YS jagan : సూపర్ స్టార్ ఫ్యామిలీపై జగన్ పార్టీ దృష్టి

Jagan's party focuses on superstar family

YS jagan :వైఎస్ జగన్మోహన్ రెడ్డిపోయిన చోటే వెతుక్కుంటున్నారా? తన నుంచి దూరమైన వర్గాలను దరి చేర్చుకునే పనిలో పడ్డారా? సినీ రంగంపై ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల నాటికి సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది.

సూపర్ స్టార్ ఫ్యామిలీపై జగన్ పార్టీ దృష్టి

గుంటూరు, జూన్ 2
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపోయిన చోటే వెతుక్కుంటున్నారా? తన నుంచి దూరమైన వర్గాలను దరి చేర్చుకునే పనిలో పడ్డారా? సినీ రంగంపై ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల నాటికి సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. సినీ పరిశ్రమ ఎంతగానో సంతోషించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన సంపూర్ణ విజయం సాధించడంతో సినీ ప్రముఖులు సైతం అభినందనలు తెలిపారు. అయితే సినీ పరిశ్రమ అంతా కూటమికి అండగా ఉందని భావించారు. కానీ మొన్నటి థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని.. పవన్ హరిహర వీరమల్లు చిత్రం అడ్డుకునేందుకేనని అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో వైసీపీకి చిత్ర పరిశ్రమకు చెందిన మనుషుల మద్దతు ఉందని అర్థమవుతోంది.అల్లు అర్జున్ఎపిసోడ్ అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ జనసేన కూటమిగా వెళ్లింది.

టీడీపీ, బీజేపీలతో కలిసి ప్రయాణించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా ప్రకటించింది. సరిగ్గా అటువంటి సమయంలోనే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. దీంతో కూటమికి వ్యతిరేకంగా ఆయన అభిమానులకు పిలుపునిచ్చినట్టు అయ్యింది. తద్వారా తాను కూటమికి వ్యతిరేకం అన్న సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తరువాత, పుష్ప 2 విడుదల, ఆపై అల్లు అర్జున్ అరెస్టు సమయంలో సైతం వైసీపీ పూర్తిగా అల్లు అర్జున్ కు అండగా నిలిచింది. న్యాయ సహాయం అందించింది. తద్వారా అల్లు అర్జున్ రూపంలో తమకు మద్దతు ఉంటుందని ఒక అంచనాకు వచ్చింది.సూపర్ స్టార్ క్రిష్ణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రత్యేకంగా స్పందించారు. ఈ రోజు క్రిష్ణ జయంతి. ప్రముఖులంతా సంతాపం తెలిపారు. తండ్రి జయంతి సందర్భంగా మహేష్ బాబు నాన్నా అంటూ ప్రేమగా పిలుచుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం నివాళులర్పించారు. నటుడిగా, దర్శకుడి, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు..సినీ ప్రీయుల అభిమానాన్ని చూరగొన్న తెలుగు సినీ కథనాయకుడు, సాహస నిర్మాత జయంతి సందర్భంగా ఆయన సినీ రంగానికి, కళామతల్లికి అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నా.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేశారు.

అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమోషనల్ పోస్టు పెట్టారు. సినిమాల్లోనే కాదు..నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ క్రిష్ణ హీరోగా నిలిచారు. సినిమా రంగంలో ఆజాత శత్రువుగా పేరొందిన ఆయన టాలివుడ్ లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అల్లూరి పేరు చెబితే మన మనసులో క్రిష్ణ మెదులుతారు. రాజకీయాల్లో కూడా రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నకు అత్యంత ఆప్తులైన క్రిష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. అయితే అప్పుడెప్పుడో క్రిష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుతో పాటు నివాళులర్పించిన ఫోటో షేర్ చేశారు. అయితే చాలా ఏళ్లు కిందటే జగన్ తో విభేదించి ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరిపోయారు. అటు క్రిష్ణ అల్లుడు గల్లా జయదేవ్ కుటుంబమంతా టీడీపీలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ పోస్టు చూస్తుంటే మాత్రం క్రిష్ణ కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నాలు అన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more:Lokesh : లోకేష్ కు పదోన్నతి. ఏకాభిప్రాయం సాధించిన టీడీపీ

Related posts

Leave a Comment