Hyderabad : ఆంధ్రావాళ్లు..నాన్ లోకల్ టాప్ ర్యాంక్ వచ్చిన లాభం లేదు

Bad news for AP students who achieved ranks in Telangana EAMCET results.

Hyderabad :తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన ఏపీ విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్. టాప్ ర్యాంకులు సాధించినా సీట్లు మాత్రం రావు. ఈ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం వారికి కన్వీనర్ కోటాలో 15 శాతం సీట్లు పొందే అవకాశం లేదు. విభజన చట్టంలోని పదేళ్ల గడువు ముగియడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రావాళ్లు..నాన్ లోకల్
టాప్ ర్యాంక్ వచ్చిన లాభం లేదు

హైదరాబాద్, మే 13
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన ఏపీ విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్. టాప్ ర్యాంకులు సాధించినా సీట్లు మాత్రం రావు. ఈ విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం వారికి కన్వీనర్ కోటాలో 15 శాతం సీట్లు పొందే అవకాశం లేదు. విభజన చట్టంలోని పదేళ్ల గడువు ముగియడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కన్వీనర్ కోటాలోని 85 శాతం సీట్లు స్థానికులకు కేటాయిస్తుండగా.. మిగిలిన 15 శాతం స్థానికేతర కోటా సీట్లు కూడా తెలంగాణ మూలాలున్న కుటుంబాల విద్యార్థులకే దక్కుతాయి.అంటే ఏపీ సహా.. ఇతర రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులైతేనే వారు ఈ కోటాకు అర్హులు. గత పదేళ్లలో ఏటా ఈ 15 శాతం కోటాలో 3,500 నుండి 4,000 సీట్లు ఏపీ విద్యార్థులకు దక్కేవి. ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు ఆ మేరకు ప్రయోజనం చేకూరనుంది.

దీనివల్ల ఈసారి మంచి కాలేజీల్లో కటాఫ్ ర్యాంకులు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నగరంలో ఇంటర్ చదివినప్పటికీ.. స్థానిక కోటా కింద సీటు పొందాలంటే విద్యార్థులు 6 నుండి ఇంటర్ వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలి. దీంతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ చదివిన చాలా మంది ఏపీ విద్యార్థులు స్థానికేతరులుగా పరిగణించబడతారు. వారు మంచి ర్యాంకులు సాధించినా.. కన్వీనర్ కోటా సీటు మాత్రం పొందలేరు.విజయవాడలోని కాలేజీల్లో చదివిన విద్యార్థులు ప్రాక్టీస్ కోసం తెలంగాణ ఎంసెట్ రాసినా.. వారు కూడా ప్రవేశానికి అర్హులు కాదు. నిజానికి ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు చాలా మంది జేఈఈ మెయిన్‌లోనూ మంచి ర్యాంకులు పొందినవారే. వారు ఐఐటీలు లేదా టాప్ ఎన్‌ఐటీల్లో సీట్లు పొందుతారు. కాబట్టి, ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థులు కూడా ఇక్కడ చేరేది చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Read more:Hyderabad : కళకళలాడుతున్న లాడ్ బజార్

Related posts

Leave a Comment