Hyderabad : అమల్లోకి స్లాట్ బుకింగ్ విధానం

slot-booking

Hyderabad :రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం… స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

అమల్లోకి స్లాట్ బుకింగ్ విధానం

హైదరాబాద్, జూన్ 3
రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం… స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.ఈ సరికొత్త విధానంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువ‌స్తున్న నేప‌ధ్యంలో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు రాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులకు సూచించారు.స్లాట్ బుకింగ్ విధానంతో స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయని మంత్రి పొంగులేటి చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేసిన చోట్ల… ఆస్తుల క్ర‌య విక్ర‌య‌దారుల‌కు స‌మ‌యం ఆదా అయిందని… పార‌ద‌ర్శ‌కంగా మెరుగైన సేవ‌లు అందాయని చెప్పారు. 94 శాతం ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేశారని వివరించారు.ప్ర‌యోగాత్మ‌కంగా మొద‌టి ద‌శ‌లో ఏప్రిల్ 10వ తేదీన 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఇక్క‌డ‌ మంచి ఫ‌లితాలు రావ‌డంతో మే 12వ తేదీ నుంచి 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లు చేశారు.

ఈ రెండు విడ‌త‌లు క‌లిపి 47 చోట్ల అమ‌లు చేసిన విధానం విజ‌య‌వంత‌మైంద‌ని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ రెండు విడ‌త‌ల్లో క‌లిపి మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. గత పద్ధతితో పోల్చితే…. స్లాట్ బుకింగ్ వల్ల మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయని పేర్కొన్నారు.అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేథ( ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ -ఎఐ) అనుసంధానంతో కూడిన చాట్‌బాట్ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ నూత‌న ప్ర‌క్రియ వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారికి క‌లిగే సందేహాలు నివృత్తి అవుతాయి. అంతేగాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివ‌రాలు, స‌మ‌యం అందుబాటు వంటి స‌మాచారం ల‌భిస్తుంది. గిప్ట్ డీడ్‌, సేల్ డీడ్ పై రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు మార్కెట్ ధ‌ర‌లు త‌దిత‌ర అన్ని అంశాల‌పై ఈ… ఏఐ చాట్‌బాట్ – మేథ ద్వారా స‌మాచారం తెలుసుకోవ‌చ్చు.

త్వరలో డెవ‌ల‌ప‌ర్ రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్ ను తీసుకువస్తామని మంత్రి పొంగులేటి తాజాగా ప్రకటించారు. డబుల్ రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గ‌కుండా, రిజిస్ట్రేష‌న్ పూర్త‌యిన వాటి వివరాలు, పూర్తి కాని వాటి వివ‌రాలు ఇందులో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ మాడ్యూల్ లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు రెడ్ కలర్ లో కనిపిస్తాయని వివరించారు.ఉద‌యం 10.30 గంట‌ల నుంచి లంచ్ స‌మ‌యాన్ని మిన‌హాయించి సాయింత్రం 5 గంట‌ల వ‌ర‌కూ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు. ప్ర‌తి కార్యాల‌యంలో రోజుకు 48 స్లాట్‌లు బుక్ అవుతాయి. స్లాట్ బుకింగ్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్య‌వ‌స‌ర సంద‌ర్భాల‌లో సాయంత్రం 5 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు ఐదు వాకిన్ రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం జరుగుతుంది.బుకింగ్‌తోపాటు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌డంలో భాగంగా ఆధార్‌-ఈ సంతకం ప్ర‌వేశ‌పెడుతున్నారు. ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ప్రయోగాత్మక అమలుచేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.

Read more:Miss World : తెలంగాణ ప్రతిష్ట పెంచిన అందాల పోటీలు

Related posts

Leave a Comment