Siddipet:నకిలీ విత్తనాల రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా

Special surveillance on the transportation and sale of fake seeds

Siddipet:ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలు, కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలు అని చెప్పి రైతులకు అమ్మడం తీరా అవి సరైన దిగుబడి రాక రైతులు  నష్టపోతున్నారు. రైతులు నకిలీ, కల్తీ విత్తన ముఠాల బారిన పడకుండా మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా నకిలీ, కల్తీ విత్తనాలు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.

నకిలీ విత్తనాల రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ

సిద్దిపేట
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు  పోలీస్ కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు
అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్ష
నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేయాలని చూస్తే సహించం.
నకిలీ విత్తన అక్రమార్కులపై పీడియాక్ట్ అమలు చేస్తామని
పోలీస్ కమీషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు..

ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలు, కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలు అని చెప్పి రైతులకు అమ్మడం తీరా అవి సరైన దిగుబడి రాక రైతులు  నష్టపోతున్నారు. రైతులు నకిలీ, కల్తీ విత్తన ముఠాల బారిన పడకుండా మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా నకిలీ, కల్తీ విత్తనాలు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. వారిని అరికట్టడం లో భాగంగా వ్యవసాయశాఖ, టాస్క్ ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ బృందాలు రైతులను మోసం చేసే, నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై గతంలో కేసులు నమోదైన వారిపై  నిఘా ఏర్పాటు చేసి సమాచారం సేకరించి వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సిద్దిపేట జిల్లా పరిధిలో విత్తన, ఎరువుల దుకాణాలను, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీలు, అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్షలకు పంపించడం, రవాణా వాహనాలను కూడా ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. లైసెన్స్ లు లేకుండా వ్యాపారం చేసే వారిపై, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాల జారీ చేయడం జరిగింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు  ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు  చేయడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణాను, సరఫరా నిరోధించేందుకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగిందిని నకిలీ విత్తన అక్రమార్కులపై పీడియాక్ట్ అమలు  చేయడానికి వెనుకడుగు వేయమని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు కలిగి ఉన్న రైతులకు అమ్మడానికి  ఎవరైనా ప్రయత్నించిన వెంటనే డయల్ 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్  8712667100 సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

Read more:Jammikunta:తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసిన పొన్నం. ఎన్ఎస్ యుఐ నాయకులు ఎండి ఇమ్రాన్..

Related posts

Leave a Comment