Telangana : హాట్ టాపిక్ గా మారిన దామోదర

Damodara-Raja-Narasimha

Telangana :తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిగ్గా మారాయి. తాను కరీంనగర్‌ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి కాకపోయినా… తనకు ఏం సంబంధం లేకపోయినా జగిత్యాల రాజకీయంపై దామోధర రియాక్ట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.

హాట్ టాపిక్ గా మారిన దామోదర

మెదక్, మే 13
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిగ్గా మారాయి. తాను కరీంనగర్‌ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి కాకపోయినా… తనకు ఏం సంబంధం లేకపోయినా జగిత్యాల రాజకీయంపై దామోధర రియాక్ట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆల్ ఆఫ్ సడెన్ గా జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లారు మంత్రి దామోధర రాజనర్సింహ. ధర్మపురిలో ఏదో మొక్కు తీర్చుకున్న ఆయన.. జగిత్యాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రివ్యూ చేశారు.ఆ తర్వాత నేరుగా మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు. అంతవరకు అంతా బాగానే ఉన్నా.. జీవన్‌ రెడ్డి నివాసంలో మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి జీవన్‌ రెడ్డి పెద్ద అసెట్ అని..అస‌లు సిస‌లైన కాంగ్రెస్ వాది అంటూ కామెంట్స్ చేశారు. జీవ‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియ‌ర్ నేత‌ని..పార్టీలో ఆయ‌న గౌర‌వాన్ని కాపాడేందుకు తనవంతు ప్రయ‌త్నం చేస్తానంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.మంత్రి దామోద‌ర‌ రాజనర్సింహా ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు ఇంచార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా రాజకీయాలతో ఆయనకు ఏం సంబంధం లేదు. అయితే రెండు రోజుల క్రితం జ‌గిత్యాల‌ జిల్లాకు వెళ్లిన మంత్రి…మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అంతేకాదు.. జ‌గిత్యాల‌లో కాంగ్రెస్ పార్టీ పొలిటిక‌ల్ సిచువేష‌న్ సెన్సిటీవ్ గా ఉన్నప్పటికీ… జీవన్‌ రెడ్డికి మద్దతుగా ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచే అక్కడ సీనియ‌ర్‌నేత మాజీ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డికి, సిట్టింగ్ ఎమ్మెల్యే సంజ‌య్‌ కుమార్ మ‌ధ్య ప‌రిస్థితి ఉప్పు, నిప్పులా మారింది. ఇద్దరు నేత‌ల మ‌ధ్య మాట‌ల‌యుద్ధం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతోంది. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి భగ్గుమనేలా పరిస్థితి తయారైందట. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి దామోద‌ర జీవ‌న్‌రెడ్డికి మ‌ద్దతుగా కామెంట్స్ చేయ‌డం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు జీవన్‌ రెడ్డి విషయంలో ఇన్ని రోజుల తర్వాత మంత్రి దామోదర ఇప్పుడే ఎందుకిలా కామెంట్స్‌ చేశారన్నదానిపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.మాజీ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి కొంత కాలంగా చేస్తున్న కామెంట్స్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా ఉంటున్నాయనే చర్చ పార్టీవర్గాల్లో విన్పిస్తోంది. పార్టీ ఫిరాయింపుల‌తో పాటు త‌ర‌చూ ఏదో ఒక ఇష్యూపై జీవ‌న్‌రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో ముఖ్యమైన నేత‌లు కూడా జీవ‌న్‌రెడ్డి విషయంలో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.ఇన్నాళ్లు జీవన్‌ రెడ్డి విషయంలో ఎప్పుడూ స్పందించని దామోధర ఇప్పుడు ఆయనను వెనుకేసుకొస్తూ మాట్లాడ్డం వెనుక మరేదో ఉందనే టాక్‌ నడుస్తోంది. ఈ మ‌ధ్య జ‌రిగిన ఐఏఎస్ బ‌దిలీల విష‌యంలో ఆరోగ్య శాఖలోని ఇద్దరు అధికారుల‌ను మంత్రికి సంబంధం లేకుండా బదిలీ చేశారనే చర్చ నడుస్తోంది. అప్పటినుండి రగిలిపోతున్న దామోధర…ఇప్పుడిలా రియాక్ట్‌ అయ్యారనే టాక్‌ విన్పిస్తోంది.అయితే కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డికి, ఎమ్మెల్యే సంజయ్ కి మధ్య అస్సలు పొసగడంలేదని బహిరంగ రహస్యమే. సీఎం రేవంత్ రెడ్డి మనిషిగానే ఎమ్మెల్యే సంజయ్ కి ముద్ర పడింది. సంజయ్ సైతం నియోజకవర్గ అభివృద్ది నిధుల కోసం నేరుగా సీఎంనే సంప్రదించి నిధులను మంజురు చేయించుకుంటున్నారట.అయితే సంజయ్ కుమార్ కి, జీవన్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి దామోదర చేసిన కామెంట్స్‌ ఇప్పుడు కాకపుట్టిస్తున్నాయి. దీనిపై సంజయ్‌ కుమార్‌ వర్గం అసహనం వ్యక్తం చేస్తుండగా…అటు సీయం రేవంత్‌ ఈ అంశంపై ఎలా రియాక్ట్‌ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Read more:New Delhi : అమెరికాకు భారత్ స్టాండ్ వివరించిన ప్రధాని

Related posts

Leave a Comment