Andhra Pradesh : వైఎస్ రెడ్డి ఎవరో తెలుసా

ED has arrested a person named YS Reddy,

Andhra Pradesh :ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న వైఎస్ రెడ్డి అనే వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. ముంబై,  హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఈ డి నగదు, నగలు స్వాధీనం చేసుకుంది.    మొత్తం 9 కోట్లు ఐదు వందల నోట్లు దొరికాయి. 8 కోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్ రెడ్డి ఎవరో తెలుసా

విజయవాడ, మే 16
ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న వైఎస్ రెడ్డి అనే వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. ముంబై,  హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఈ డి నగదు, నగలు స్వాధీనం చేసుకుంది. మొత్తం 9 కోట్లు ఐదు వందల నోట్లు దొరికాయి. 8 కోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆభరణాలతో కలిపి మొత్తం 23 కోట్ల రూపాయల విలువచేసే నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు.  ముంబైలో  41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలపై ఈడి కేసు నమోదు చేసింది.  బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు.  అనధికార భవన అనుమతుల ద్వారా మనీ లాండరింగ్‌కు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు ఈడీ తేల్చిది.  ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద నమోదు చేశారు.

ఈడీ హైదరాబాద్ మరియు ముంబైలోని వై.ఎస్. రెడ్డి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించి, అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించింది.  ఈడీ అధికారులు గణనీయమైన మొత్తంలో నగదు, బంగారం, మరియు వజ్రాలను స్వాధీనం చేశారు.  ఈ కేసులో ఇతర వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన గురించి  సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.      వాసాయి-విరార్ ప్రాంతంలో దశాబ్ద కాలంగా అవినీతికి పాల్పడుతున్నారు.   మురుగునీటి శుద్ధి, డంపింగ్ కోసం ఉద్దేశించిన భూమిపై అక్రమంగా  నలభై ఒక్క భవనాలు నిర్మించారు.   ఎప్పుడూ అమ్మకూడని లేదా నిర్మించకూడని భూమిగా దాన్ని నిర్దారించరాు. అయితే  సంవత్సరాలుగా, బిల్డర్లు నకిలీ అనుమతులను ఉపయోగించి ఈ ఫ్లాట్‌లను  కొనుగోలుదారులకు విక్రయించారు.   వాసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు. ఈ వైఎస్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ నిర్మాణాలను కూల్చివేయాలని బాంబే హైకోర్టు కూల్చివేతకు ఆదేశించింది. సుప్రీంకోర్టు దానిని సమర్థించింది.

Read more:Andhra Pradesh : ఇప్పటి నుంచే పక్కా ప్లాన్..

Related posts

Leave a Comment