Andhra Pradesh:సగం ధరకే పశువుల దాణా

AP government has good news for dairy farmers. It will provide nutritious cattle feed at a 50 percent discount to dairy farmers with white ration cards.

Andhra Pradesh:పాడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 50 శాతం రాయితీతో పోషకాలతో కూడిన పశువుల దాణా అందించనుంది. కుటుంబానికి గరిష్టంగా రెండు పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకు గాను 450 కేజీల దాణాను పంపిణీ చేయనుంది. రూ.1100 విలువైన 50 కేజీల దాణా బస్తాను రూ.555కే అందించనుంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.

సగం ధరకే పశువుల దాణా

ఏలూరు, మే 5
పాడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 50 శాతం రాయితీతో పోషకాలతో కూడిన పశువుల దాణా అందించనుంది. కుటుంబానికి గరిష్టంగా రెండు పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకు గాను 450 కేజీల దాణాను పంపిణీ చేయనుంది. రూ.1100 విలువైన 50 కేజీల దాణా బస్తాను రూ.555కే అందించనుంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.పశువుల పెంపకందారులకు పోషకాలతో దాణా అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కిలో రూ.22.11కు కొనుగోలు చేసి రైతు సేవా కేంద్రాలు, పశు వైద్యశాలల ద్వారా రూ.11.10కే పంపిణీ చేయనుంది. 20 శాతం ప్రొటీన్ కలిగిన పశువుల దాణాను పాడిరైతులకు అందించనుంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడిరైతులను ఈ లబ్ధి పొందేందుకు అర్హులుగా నిర్ణయించింది.ఒక్క కుటుంబానికి రెండు పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకు విడతల వారీగా 450 కిలోల దాణాను 50 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 లక్షల మంది పాడిరైతులకు లబ్ధి చేకూరేలా రూ.69 కోట్ల వ్యయంతో 31,067 టన్నుల దాణా పంపిణీకి ఏపీ పశు సంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది.50 కిలోల పశువుల దాణా బస్తాను రూ.1,100కు కొనుగోలు చేసి రూ.555లకే పాడి రైతులకు అందజేస్తారు.

రైతులకు 50 శాతం రాయితీతో దాణా పంపిణీ చేయడం వల్ల ఆర్థికంగా అదనపు భారం పడుతున్నప్పటికీ..రైతులు వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు చేపట్టారు.పశువుల విక్రయాలు తగ్గించేందుకు, పాడి ఉత్పత్తులు పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. అర్హులైన పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరారు. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంపై అప్డేట్ ఇచ్చింది. మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు అందించనుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనతో కలిపి దీనిని అమలు చేస్తారు.రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా మూడు విడతల్లో రూ.20 వేలు అందించనున్నారు. ఇందులో పీఎం కిసాన్ ద్వారా కేంద్రం రూ.6000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14000 కలిపి మొత్తం రూ.20 వేలు అందించనున్నారు. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

Read more:Andhra Pradesh:సూపర్ సిక్స్ అమలు ఎప్పుడు

Related posts

Leave a Comment