Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హెచ్​ఏఎల్​షేర్లలో భారీ పెరుగుదల ఐదేళ్లలో ఐదు రెట్లు

Huge increase in HAL shares

0

రూ. 3857 వద్ద కొనసాగిన షేర్​ ధర
కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ఇప్పటికే పలు రంగాలు వృద్ధి వైపు పయనిస్తున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. భారత రక్షణ, విమానయాన రంగంలోని కీలక సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వృద్ధిలో మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేరు ధర రూ.3857.9కి చేరింది. ఐదేళ్ల క్రితం వెయ్యి రూపాయల లోపే ఉన్న హెచ్‌ఏఎల్ షేర్ ధర.. ఐదేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ఐదేళ్లలో హెచ్‌ఏఎల్ సాధించిన ఈ విజయం కేంద్రానికే చెందుతోందని పలువురు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

LCA -Light Combat Aircraft (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)ని కంపెనీ

LCA -Light Combat Aircraft10

HAL fighter jet Tejas, light weight helicopter Dhruv హెచ్‌ఏఎల్ యుద్ధ విమానం తేజస్, లైట్ వెయిట్ హెలికాప్టర్ ధృవ్ వంటి వాటిని ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకు చాలా దేశాలు హెచ్‌ఏఎల్‌తో చర్చలు జరుపుతున్నాయి. భారత వైమానిక దళం కోసం తేజస్, ధ్రువ్, ప్రచండ, రుద్ర వంటి విమానాలు, హెలికాప్టర్లను హెచ్​ఏఎల్​తయారు చేస్తోంది. దీనితో పాటు భారత వైమానిక దళం కోసం భవిష్యత్ యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేస్తోంది. రష్యా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానాలను సైతం హెచ్‌ఏఎల్ తయారు చేసింది. ప్రస్తుతం ఎల్​సీఏ LCA -Light Combat Aircraft (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)ని కంపెనీ తయారు చేస్తోంది. దీనినే తేజస్ అని కూడా అంటారు.

Also Read: అమిత్ షాతో బండి భేటీ

LCA -Light Combat Aircraft10

దీనితో పాటు, ఈ కంపెనీ డోర్నియర్ వంటి ప్రయాణీకుల విమానాలను కూడా తయారు చేస్తుంది. ఇంకా హెచ్​ఏఎల్​ధృవ్, చిరుత, చేతక్, లాన్సర్, చీతల్, రుద్ర, ఎల్​సీహెచ్, ఎల్​యూహెచ్​లను తయారు చేస్తుంది. Indian public sector aerospace – defense company Hindustan Aeronautics Ltd భారతీయ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ – డిఫెన్స్ కంపెనీ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను 23 డిసెంబర్ 1940న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. హెచ్​ఏఎల్​ప్రపంచంలోని పురాతన, Largest Aerospace, Defense అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీదారులలో ఒకటిగా ఉంది. కాగా మొదటి సారిగా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థకు చెందిన షేర్​ ఈ రేంజ్​లో పెరగడం అరుదేనని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులోనూ ఈ పెరుగుదల నమోదవుతూనే ఉండే అవకాశం ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie