Tollywood : మీరు సరిగ్గా గమనిస్తే ఒక్క వారంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు టాలీవుడ్ తో ఉన్న సంబంధాల్లో వచ్చిన మార్పు క్లియర్ గా కనబడుతుంది. టాలీవుడ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం థియేటర్ల ఇష్యూ లో నిర్మాతలతో గ్యాప్ తెచ్చుకుంటే మరోవైపు తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డుల ప్రకటన తో దగ్గరయ్యే పనిలో పడింది.
టాలీవుడ్ లో మారిన సీన్..
తెలంగాణకు దగ్గర.. ఏపీకి దూరం..
హైదరాబాద్, జూన్ 2
మీరు సరిగ్గా గమనిస్తే ఒక్క వారంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు టాలీవుడ్ తో ఉన్న సంబంధాల్లో వచ్చిన మార్పు క్లియర్ గా కనబడుతుంది. టాలీవుడ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం థియేటర్ల ఇష్యూ లో నిర్మాతలతో గ్యాప్ తెచ్చుకుంటే మరోవైపు తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డుల ప్రకటన తో దగ్గరయ్యే పనిలో పడింది. తెలుగు ప్రజలకు సినిమాతో అవినాభావ సంబంధం ఉంది.హీరోలకు అతిపెద్ద ఫాలోయింగ్ ఆంధ్ర ప్రాంతంలో ఉంటే కలెక్షన్ల పరంగా నైజాం ప్రాంతం ముందు వరుసలో ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఎప్పుడూ సినీ ప్రపంచంతో దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాయి. అలాగే టాలీవుడ్ కూడా ప్రభుత్వం గుడ్ లక్స్ లో ఉండేందుకు తాపత్రయపడుతుంది. రిలీజ్ టైం లో టికెట్ ధరలు పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేక సినిమాలకు ట్యాక్స్ బెనిఫిట్ పొందడానికి ముఖ్యమంత్రుల పర్మిషన్ తప్పనిసరి కావడంతో బడా హీరోలు పెద్ద నిర్మాతలు ప్రభుత్వాలతో వివాదం కొనితెచ్చుకునే ప్రయత్నం చేయరు. కానీ గడిచిన వారంలో అనూహ్య పరిస్థితులు టాలీవుడ్ లో ఒక గందరగోళ ఎట్మాస్పియర్ని క్రియేట్ చేశాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా “హరిహర వీరమల్లు ” ను అడ్డుకోవడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.
టాలీవుడ్ లోని కొందరు నిర్మాతలు కావాలనే థియేటర్ల బంద్ ఇష్యు తెరపైకి తెచ్చి తనకు ఇబ్బంది కలుగ చేస్తున్నారని సినిమా హాళ్ల కేటాయింపు వెనక ఉన్నది “ఆ నలుగురు నిర్మాతలు ” అంటూ అనుమానం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. ప్రెస్ మీట్ లు పెట్టి అల్లు అరవింద్, ‘దిల్ ‘రాజు అలాంటివాళ్లు తమకు ఈ గొడవకు సంబంధం లేదన్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ లోని థియేటర్లలో సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన చేతుల్లోనే ఉండడంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని మంచి చేసుకునే పనిలో టాలీవుడ్ బడా బాబులు పడ్డారు. అయితే ఆర్ నారాయణ మూర్తి లాంటి కొందరు ప్రముఖులు మాత్రం పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇక సినీ రంగానికి ఎప్పుడు దగ్గరగా ఉండే టీడీపీ ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తుంది.
దానితో అసలు ఈ వివాదం ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుంది అంటూ టాలీవుడ్ ఎదురుచూస్తుంది. ఏదేమైనా సినీ ప్రపంచంతో దగ్గరగా ఉండే ఏపీలోని కూటమి ప్రభుత్వంతో ఇలాంటి వివాదం రావడం టాలీవుడ్ కి మింగుడు పడడం లేదు. “పుష్ప 2” సినిమా విడుదల సమయంలో జరిగిన పరిణామాలు ఎంతటి సంచలన సృష్టించాయో అందరికి తెలిసిందే. ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాట జరగడం ఒక మహిళ మృతి చెందడం దానికి కారణం అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షో కి వెళ్లడం అంటూ ఆయన్ని ఒకరోజు జైల్లో పెట్టడం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన అంశాలతో టాలీవుడ్ పట్ల రేవంత్ సర్కార్ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుంది అన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటి గ్యాప్ ఏది లేదని తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డులతో తేలిపోయింది. ముఖ్యంగా “పుష్ప 2” లో నటనకు అల్లు అర్జున్ కు అవార్డు ప్రకటించారు.
అదే సమయంలో తెలంగాణ నుంచి స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ కు కూడా అవార్డు లభించింది. ఒకేసారి పదేళ్ల పెండింగ్ అవార్డు లు ప్రకటించడం తో దాదాపు టాలీవుడ్ లోని అగ్రహీరోలు ఏదో ఒక క్యాటగిరిలో అవార్డు పొందారు. ఇది కచ్చితంగా రేవంత్ సర్కార్ తో టాలీవుడ్ కి సంబంధాలు మరింత పెరుగుపడే విషయమే.ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మించే వ్యవస్థగా మారిన టాలీవుడ్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం అలాగే ప్రభుత్వాలకు టాలీవుడ్ నుంచి లభించే ఆదాయం రెండూ ముఖ్యమే. అయితే ఇందులో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉండేది అని ఒక అభిప్రాయం మొన్నటి వరకు ఉండేది. లేనిపోని వివాదాల నడుమ టాలీవుడ్ తో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సత్సంబంధాల వైఖరి కుడి ఎడమయింది. మరి వీలైనంత త్వరగా ఈ థియేటర్ల వివాదం కూడా ముగిసిపోయి ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ల స్నేహం కూడా ఒకప్పటి స్థితికి వెళ్లాలని సినీ ప్రపంచం కోరుకుంటుంది.
Read more:Movie news : సినిమా వార్తలు
