Hyderabad : ఇక ఖాళీ స్థలాలకు ట్యాక్స్

telangana news

Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీకు ఓపెన్ ప్లాట్ ఉందా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు ఖాళీ స్థలానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని ఖాళీ స్థలాల యజమానులకు పన్ను చెల్లించాలని సూచించారు.

ఇక ఖాళీ స్థలాలకు ట్యాక్స్

హైదరాబాద్, జూన్ 3
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీకు ఓపెన్ ప్లాట్ ఉందా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు ఖాళీ స్థలానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని ఖాళీ స్థలాల యజమానులకు పన్ను చెల్లించాలని సూచించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ నుండిచిపొందిన వివరాల ఆధారంగా.. వేకెంట్ ల్యాండ్ టాక్స్ బకాయిల వివరాలను అన్ని జోన్లు, సర్కిళ్లు, డివిజన్లకు అందించింది. ఈ బకాయిలను వసూలు చేయడానికి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కింది స్థాయిలోని బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లకు లక్ష్యం టార్గెట్లను నిర్దేశించి, రోజువారీ పురోగతిని పర్యవేక్షించాలని చెప్పారుఇక జీహెచ్ఎంసీ కమిషనర్ ట్రేడ్ లైసెన్సుల జారీ అధికారాన్ని ఇటీవల సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు బదిలీ చేశారు. గతంలో ఈ అధికారం గ్రేటర్ పరిధిలోని సహాయ వైద్యాధికారులు, పశువైద్యాధికారుల వద్ద ఉండేది.

అవకతవకలు, జవాబుదారీతనం లోపం వంటి సమస్యలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. పన్ను వసూళ్ల బాధ్యత కూడా డిప్యూటీ కమిషనర్లదేనని జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో జీహెచ్ఎంసీ రూ. 2,038 కోట్లకు పైగా ఆస్తి పన్నును వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇది జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధిక వసూలు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ. 121 కోట్లకు పైగా ఎక్కువ. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ రూ. 3,000 కోట్ల ఆస్తి పన్ను వసూలును లక్ష్యంగా పెట్టుకుంది. పౌరులు తమ ఆస్తి పన్నును జీహెచ్ఎంసీ వెబ్‌సైట్, మీసేవ కేంద్రాలు, లేదా నిర్దేశిత బ్యాంక్ శాఖల ద్వారా చెల్లించవచ్చు. సకాలంలో పన్ను చెల్లించకపోతే నెలకు 2శాతం వడ్డీ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. పన్ను వడ్డీ భారం తప్పాలంటే బాధ్యతగా ట్యాక్స్ చెల్లించాలని సూచిస్తున్నారు.

Read more:Education system : మారుతున్న విద్యావిధానం

Related posts

Leave a Comment