Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అల్లరి నరేష్, సుబ్బు మంగదేవి, హాస్య మూవీస్ #N62 అనౌన్స్ మెంట్..

0

హీరో అల్లరి నరేష్ వెరైటీ సబ్జెక్ట్‌ లను ఎంచుకుంటున్నారు. ఈరోజు ఆయన 62వ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. #N62 చిత్రానికి సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తుండగా, తాజాగా సామజవరగమనతో బ్లాక్ బస్టర్  అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. నరేష్ పుట్టినరోజు సందర్భంగా   యూనిక్ స్టైల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా చేసిన అనౌన్స్ మెంట్ ఆసక్తికరంగా ఉంది.దర్శకుడు, అల్లరి నరేష్‌కి ఫోన్ చేసి కథ చెప్పడానికి మాస్ బార్‌ ను సెలెక్ట్ చేసుకుంటాడు.

‘సిద్ధార్థ్ రాయ్’ టీమ్ ని అభినందించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్..

లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామా అంశాలతో కూడిన కథ నరేష్‌ని మెప్పించిన తర్వాత.. సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. ఈ కథ చాలా యూనిక్ గా వుంటుంది.  ఇందులో నరేష్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు.  ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే  అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు. హీరో భావోద్వేగ ప్రయాణంలో సాగే కథ 1990 నేపథ్యంలో ఉంటుంది. సెప్టెంబర్ చివరి నుంచి షూట్‌ ను ప్రారంభిస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie