Tirupathi : కుప్పంలో చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

Chandrababu's grand entry in Kuppam.

Tirupathi :ఏపీ సీఎం చంద్రబాబకొత్త ఇంటి గృహప్రవేశం అంగరంగ వైభవంగా సాగింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. వేకువ జామున శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. కుటుంబ సభ్యులకు కలిసి గృహప్రవేశం చేశారు. ఈ వేడుకకు సుమారు 25 వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు.

కుప్పంలో చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ.

తిరుపతి, మే 26
ఏపీ సీఎం చంద్రబాబకొత్త ఇంటి గృహప్రవేశం అంగరంగ వైభవంగా సాగింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. వేకువ జామున శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. కుటుంబ సభ్యులకు కలిసి గృహప్రవేశం చేశారు. ఈ వేడుకకు సుమారు 25 వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. సొంత నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలనే ఆయన చిరకాల కోరిక నెరవేరింది. ఈ వేడుకలు పసుపు కుంకుమలతో మహిళలను ఆహ్వానించడం విశేషం. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నేత గృహప్రవేశంలో భాగస్వామ్యులయ్యారు. ఈ గృహప్రవేశంతో కుప్పంలో సందడి వాతావరణం నెలకొంది. కొద్ది రోజుల కిందట గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. అన్ని హంగులతో దీనిని నిర్మించారు.మూడున్నర దశాబ్దాలుగా కుప్పంనియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చంద్రబాబు.

అక్కడ సొంత ఇల్లు కట్టుకోవాలని చాలాకాలంగా భావిస్తూ వచ్చారు. స్థానికంగా ఇల్లు లేకపోవడంతో ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేసేవి. అందుకే సొంత ఇంటిని నిర్మించుకోవాలని కొన్నేళ్ల కిందట నిర్ణయించుకున్నారు చంద్రబాబు. కుప్పంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. అన్ని హంగులతో ఇంటిని నిర్మించి ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాగా శనివారం రాత్రికి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు. పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. గృహప్రవేశ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.గృహప్రవేశ వేడుకల్లో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు.. వారి కుమారుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకేష్ దంపతులు కుప్పం చేరుకున్నారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా కుప్పం చేరుకున్నారు. గృహప్రవేశ వేడుకకు భారీగా ఏర్పాట్లు చేశారు. సుమారు 25 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. శనివారం రాత్రి బంధుమిత్రులకు, విఐపి లకు విందు వడ్డించారు. ఇందుకుగాను ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 25 వేల మంది సాధారణ ప్రజలకు, 2000 మంది వీఐపీలకు భోజనాలు సిద్ధం చేశారు.కుప్పం నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి ఆహ్వానాలు పంపారు. ప్రతి ఒక్కరూ గృహప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని టిడిపి శ్రేణులకు సూచనలు అందాయి. మరోవైపు పసుపు కుంకుమలు ఇచ్చి మహిళలకు సాంప్రదాయ బద్ధంగా ఆహ్వానించారు. కుప్పంలో పండుగ వాతావరణం లో చంద్రబాబు గృహప్రవేశం జరిగింది. టిడిపి శ్రేణులు తమ సొంత కార్యక్రమంలో భావించి ఏర్పాట్లలో మునిగిపోయాయి.

Read more:AP : మహానాడులో రాయలసీమ రుచులు

Related posts

Leave a Comment