జనసేన ఆచితూచి అడుగులు | Janasena Step by step | Eeroju news

జనసేన ఆచితూచి అడుగులు కాకినాడ, జూన్ 18, (న్యూస్ పల్స్) Janasena Step by step ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన పార్టీ పోషించింది కీలక పాత్ర. ఇక ప్రభుత్వం నడపడంలోనూ దాన్ని కొనసాగించాలి. పొత్తులో ఉన్నంత మాత్రానా టీడీపీ నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ‘‘డూ డూ బసవన్న’’ లాగా జనసేన తలూపడం శోభించదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగేట్టు, ప్రభుత్వంపై అవసరం మేర ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుందిముఖ్యమంత్రి తర్వాత ఉపముఖ్యమంత్రిదే రెండో స్థానం అనుకుంటారు చాలామంది. అయితే రాజ్యాంగంలో ఉపముఖ్యమంత్రి పదవి గురించి ఏ ప్రస్తావనా లేదు. ఈ రాజకీయ పదవికి సంబంధించి చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఉపముఖ్యమంత్రికి అన్ని అధికారాలు ఇచ్చిన దాఖాలాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. అంతకముందు జగన్ మంత్రివర్గంలో పని చేసిన ఉపముఖ్యమంత్రులు అయినా, తెలంగాణలో…

Read More

అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక భరోసా | Amaravati is a financial guarantee for Andhra Pradesh | Eeroju news

అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక భరోసా విజయవాడ, జూన్ 18, (న్యూస్ పల్స్) Amaravati is a financial guarantee for Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పలు రంగాలు గణనీయమైన వృద్ధిని, అభివృద్ధిని సాధిస్తాయని భావిస్తున్నారు. అమరావతి ఆశాజనక భవిష్యత్తుపై నిపుణులు, పారిశ్రామికవేత్తలు లైవ్ మింట్ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టూరిజం రంగాలు అత్యధిక వృద్ధిని నమోదు చేయనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల వలసలకు ఊతమిచ్చేలా సౌకర్యాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతి టోపోగ్రాఫికల్ స్థానం స్థిరమైన, ప్రణాళికాబద్ధమైన, హరిత నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావిస్తున్నారు.ఈవై ఇండియా పార్టనర్, ఎకనామిక్ డెవలప్మెంట్ అడ్వైజరీ లీడర్ ఆదిల్ జైదీ మాట్లాడుతూ.. కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరావతి నగరం…

Read More

ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్ | Pawan, who has taken the branches to be with the people | Eeroju nres

ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్ కాకినాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Pawan, who has taken the branches to be with the people : శాఖల కేటాయింపులో టీడీపీ మిత్రధర్మాన్ని పాటించింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ముఖ్యమైన శాఖలు కేటాయించడంతో పాటు, అదే పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు కీలకమైన పౌరసరఫరాల శాఖను అప్పగించింది. జనసేనకు సినీరంగంతో ఉన్న సంబంధాలు, పవన్‌ సినీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి విజ్ఞప్తి మేరకు కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. జనసేనానికి హోంశాఖ, ఆర్థిక శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ  ప్రజావసరాలు, పార్టీ బలోపేతంపై ద‌ృష్టిపెట్టిన ఆయన ప్రజలతో మమేకమయ్యే శాఖలనే ఏరికోరి ఎంచుకుని ప్రత్యేకత చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా జనసేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే కొనసాగనున్నారు.…

Read More

టార్గెట్ కొడాలి… అనిత ఫిక్స్ | Target Kodali… Anita Fix | Eeroju news

టార్గెట్ కొడాలి… అనిత ఫిక్స్ విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Target Kodali… Anita Fix : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో నాయకులు తెగ హడావిడి చేశారు. మీడియాను తమ వైపు తిప్పుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చేసాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలలో కనీసం ప్రతిపక్ష పార్టీ లేకుండా చేశారు. గత అధికార పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఏపీలో రాజకీయాల్లో కాక తగ్గడం లేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఇందులో కీలకమైన హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా…

Read More

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ | Redistribution to YCP… tension | Eeroju news

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ తిరుపతి, జూన్ 17,(న్యూస్ పల్స్) Redistribution to YCP… tension : ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పలేదు. మున్ముందు ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనను టిడిపి కూటమి సర్కార్ పునః సమీక్షించే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయంలో లోపాలు వెతికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మద్యం వంటి భారీ కుంభకోణంలో జగన్ తో పాటు కీలక నేతల పాత్రను టిడిపి సర్కార్ బయట పెట్టే అవకాశం ఉంది. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు వంటి అంశాల్లో భారీ లోపాలు ఉన్నాయి. అయితే ఒక్క కేసులతోనే కాదు.. వైసిపి నిర్వీర్యమయ్యే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు విడిచిపెట్టారు. అది జగన్ కు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వ…

