లైసెన్సుకు దరఖాస్తు, ఆస్తిపన్ను మదింపు, పెంపుడు శునకానికి లైసెన్సు తీసుకోవడం, నిర్మాణ వ్యర్థాల తరలింపునకు వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.ప్రజల నివాస ప్రాంతాల్లో దోమల సమస్య, వీధి దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతలు, వీధి కుక్కలు, ఆహార కల్తీ, తదితర సమస్యలపైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
ట్రేడ్ లైసెన్సు, ఆస్తిపన్ను, ఇతరత్రా పన్నులను డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు, వార్డు ఆఫీసులు, ప్రజా మరుగుదొడ్లు, వాతావరణ సమాచారం.. ఇలా చాలా అవసరమైన సేవలు పొందవచ్చు..గ్రేటర్ ప్రజల సౌకర్యం కోసం ఈ యాప్‌ను మరింత సులభతరంగా మార్చామని.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ వివరించారు. ఈ యాప్‌ను ఉపయోగించుకుని వ్యక్తిగత, సమాజ సమస్యల పరిష్కారం పొందవచ్చని చెప్పారు..ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. దీన్ని ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.డిజిటల్‌గా సంతకం చేసిన జనన, మరణ ధృవపత్రాలను దీని ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి ఈ యాప్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.
Read more:Telangana : హాట్ టాపిక్ గా మారిన దామోదర