Read More

జూలై నుంచి ఫ్రీ బస్సు | Free bus from July | Eeroju news

జూలై నుంచి ఫ్రీ బస్సు కడప, జూన్ 17, (న్యూస్ పల్స్) Free bus from July : ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా.. చంద్రబాబు ఆర్టీసీ పల్లె వెలుగుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఏపీ అధికారులు. ఈ పథకంతో ఎంత భారం పడుతుంది? ఆర్టీసీ సర్వీసులపై చూపే ప్రభావం ఎంత? వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారుసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తరువాత రోజు బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347…

Read More

కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు | Nominated posts for hardworking | Eeroju news

కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Nominated posts for hardworking : నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారుపార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామన్నారు. నేతలు, కార్యకర్తలు సాధికారిత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయన్నారు. అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజుల్లోనే తెరిపిస్తామని స్పష్టం చేశారు. కూటమి విజయం వెనుక కార్యకర్తలు, నాయకులు కష్టం, కృషి ఎంతో ఉందన్నారు. 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈ ఎన్నికల్లో…

Read More

రాజ్ మహల్ ప్యాలెస్ తరహా నిర్మాణం… | Raj Mahal Palace style… | Eeroju news

రాజ్ మహల్ ప్యాలెస్ తరహా నిర్మాణం… రుషికొండలో ఇంటిని చూపించిన గంటా విశాఖపట్టణం, జూన్ 17, (న్యూస్ పల్స్) Raj Mahal Palace style : రుషికొండపై అత్యంత రహస్యంగా నిబంధనలకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ భవనాన్ని తలపించే నిర్మాణాన్ని చేపట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.అత్యంత రహస్యంగా రూ.500 కోట్లు వెచ్చించి రాజమహల్ తరహాలో భవనాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన మొత్తం సైటు 61 ఎకరాలు కాగా, 9.8 ఎకరాల్లో భవనాన్ని రూ.500 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారన్నారు.ఏడు బ్లాకుల్లో సాగిన నిర్మాణాలకు ఒక్కో పేరు పెట్టారని గంటా వెల్లడించారు. పూర్వీకులు కాలంలో, సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు నిర్మించుకున్న తరహాలో జగన్మోహన్ రెడ్డి ఈ భవన నిర్మాణాలను…

Read More

బీజేపీలోకి విజయసాయిరెడ్డి… | Vijayasai Reddy joins BJP | Eeroju news

బీజేపీలోకి విజయసాయిరెడ్డి… నెల్లూరు, జూన్ 17, (న్యూస్ పల్స్) Vijayasai Reddy joins BJP : వైసీపీ కీలక నేత బిజెపిలో చేరుతున్నారా? ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? కాషాయ దళంతో టచ్ లోకి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురయింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వ నిర్ణయాలపై టిడిపి సర్కార్ పునసమీక్షిస్తోంది. దీంతో తమకు కేసులతో ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు భయపడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలోనే వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. గతంలో ఓటమి ఎదురు కావడంతో చంద్రబాబు ఎటువంటి ఆలోచన చేశారో.. ఇప్పుడు జగన్ సైతం అదే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.2019లో టిడిపికి…

Read More

గుడివాడలో నాని ఫ్లెక్సీల కలకలం | In Gudivada, Nani Flexila Kakalam | Eeroju news

గుడివాడలో నాని ఫ్లెక్సీల కలకలం గుడివాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) In Gudivada, Nani Flexila Kakalam: గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమితో పాటు రాష్ట్రంలోనే వైఎస్ఆర్ సీపీ దారుణ స్థాయిలో అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులకు కాస్త ఇబ్బంది కలిగించే విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హాయాంలో మంత్రి పదవుల్లో ఉన్న కొడాలి నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్ నాథ్, పేర్ని నాని లాంటి వారు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో చంద్రబాబుపై చేసిన ఛాలెంజ్‌ల కారణంగా కొడాలి నాని మాత్రం మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొడాలి నానిపై  సోషల్ మీడియాలో ట్రోల్స్, బయట నిరసనలు మామూలుగా ఉండడం లేదు. సందర్భం దొరికిన ప్రతి…

Read More